PBKS vs RR Live Updates: ఉత్కంఠ రేపినా రాజస్థాన్‌దే విజయం..

ఐపీఎల్‌లో సిక్సర్ల జట్లైన పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. గెలిచిన జట్టుకు ప్లేఆఫ్స్‌ చేరుకొనేందుకు అవకాశాలు మెరుగవుతాయి. కేఎల్‌ రాహుల్‌, సంజుపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ABP Desam Last Updated: 21 Sep 2021 11:40 PM
ఉత్కంఠ రేపినా రాజస్థాన్‌దే విజయం..

ఆఖరి ఓవర్లో కార్తీక్‌ త్యాగీ అద్భుతం చేశాడు. రెండు వికెట్లు తీసి కేవలం 1 పరుగే ఇచ్చాడు. 2 పరుగుల తేడాతో రాజస్థాన్‌కు విజయం అందించాడు.

హుడా ఔట్‌.. టెన్షన్‌.. టెన్షన్‌


కార్తీక్‌ వేసిన 19.5వ బంతికి దీపక్‌ హుడా (0) ఔటయ్యాడు. పంజాబ్‌కు 1 బంతుల్లో 3 పరుగులు కావాలి.

పూరన్‌ ఔట్‌.. టెన్షన్‌.. టెన్షన్‌


కార్తీక్‌ వేసిన 19.3వ బంతికి పూరన్‌ (32) ఔటయ్యాడు. శాంసన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. పంజాబ్‌కు 3 బంతుల్లో 3 పరుగులు కావాలి.

పంజాబ్‌ 19 ఓవర్లకు 182-2


ముస్తాఫిజుర్‌ కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. బౌండరీలేమీ రాలేదు. పూరన్‌ (32), మార్‌క్రమ్‌ (25) గెలుపు షాట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. పంజాబ్‌ విజయానికి మరో 4 పరుగులే అవసరం.

పంజాబ్‌ 18 ఓవర్లకు 178-2

క్రిస్‌ మోరిస్‌ పది పరుగులు ఇచ్చాడు. మొదటి బంతిని మార్‌క్రమ్‌ (23) సూపర్‌ సిక్సర్‌గా మలిచాడు. పూరన్‌ (30) అతడికి తోడుగా ఉన్నాడు.  పంజాబ్‌ విజయానికి 12 బంతుల్లో 8 పరుగులు అవసరం.

పంజాబ్‌ 17 ఓవర్లకు 168-2

ముస్తాఫిజుర్‌ 14 పరుగులు ఇచ్చాడు. నికోలస్‌ పూరన్‌ (28) ఒక బౌండరీ, ఒక సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. మార్‌క్రమ్‌ (15) అతడికి తోడుగా ఉన్నాడు. పంజాబ్‌ విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరం.

పంజాబ్‌ 16 ఓవర్లకు 154-2

క్రిస్‌ మోరిస్‌ 6 పరుగులు ఇచ్చాడు. కాస్త లయలో లేనట్టుగా అనిపించింది. ఈ ఓవర్లో బౌండరీలైతే రాలేదు. పూరన్‌ (15), మార్‌క్రమ్‌ (14) నిలకడగా ఆడుతున్నారు. పంజాబ్‌ 24 బంతుల్లో 32 పరుగులు చేస్తే విజయం అందుకుంటుంది.

పంజాబ్‌ 15 ఓవర్లకు 148-2

కార్తీక్‌ త్యాగీ తెలివిగా బౌలింగ్‌ చేశాడు. వేగం తగ్గించి బంతులు విసిరాడు. ఈ ఓవర్లో కేవలం 6 పరుగులే వచ్చాయి. ఆఖరి బంతిని మార్‌క్రమ్‌ (12) స్ట్రెయిట్‌గా బౌండరీ బాదాడు. పూరన్‌ (12) సైతం దొరికతే బాదేందుకు సిద్ధంగా ఉన్నాడు.

పంజాబ్‌ 14 ఓవర్లకు 142-2

రియాన్‌ పరాగ్‌ 16 పరుగులు ఇచ్చాడు. సీపీఎల్‌ నుంచి వచ్చిన నికోలస్‌ పూరన్‌ (11) ఆరో బంతిని సిక్సర్‌గా మలిచాడు. నాలుగో బంతిని మార్‌క్రమ్‌ (7) దూకుడుగానే ఆడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్‌ను చేజార్చుకోవద్దన్న ఉద్దేశంతో కనిపిస్తున్నారు.

