RR vs MI Live Updates: 8.2 ఓవర్లలో ముంబై స్కోరు 94-2, ఎనిమిది వికెట్లతో ముంబై విజయం

IPL 2021, Match 51, MI vs RR: ఐపీఎల్‌లో నేడు రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో ముంబై ఇండియన్స్ సాధించింది.

ABP Desam Last Updated: 05 Oct 2021 10:37 PM
8.2 ఓవర్లలో ముంబై స్కోరు 94-2, ఎనిమిది వికెట్లతో ముంబై విజయం

8.2 ఓవర్లలోనే ముగిసేసరికి ముంబై స్కోరు 94-2కు చేరుకుంది. ఎనిమిది వికెట్లతో ముంబై విజయం


హార్దిక్ పాండ్యా 5(6)
ఇషాన్ కిషన్ 50(25)
ముస్తాఫిజుర్ 2.2-0-32-1

8 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 84-2, లక్ష్యం 91 పరుగులు

చేతన్ సకారియా వేసిన ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 84-2గా ఉంది. విజయానికి 72 బంతుల్లో 7 పరుగులు కావాలి.


హార్దిక్ పాండ్యా 5(6)
ఇషాన్ కిషన్ 40(23)
చేతన్ సకారియా 3-1-36-1

7 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 60-2, లక్ష్యం 91 పరుగులు

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 60-2గా ఉంది. విజయానికి 78 బంతుల్లో 31 పరుగులు కావాలి.


హార్దిక్ పాండ్యా 2(5)
ఇషాన్ కిషన్ 21(16)
కుల్దీప్ యాదవ్ 2-0-16-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 56-2, లక్ష్యం 91 పరుగులు

ముస్తాఫిజుర్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 56-2గా ఉంది. విజయానికి 84 బంతుల్లో 35 పరుగులు కావాలి.


హార్దిక్ పాండ్యా 0(2)
ఇషాన్ కిషన్ 20(13)
ముస్తాఫిజుర్ 2-0-22-1

సూర్యకుమార్ యాదవ్ అవుట్

ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ (సి) లోమ్‌రోర్ (బి) ముస్తాఫిజుర్ (13: 8 బంతుల్లో, మూడు ఫోర్లు)

ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 48-1, లక్ష్యం 91 పరుగులు

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 48-1గా ఉంది. విజయానికి 90 బంతుల్లో 43 పరుగులు కావాలి.


సూర్యకుమార్ యాదవ్ 9(5)
ఇషాన్ కిషన్ 17(12)
కుల్దీప్ యాదవ్ 1-0-13-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 35-1, లక్ష్యం 91 పరుగులు

చేతన్ సకారియా వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ అవుటయ్యాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 35-1గా ఉంది. విజయానికి 96 బంతుల్లో 56 పరుగులు కావాలి.


సూర్యకుమార్ యాదవ్ 5(2)
ఇషాన్ కిషన్ 8(9)
చేతన్ సకారియా 2-1-12-1

రోహిత్ శర్మ అవుట్

చేతన్ సకారియా బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుటయ్యాడు.
రోహిత్ శర్మ (సి) యశస్వి జైస్వాల్ (బి) చేతన్ సకారియా (22: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు)

మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 23-0, లక్ష్యం 91 పరుగులు

శ్రేయస్ గోపాల్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 23-0గా ఉంది. విజయానికి 102 బంతుల్లో 68 పరుగులు కావాలి.


రోహిత్ శర్మ 22(11)
ఇషాన్ కిషన్ 1(7)
శ్రేయస్ గోపాల్ 1-0-9-0

రెండు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 14-0, లక్ష్యం 91 పరుగులు

చేతన్ సకారియా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 14-0గా ఉంది. విజయానికి 108 బంతుల్లో 77 పరుగులు కావాలి.


రోహిత్ శర్మ 14(6)
ఇషాన్ కిషన్ 0(6)
చేతన్ సకారియా 1-1-0-0

మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 14-0, లక్ష్యం 91 పరుగులు

ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 14-0గా ఉంది. విజయానికి 114 బంతుల్లో 77 పరుగులు కావాలి.


రోహిత్ శర్మ 14(6)
ఇషాన్ కిషన్ 0(0)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1-0-14-0

20 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 90-9, ముంబై లక్ష్యం 91 పరుగులు

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 90-9గా ఉంది. ముంబై విజయానికి 120 బంతుల్లో 91 పరుగులు కావాలి.


కుల్‌దీప్ యాదవ్ 0(4)
ముస్తాఫిజుర్ 8(7)
ట్రెంట్ బౌల్ట్ 4-0-24-0

19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 83-9

నాథన్ కౌల్టర్ నైల్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 83-9గా ఉంది.