మయాంక్‌ ఔట్‌; పంజాబ్‌ 13 ఓవర్లకు 126-2

రాహుల్‌ తెవాతియా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కేవలం 6 పరుగులే ఇచ్చి కీలకమైన మయాంక్‌ అగర్వాల్‌ (67; 43 బంతుల్లో 7x4, 2x6)ను ఔట్‌ చేశాడు. ఆఖరి బంతికి షాట్‌ ఆడబోయిన మయాంక్‌ ఫీల్డర్‌ లివింగ్‌స్టన్‌కు చిక్కాడు. మార్‌క్రమ్‌ (2), నికోలస్‌ పూరన్‌ (0) క్రీజులో ఉన్నారు.

రాహుల్‌ 49 ఔట్‌; పంజాబ్‌ 12 ఓవర్లకు 120-1

చేతన్‌ సకారియా రాజస్థాన్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. కీలకమైన కేఎల్‌ రాహుల్‌ (49; 33 బంతుల్లో 4x4, 2x6)ను ఔట్‌ చేశాడు. ఐదో బంతిని ఆడిన రాహుల్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా ఆడి కార్తీక్‌ త్యాగీకి చిక్కాడు. మరోవైపు మయాంక్‌ (63) జోరు కొనసాగిస్తున్నాడు. మార్‌క్రమ్‌ (0) క్రీజులోకి వచ్చాడు.

పంజాబ్‌ 11 ఓవర్లకు 113-0

మహిపాల్‌ లోమ్రర్‌ బౌలింగ్‌కు వచ్చాడు. ఏడు పరుగులు ఇచ్చాడు. మయాంక్‌ అగర్వాల్‌ (62; 38 బంతుల్లో ) ,కేఎల్‌ రాహుల్‌ (44) ఆచితూచి ఆడుతున్నారు.

మయాంక్‌ ఆఫ్‌ సెంచరీ; పంజాబ్‌ 10 ఓవర్లకు 106-0


సీనియర్‌ పేసర్‌ క్రిస్‌ మోరిస్‌కు చుక్కలు కనిపించాయి. ఈ ఓవర్లో ఏకంగా 25 పరుగులు ఇచ్చాడు. మయాంక్‌ అగర్వాల్‌ (58; 35 బంతుల్లో ) రెండు సిక్సర్లు, రెండు బౌండరీలు బాదేశాడు. అర్ధశతకం సాధించాడు. మరోవైపు కేఎల్‌ రాహుల్‌ (41) నిలకడగా ఆడుతున్నాడు. పంజాబ్‌ స్కోరు వంద దాటింది.

పంజాబ్‌ 9 ఓవర్లకు 81-0

రాహుల్‌ తెవాతియాద తొమ్మిది పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని మయాంక్‌ అగర్వాల్‌ (42 ) స్ట్రెయిట్గా బౌండరీకి పంపించాడు. మంచి షాట్లు ఆడుతున్నాడు. రాహుల్‌ (36)ను మించి అతడు జోరు కనబరుస్తుండటం గమనార్హం.

పంజాబ్‌ 8 ఓవర్లకు 72-0

కార్తీక్‌ త్యాగీకి చుక్కలు కనిపించాయి. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ అతడిని ఒత్తిడిలోకి నెట్టారు. మయాంక్‌ అగర్వాల్‌ (35) 2,3,4 బంతుల్ని వరుసగా బౌండరీకి పంపించి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ (34) నిలకగా ఆడుతున్నాడు. 

పంజాబ్‌ 7 ఓవర్లకు 57-0

రాహుల్‌ తెవాతియా ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు ఇచ్చాడు. లెగ్‌సైడ్‌ కాలి కిందకు బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. కేఎల్‌ రాహుల్‌ (33; 21 బంతుల్లో ) నిలకడగా ఆడుతున్నాడు. మయాంక్‌ అగర్వాల్‌ (21; 22 బంతుల్లో) నాలుగో బంతిని స్ట్రెయిట్‌గా బౌండరీ బాదాడు.

3సార్లు రాహుల్‌ క్యాచ్‌లు డ్రాప్‌.. పంజాబ్‌ 6 ఓవర్లకు 49-0

పవర్‌ప్లే ముగిసింది. ముస్తాఫిజుర్‌ ఈ ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు. తెలివిగా వేగం తగ్గించి బంతులు వేశాడు. కేఎల్‌ రాహుల్‌ (32; 19 బంతుల్లో ) ఇచ్చిన మరో క్యాచ్‌ను రాజస్థాన్‌ నేలపాలు చేసింది. మయాంక్‌ (15) స్ట్రెయిట్‌గా మంచి బౌండరీ బాదాడు.

పంజాబ్‌ 5 ఓవర్లకు 41-0

క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌కు వచ్చాడు. పరుగులను నియంత్రించాడు. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ ఓవర్లో బౌండరీలేమీ రాలేదు. అయితే ఆఖరి బంతికి రాహుల్‌ (30; 17 బంతుల్లో ) ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. అతడిచ్చిన క్యాచ్‌ను రియాన్ పరాగ్‌ వదిలేశాడు. మయాంక్‌ (9) నిలకడగా ఆడుతున్నాడు.

రాహుల్‌ @ 3000.. పంజాబ్‌ 4 ఓవర్లకు 35-0

చేతన్‌ సకారియా 19 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో కేఎల్‌ రాహుల్‌ (26; 13 బంతుల్లో ) తన క్లాస్‌ను పరిచయం చేశాడు. తొలి మూడు బంతులను వరుసగా 4, 6, 6గా మలిచాడు. అతడు బాదిన సిక్సర్ల అందం మరో రేంజ్‌లో ఉంది. మయాంక్‌ (8) అతడికి తోడుగా ఉన్నాడు. అలాగే రాహుల్‌ ఐపీఎల్‌ కెరీర్లో 3000 పరుగులు మైలురాయి అధిగమించాడు.

పంజాబ్‌ 3 ఓవర్లకు 16-0

కార్తీక్‌ త్యాగీ 7 పరుగులు ఇచ్చాడు. అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మూడో బంతిని మయాంక్‌ (7) ఆడాడు. అతడు బ్యాటు మీదుగా బంతి వెళ్లడంతో సంజు సమీక్ష తీసుకొని విఫలమయ్యాడు. నాలుగో బంతిని రాహుల్‌ (8) బౌండరీకి తరలించాడు. రాజస్థాన్‌ మాత్రం అద్భుతమైన ఫీల్డింగ్‌ చేస్తోంది. 

పంజాబ్‌ 2 ఓవర్లకు 9-0

చేతన్‌ సకారియా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. నాలుగో బంతికి రాహుల్‌ (3) ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. అతడిచ్చిన క్యాచ్‌ను లూయిస్‌ వదిలేశాడు. మయాంక్‌ (6) నిలకడగా ఆడుతున్నాడు.

పంజాబ్‌ 1 ఓవర్‌కు 4-0

పంజాబ్‌ కింగ్స్‌ ఛేదన ఆరంభించింది. కేఎల్‌ రాహుల్‌ (2), మయాంక్‌ అగర్వాల్‌ (2) నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. ముస్తాఫిజుర్ చక్కగా బౌలింగ్‌ చేశాడు. బౌండరీలేమీ ఇవ్వలేదు.

20 ఓవర్లకు రాజస్థాన్ 185-10

అర్షదీప్‌ మరోసారి అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఆఖరి ఓవర్లో 2 వికెట్లు తీసి కేవలం 7 పరుగులే ఇచ్చాడు. ఐదో బంతికి చేతన్ సకారియా (7), ఆరో బంతికి కార్తీక్‌ త్యాగి (1)ని ఔట్‌ చేశాడు. కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక 200+ చేస్తుందనుకున్న రాజస్థాన్‌ 185కు పరిమితం అయింది.

19 ఓవర్లకు రాజస్థాన్ 178-8

షమి ఈ ఓవర్లో 2 వికెట్లు తీశాడు. మొదటి బంతికి తెవాతియా, ఐదో బంతికి మోరిస్‌ను ఔట్‌ చేశాడు. కేవలం 3 పరుగులే ఇచ్చాడు. చేతన్‌ సకారియా (2), కార్తీక్‌ త్యాగీ (0) క్రీజులో ఉన్నారు.

మళ్లీ వికెట్‌.. తెవాతియా ఔట్‌

షమి వేసిన 18.1వ బంతికి తెవాతియా (2; 5 బంతుల్లో) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

18 ఓవర్లకు రాజస్థాన్ 175-6

అర్షదీప్‌ తనపై పెట్టిన నమ్మకం నిలబెట్టుకున్నాడు. ఈ ఓవర్లో మహిపాల్‌ను ఔట్‌ చేశాడు. కేవలం 7 పరుగులే ఇచ్చాడు. మోరిస్‌ , తెవాతియా క్రీజులో ఉన్నారు.