కుల్‌దీప్ యాదవ్ 0(4)
ముస్తాఫిజుర్ 1(1)
నాథన్ కౌల్టర్ నైల్ 4-0-14-4

చేతన్ సకారియా అవుట్

కౌల్టర్‌నైల్ బౌలింగ్‌లో చేతన్ సకారియా క్లీన్ బౌల్ట్ అయ్యాడు.
చేతన్ సకారియా (బి) కౌల్టర్ నైల్ (6: 9 బంతుల్లో, ఒక ఫోర్)

18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 78-8

బుమ్రా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 78-8గా ఉంది.


కుల్‌దీప్ యాదవ్ 0(3)
చేతన్ సకారియా 2(7)
బుమ్రా 4-0-14-2

17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 76-8

నాథన్ కౌల్టర్ నైల్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. డేవిడ్ మిల్లర్ అవుటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 76-8గా ఉంది.


కుల్‌దీప్ యాదవ్ 0(2)
చేతన్ సకారియా 1(1)
నాథన్ కౌల్టర్ నైల్ 3-0-9-3

డేవిడ్ మిల్లర్ అవుట్

కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
డేవిడ్ మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కౌల్టర్‌నైల్ (15: 23 బంతుల్లో)

16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 74-7

బుమ్రా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఓవర్ ఆఖరి బంతికి శ్రేయస్ గోపాల్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 74-7గా ఉంది.


డేవిడ్ మిల్లర్ 14(20)
చేతన్ సకారియా 0(0)
బుమ్రా 3-0-12-2

శ్రేయస్ గోపాల్ అవుట్

బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ గోపాల్ అవుటయ్యాడు.
శ్రేయస్ గోపాల్ (సి) ఇషాన్ కిషన్ (బి) బుమ్రా (0: 1 బంతుల్లో)

15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 71-6

జిమ్మీ నీషం వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఓవర్ ఆఖరి బంతికి టెవాటియా అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 71-6గా ఉంది.


డేవిడ్ మిల్లర్ 10(14)
జిమ్మీ నీషం 4-0-12-3
రాహుల్ టెవాటియా (సి) ఇషాన్ కిషన్ (బి) జిమ్మీ నీషమ్ (12: 20 బంతుల్లో)

14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 67-5

కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 67-5గా ఉంది.


డేవిడ్ మిల్లర్ 10(14)
రాహుల్ టెవాటియా 9(15)
కీరన్ పొలార్డ్ 2-0-9-0

13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 62-5

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 62-5గా ఉంది.


డేవిడ్ మిల్లర్ 8(11)
రాహుల్ టెవాటియా 6(12)
ట్రెంట్ బౌల్ట్ 3-0-17-0

12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 56-5

జయంత్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 56-5గా ఉంది.


డేవిడ్ మిల్లర్ 5(8)
రాహుల్ టెవాటియా 3(9)
జయంత్ యాదవ్ 2-0-17-0

11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 54-5

జిమ్మీ నీషమ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 54-5గా ఉంది.


డేవిడ్ మిల్లర్ 4(6)
రాహుల్ టెవాటియా 2(5)
జిమ్మీ నీషమ్ 3-0-8-2

10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 50-5

నాథన్ కౌల్టర్ నైల్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 50-5గా ఉంది.


డేవిడ్ మిల్లర్ 2(3)
రాహుల్ టెవాటియా 0(2)
నాథన్ కౌల్టర్ నైల్ 2-0-7-2

గ్లెన్ ఫిలిప్స్ అవుట్

నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ క్లీన్ బౌల్డయ్యాడు.
గ్లెన్ ఫిలిప్స్ (బి) కౌల్టర్ నైల్ (4: 13 బంతుల్లో)

9 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 49-4

జిమ్మీ నీషమ్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 49-4గా ఉంది.


గ్లెన్ ఫిలిప్స్ 4(11)
డేవిడ్ మిల్లర్ 1(1)
జిమ్మీ నీషమ్ 2-0-4-2

శివం దూబే అవుట్

జిమ్మీ నీషమ్ బౌలింగ్‌లో శివం దూబే బౌల్డ్ అయ్యాడు.
శివం దూబే (బి) జిమ్మీ నీషమ్ (3: 8 బంతుల్లో)

8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 47-3

పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 47-3గా ఉంది.


గ్లెన్ ఫిలిప్స్ 3(7)
శివం దూబే 3(7)
పొలార్డ్ 1-0-4-0

7 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 43-3

జిమ్మీ నీషం వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి.  7 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 43-3గా ఉంది.


గ్లెన్ ఫిలిప్స్ 1(4)
శివం దూబే 1(4)
జిమ్మీ నీషం 1-0-2-1

సంజు శామ్సన్ అవుట్

జిమ్మీ నీషం తన మొదటికే సంజు శామ్సన్‌ను అవుట్ చేశాడు.
సంజు శామ్సన్ (సి) జయంత్ యాదవ్ (బి) జిమ్మీ నీషం (3: 6 బంతుల్లో)

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 41-2

బుమ్రా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి.  ఎవిన్ లూయిస్ అవుటయ్యాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 41-2గా ఉంది.