క్రిస్‌ మోరిస్‌ (4; 3  బంతుల్లో 0x4, 0x6)
రాహుల్‌ తెవాతియా (2; 4 బంతుల్లో 0x4, 0x6 )

అర్ధశతకం ముందు మహిపాల్‌ ఔట్‌

అర్షదీప్‌ మళ్లీ మాయ చేశాడు. 17.1వ బంతికి భారీ షాట్లు ఆడుతున్న మహిపాల్‌ (43; 17  బంతుల్లో 2x4, 4x6)ను ఔట్‌ చేశాడు. మార్‌క్రమ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

17 ఓవర్లకు రాజస్థాన్ 168-5

షమి అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 4 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. మహిపాల్‌ అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. రాహుల్‌ తెవాతియా క్రీజులోకి వచ్చాడు.


మహిపాల్‌ లోమ్రర్‌  (43; 16  బంతుల్లో 2x4, 4x6)
రాహుల్‌ తెవాతియా (౧; 2 బంతుల్లో 0x4, 0x6 )

రియాన్‌ పరాగ్‌ ఔట్‌

షమి వేసిన 16.3వ బంతిని హెలికాప్టర్‌ షాట్‌ ఆడబోయి రియాన్‌ పరాగ్‌ (4; 5 బంతుల్లో) ఔటయ్యాడు. మార్‌క్రమ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

16 ఓవర్లకు రాజస్థాన్ 164-4

దీపక్‌ హుడాకు చుక్కలు కనిపించాయి. ఈ ఓవర్లో 24 పరుగులు ఇచ్చాడు. మహిపాల్‌  తన కండబలం, టెక్నిక్‌, బ్యాటింగ్‌ విధ్వంసం చూపించాడు. మొదటి రెండు బంతులను అతడు సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతిని బౌండరీకి పంపించాడు. మళ్లీ ఆఖరి బంతిని బౌండరీకి తరలించాడు. రియాన్‌ అతడికి తోడుగా ఉన్నాడు.


మహిపాల్‌ లోమ్రర్‌  (42; 15  బంతుల్లో 2x4, 4x6)
రియాన్‌ పరాగ్‌ (2; 2 బంతుల్లో 0x4, 0x6 )

15 ఓవర్లకు రాజస్థాన్ 140-4

హర్‌ప్రీత్‌ ఈ ఓవర్లో కీలక వికెట్‌ తీశాడు. 4 పరుగులే ఇచ్చాడు. మహిపాల్‌ నిలకడగా ఆడుతున్నాడు. యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ క్రీజులోకి వచ్చాడు.


మహిపాల్‌ లోమ్రర్‌  (18; 9  బంతుల్లో 0x4, 2x6)
రియాన్‌ పరాగ్‌ (2; 2 బంతుల్లో 0x4, 0x6 )

అయ్యయ్యో.. జైశ్వాల్‌ 49 వద్ద ఔట్‌

రాజస్థాన్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చిన యశస్వీ జైశ్వాల్‌ ఔటయ్యాడు. 49 పరుగుల వద్ద ఔటవ్వడం అభిమానులను నిరాశపరిచింది. హర్‌ప్రీత్‌ వేసిన 14.2వ బంతిని ఆడబోయి మయాంక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మాయాంక్‌ గాల్లోకి ఎగిరి మరీ బంతి అందుకోవడం గమనార్హం.

14 ఓవర్లకు రాజస్థాన్ 136-3

ఆదిల్‌ రషీద్‌ 14 పరుగులు ఇచ్చాడు. మహిపాల్‌ తనేంటో చూపించాడు. ఆఖరి రెండు బంతులను కళ్లు చెదిరే రీతిలో సిక్సర్లుగా మలిచాడు. జైశ్వాల్‌ అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు.


మహిపాల్‌ లోమ్రర్‌  (16; 7  బంతుల్లో 0x4, 2x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (49; 34 బంతుల్లో 6x4, 2x6 )

13 ఓవర్లకు రాజస్థాన్ 122-3

హర్‌ప్రీత్‌ బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించాడు. కేవలం 6 పరుగులే ఇచ్చాడు. మహిపాల్‌, జైశ్వాల్‌ నిలకడగా ఆడారు.


మహిపాల్‌ లోమ్రర్‌  (3; 4  బంతుల్లో 0x4, 0x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (48; 31 బంతుల్లో 6x4, 2x6 )

12 ఓవర్లకు రాజస్థాన్ 116-3

అర్షదీప్‌ అద్భుతం చేశాడు. లివింగ్‌స్టన్‌ను ఔట్‌ చేసి 15 పరుగులు ఇచ్చాడు. మహిపాల్‌ లోమ్రర్‌ క్రీజులోకి వచ్చాడు. జైశ్వాల్‌ మరోవైపు స్థిరంగా ఆడుతున్నాడు.



మహిపాల్‌ లోమ్రర్‌  (౦; 1  బంతుల్లో 0x4, 0x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (45; 28 బంతుల్లో 6x4, 2x6 )

వాటే క్యాచ్‌! సిక్సర్ల లివింగ్‌ స్టన్‌ ఔట్‌

 


రాజస్థాన్‌ మూడో వికెట్ కోల్పోయింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న లియామ్‌ లివింగ్‌స్టన్‌  (25; 17 బంతుల్లో 2x4, 1x6) ఔటయ్యాడు. అర్షదీప్‌ వేసిన 11.5వ బంతికి పెవిలియన్‌ చేరాడు. అతడు భారీ షాట్‌ ఆడినా.. బౌండరీ లైన్‌ వద్ద ఫాబిలియన్‌ అలన్‌ గాల్లోకి ఎగిరి సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

11 ఓవర్లకు రాజస్థాన్ 101-2

హర్‌ప్రీత్‌ బ్రార్‌ బౌలింగ్‌కు వచ్చి 7 పరుగులు ఇచ్చాడు. పరుగులను నియంత్రించాడు. అయినా ఆఖరి బంతిని జైశ్వాల్‌ అద్భుతమైన స్ట్రెయిట్‌ షాట్‌తో బౌండరీకి పంపించాడు. లివింగ్‌స్టన్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు.


లియామ్‌ లివింగ్‌స్టన్‌  (11; 12 బంతుల్లో 1x4, 0x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (45; 28 బంతుల్లో 6x4, 2x6 )

10 ఓవర్లకు రాజస్థాన్ 94-2

ఇషాన్‌ పోరెల్‌ తన కోటాను ముగించాడు. 4 ఓవర్లు వేసి ఒక వికెట్‌ తీసి 39 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఐదో బంతిని జైశ్వాల్‌ అందమైన కవర్‌ డ్రైవ్‌తో బౌండరీకి పంపించాడు. లివింగ్‌స్టన్‌ అతడితో తోడుగా ఉన్నాడు.


లియామ్‌ లివింగ్‌స్టన్‌  (9; 8 బంతుల్లో 1x4, 0x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (40; 26 బంతుల్లో 5x4, 2x6 )

9 ఓవర్లకు రాజస్థాన్ 86-2

ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌కు వచ్చాడు. పది పరుగులు ఇచ్చాడు. జైశ్వాల్‌ తన ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. మూడో బంతిని కళ్లు చెదిరే సిక్సర్‌గా మలిచాడు. లివింగ్‌ స్టన్‌ అతడికి తోడుగా ఉన్నాడు.


లియామ్‌ లివింగ్‌స్టన్‌  (7; 6 బంతుల్లో 1x4, 0x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (34; 22 బంతుల్లో 4x4, 2x6 )

8 ఓవర్లకు రాజస్థాన్ 76-2

ఇషాన్‌ పోరెల్‌ సంజు శాంసన్‌ వికెట్‌ తీశాడు. లివింగ్‌స్టన్‌ క్రీజులోకి వచ్చాడు. ఐదో బంతిని బౌండరీకి పంపించాడు. జైశ్వాల్‌ మరో ఎండ్‌లో స్థిరంగా ఉన్నాడు.


లియామ్‌ లివింగ్‌స్టన్‌  (5; 3 బంతుల్లో 1x4, 0x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (26; 19 బంతుల్లో 4x4, 1x6 )

పోరెల్‌కు తొలి వికెట్‌

రాజస్థాన్‌ రెండో వికెట్‌ చేజార్చుకుంది. ఆ జట్టు కెప్టెన్‌ సంజు శాంసన్‌ (4; 5 బంతుల్లో) ఔటయ్యాడు. మొదటి బంతిని ఆడబోయి కీపర్‌ రాహుల్‌కు చిక్కాడు.