సంజు శామ్సన్ 3(5)
శివం దూబే 0(3)
బుమ్రా 2-0-9-1

ఎవిన్ లూయిస్ అవుట్

బుమ్రా బౌలింగ్‌లో ఎవిన్ లూయిస్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
ఎవిన్ లూయిస్ (ఎల్బీడబ్ల్యూ)(బి) బుమ్రా (24: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)

ఐదు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 37-1

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 37-1గా ఉంది.


సంజు శామ్సన్ 3(5)
ఎవిన్ లూయిస్ 20(16)
ట్రెంట్ బౌల్ట్ 2-0-11-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 32-1

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 32-1గా ఉంది.


సంజు శామ్సన్ 1(1)
ఎవిన్ లూయిస్ 18(14)
బుమ్రా 1-0-6-1

యశస్వి జైస్వాల్ అవుట్

ఫాంలో ఉన్న యశస్వి జైస్వాల్‌ను కౌల్టర్ నైల్ తన మొదటి ఓవర్‌లోనే అవుట్ చేశాడు.
యశస్వి జైస్వాల్ (సి) ఇషాన్ కిషన్ (బి) కౌల్టర్‌నైల్ (12: 9 బంతుల్లో, మూడు ఫోర్లు)

మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 26-0

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 26-0గా ఉంది.


యశస్వి జైస్వాల్ 12(7)
ఎవిన్ లూయిస్ 13(11)
బుమ్రా 1-0-5-0

రెండు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 21-0

జయంత్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 21-0గా ఉంది.


యశస్వి జైస్వాల్ 12(5)
ఎవిన్ లూయిస్ 8(7)
జయంత్ యాదవ్ 1-0-15-0

మొదటి ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 6-0

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 6-0గా ఉంది.


యశస్వి జైస్వాల్ 4(2)
ఎవిన్ లూయిస్ 1(4)
ట్రెంట్ బౌల్ట్ 1-0-6-0

ముంబై ఇండియన్స్ తుదిజట్టు

రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జేమ్స్ నీషం, నాథన్ కౌల్టర్‌నైల్, జయంత్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు

ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శామ్సన్(కెప్టెన్, వికెట్ కీపర్), శివం దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ టెవాటియా, శ్రేయస్ గోపాల్, కుల్‌దీప్ యాదవ్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ పోటీ పడనుంది. పాయింట్ల పట్టికలో రాజస్తాన్ ఆరో స్థానంలో ఉండగా, ముంబై ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు గెలుపు తప్పనిసరి. మ్యాచ్ గెలవడంతో పాటు ఈ రెండు జట్లు నెట్‌రన్‌రేట్ మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.  గత మ్యాచ్‌లో ఫాంలో ఉన్న చెన్నైపై గెలిచి రాజస్తాన్ మంచి ఊపు మీదుంది.


190 పరుగులను కేవలం 17.3 ఓవర్లలోనే ఛేదించడం రాజస్తాన్ ఆత్మవిశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతుంది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్ మంచి ఫాంలో ఉన్నారు. దీంతోపాటు శివం దూబే కూడా టచ్‌లోకి రావడం రాజస్తాన్‌కు కచ్చితంగా ఆనందాన్నిచ్చే అంశమే. మరోవైపు చేతన్ సకారియా, ముస్తాఫిజుర్, మయాంక్ మార్కండేలతో రాజస్తాన్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది.


ఇక ముంబై విషయానికి వస్తే.. ఆ జట్టుకి, వాళ్ల ఫాంకి అస్సలు సంబంధం లేదు. యూఏఈలో ఐదు మ్యాచ్‌ల్లో ఆడితే అందులో నాలుగు ఓడిపోవడం ముంబైని నిరాశపరిచే అంశం. రోహిత్, డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా అందరూ ఈ ఐపీఎల్‌లో నిరాశపరిచారు. ఈ కీలక మ్యాచ్‌లో వీరందరూ బాగా ఆడి జట్టుకు భారీ విజయాన్ని అందిస్తే ప్లేఆఫ్స్‌కు వెళ్లే చాన్సెస్ మెరుగవుతాయి. ఇక ముంబై బౌలింగ్ మాత్రం బాగానే ఉంది. బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహర్‌లు పరుగులు కట్టడి చేస్తూ.. అవసరమైన సమయంలో వికెట్లు కూడా తీస్తున్నారు.


ఈ రెండు జట్లూ ఇప్పటివరకు 24 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో ముంబై 12 మ్యాచ్‌ల్లో గెలవగా.. రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.