7 ఓవర్లకు రాజస్థాన్ 68-1

రాజస్థాన్‌ ఒకే మూమెంటమ్‌ కొనసాగిస్తోంది. దూకుడుగానే ఆడుతోంది. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌కు దిగాడు. అయితే జైశ్వాల్‌ అతడి ఆటలు సాగనివ్వలేదు. రెండో బంతిని బౌండరీకి తరలించిన అతడు.. నాలుగో బంతిని స్ట్రెయిట్‌గా సిక్సర్‌గా మలిచాడు. సంజు అతడికి తోడుగా ఉన్నాడు.


సంజు శాంసన్‌  (4; 4 బంతుల్లో 0x4, 0x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (26; 17 బంతుల్లో 4x4, 1x6 )

6 ఓవర్లకు రాజస్థాన్ 57-1

ఎప్పట్లాగే అర్షదీప్‌ మాయ చేశాడు. బంతి అందుకున్న తొలి ఓవర్లోనే కీలకమైన వికెట్‌ తీశాడు. ఆరో ఓవర్లో అతడు 4 పరుగులు ఇచ్చి లూయిస్‌ను ఔట్‌ చేశాడు. శాంసన్‌, జైశ్వాల్‌ క్రీజులో ఉన్నారు.


సంజు శాంసన్‌  (3; 3 బంతుల్లో 0x4, 0x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (16; 12 బంతుల్లో 3x4, 0x6 )

లూయిస్‌ దొరికాడు.. పంజాబ్‌ నవ్వింది

అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. వెంటనే వికెట్‌ తీశాడు. అతడు వేసిన 5.3వ బంతిని భారీ షాట్‌ ఆడబోయి ఎవిన్‌ లూయిస్‌  (36; 21 బంతుల్లో 7x4, 1x6) ఔటయ్యాడు. మయాంక్‌ అగర్వాల్‌ డైవ్‌ చేసి అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. సంజు శాంసన్‌ క్రీజులోకి వచ్చాడు.

5 ఓవర్లకు రాజస్థాన్ 53-0

దీపక్‌ హుడా బౌలింగ్‌కు వచ్చాడు. బౌలింగ్‌లో మార్పు చేసినా ఫలితం రాలేదు. తొలి బంతిని జైశ్వాల్‌ బౌండరీకి పంపిస్తే ఆఖరి రెండు బంతుల్ని లూయిస్‌ పంపించాడు. మొత్తంగా ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.


ఎవిన్‌ లూయిస్‌  (36; 20 బంతుల్లో 7x4, 1x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (15; 10 బంతుల్లో 3x4, 0x6 )

4 ఓవర్లకు రాజస్థాన్ 40-0

కొత్త కుర్రాడు ఇషాన్‌ పోరెన్‌ను లూయిస్‌ లక్ష్యంగా ఎంచుకున్నాడు. వరుసగా బౌండరీలు బాదేస్తున్నాడు. 2,3 ,5, 6 బంతుల్ని బౌండరీలుగా మలిచాడు. జైశ్వాల్‌ సహచరుడి బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేశాడు. ఈ ఓవర్లో మొత్తంగా 17 పరుగులు వచ్చాయి.


ఎవిన్‌ లూయిస్‌  (28; 16 బంతుల్లో 5x4, 1x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (10; 8 బంతుల్లో 2x4, 0x6 )

3 ఓవర్లకు రాజస్థాన్ 23-0

షమి అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. బంతిని విపరీతంగా స్వింగ్‌ చేశాడు. ఐదో బంతిని లూయిస్‌ చక్కని బౌండరీగా మలిచాడు. జైశ్వాల్‌ సింగిల్‌ తీశాడు.


ఎవిన్‌ లూయిస్‌  (12; 11 బంతుల్లో 1x4, 1x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (9; 7 బంతుల్లో 2x4, 0x6 )

2 ఓవర్లకు రాజస్థాన్ 18-0

ఇషాన్‌ పోరెల్‌ ఐపీఎల్‌ కెరీర్లో తన తొలి ఓవర్‌ను వేశాడు. 9 పరుగులు ఇచ్చాడు. ఒదటి ఐదు బంతుల్లో ఎక్కువ పరుగులు ఇవ్వలేదు. అయితే ఆఖరి బంతిని లూయిస్‌ బలంగా బాదడంతో సిక్సర్‌ వెళ్లింది. జైశ్వాల్‌ సింగిల్స్‌ తీశాడు. 


ఎవిన్‌ లూయిస్‌  (8; 6 బంతుల్లో ౦x4, 1x6)
యశస్వీ జైశ్వా్‌ల్‌ (8; 6 బంతుల్లో 2x4, 0x6 )

1 ఓవర్‌కు రాజస్థాన్ 9-0

ఆరంభ ఓవర్‌ను మహ్మద్‌ షమి వేశాడు. 9 పరుగులు ఇచ్చాడు. మొదటి బంతిని ఎవిన్‌ లూయిస్‌ (1) ఒక పరుగు తీశాడు. మొదట్లో కాస్త తడబడిన యశస్వీ జైశ్వాల్‌ (8) ఆఖరి రెండు బంతులను వరుసగా బౌండరీకి తరలించాడు.

రాజస్థాన్‌లో నలుగురు విదేశీ క్రికెటర్లు వీరే

ఫామ్‌లో ఉన్న ఎవిన్‌ లూయిస్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌ను రాజస్థాన్‌ తీసుకుంది. మోరిస్‌ ఆల్‌రౌండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ముస్తాఫిజుర్‌ పేస్‌ బౌలర్‌గా ఉంటాడు.

క్రిస్‌ గేల్‌కు దక్కని చోటు

జట్టులోకి నికోలస్‌ పూరన్‌, మార్‌క్రమ్‌, ఆదిల్‌ రషీద్‌, ఫాబియన్‌ అలన్‌ను పంజాబ్‌ జట్టులోకి తీసుకున్నారు. మార్‌క్రమ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. క్రిస్‌గేల్‌ ఈ మ్యాచులో ఆడటం లేదు.

బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌

ఈ మ్యాచులో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచింది. వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ప్రత్యర్థిని తక్కువ పరుగులకే పరిమితం చేసి లక్ష్యం ఛేదించేందుకు నిర్ణయించుకున్నామని రాహుల్‌ చెప్పాడు.

కొత్త వాళ్లకు అవకాశం?

ఈ మ్యాచులో కొందరు కొత్త వాళ్లకు అవకాశం దక్కేలే కనిపిస్తోంది.  లూయిస్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ క్యాప్‌ అందించింది. ఇషాన్‌ పోరెల్‌, మార్‌క్రమ్‌, ఆదిల్‌ రషీద్‌కు పంజాబ్‌ కింగ్స్‌ క్యాప్స్‌ ఇచ్చింది. 

Background

దుబాయ్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌, రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో బాటమ్‌ ఫోర్‌లో ఉన్నాయి. సీజన్‌ తొలిదశలో చెరో మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో ఉన్నాయి. మెరుగైన రన్‌రేట్‌తో సంజు శాంసన్‌ సేన ఆరో స్థానంలో ఉంది. రాహుల్‌ బృందం ఏడో స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌తో పోలిస్తే పంజాబ్‌ ఒక మ్యాచ్‌ ఎక్కువగానే ఆడటం గమనార్హం. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే అద్భుతంగా ఆడాలి. వరుస విజయాలు సాధించాలి.


ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 22 సార్లు తలపడగా పంజాబ్‌ 12 గెలిచి 9 ఓడింది. ఒక మ్యాచ్‌ టై అయింది. చివరి ఐదు మ్యాచుల్లోనూ కింగ్స్‌దే ఆధిపత్యం. మూడింట్లో గెలిచింది. ఈ మధ్యకాలంలో వీరెప్పుడు తలపడ్డా పరుగుల వరద పారుతోంది. ప్రతి రెండుమ్యాచులకు ఒకసారి కనీసం 200 పరుగులైనా చేస్తున్నారు. లేదా ఛేదిస్తున్నారు.


ఈ మ్యాచులో కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌గేల్‌, నికోలస్‌ పూరన్‌, దీపక్‌ హుడా, షారుక్‌ ఖాన్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, సంజు శాంసన్‌, ఇవిన్‌ లూయిస్‌పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు టీ20లకు పనికిరాడని పక్కనపెట్టేసిన లియామ్‌ లివింగ్ స్టన్‌ ది హండ్రెడ్‌లో చుక్కలు చూపించాడు. సరికొత్త షాట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.