MI vs PBKS Live: 19 ఓవర్లలో లక్ష్యం ఛేదించిన ముంబై, ఆరు వికెట్లతో విజయం
IPL 2021, Match 42, MI vs PBKS: ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో హార్దిక్ పాండ్యా చెలరేగడంతో ముంబై ఆరు వికెట్లతో విజయం సాధించింది.
కీరన్ పొలార్డ్ 15(7)
హార్దిక్ పాండ్యా 40(30)
మహ్మద్ షమీ 4-0-42-1
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 120-4గా ఉంది. విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావాలి.
కీరన్ పొలార్డ్ 14(6)
హార్దిక్ పాండ్యా 24(25)
అర్ష్‌దీప్ సింగ్ 4-0-29-0
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 107-4గా ఉంది. విజయానికి 18 బంతుల్లో 29 పరుగులు కావాలి.
కీరన్ పొలార్డ్ 3(3)
హార్దిక్ పాండ్యా 23(22)
మహ్మద్ షమీ 3-0-25-1
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 96-4గా ఉంది. విజయానికి 24 బంతుల్లో 40 పరుగులు కావాలి.
కీరన్ పొలార్డ్ 3(3)
హార్దిక్ పాండ్యా 12(16)
నాథన్ ఎల్లిస్ 3-0-12-1
నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి సౌరభ్ తివారీ అవుటయ్యాడు.
సౌరభ్ తివారీ (సి) రాహుల్ (బి) ఎల్లిస్ (45: 37 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 92-3గా ఉంది. విజయానికి 30 బంతుల్లో 44 పరుగులు కావాలి.
సౌరభ్ తివారీ 45(36)
హార్దిక్ పాండ్యా 11(14)
రవి బిష్ణోయ్ 4-0-25-2
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 84-3గా ఉంది. విజయానికి 36 బంతుల్లో 52 పరుగులు కావాలి.
సౌరభ్ తివారీ 38(32)
హార్దిక్ పాండ్యా 10(12)
అర్ష్‌దీప్ సింగ్ 3-0-16-0
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 78-3గా ఉంది. విజయానికి 42 బంతుల్లో 58 పరుగులు కావాలి.
సౌరభ్ తివారీ 35(29)
హార్దిక్ పాండ్యా 7(9)
నాథన్ ఎల్లిస్ 2-0-8-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 75-3గా ఉంది. విజయానికి 48 బంతుల్లో 61 పరుగులు కావాలి.
సౌరభ్ తివారీ 33(26)
హార్దిక్ పాండ్యా 6(6)
అర్ష్‌దీప్ సింగ్ 2-0-10-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 68-3గా ఉంది.
సౌరభ్ తివారీ 26(20)
హార్దిక్ పాండ్యా 6(6)
రవి బిష్ణోయ్ 3-0-17-2
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. క్వింటన్ డికాక్ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 62-3గా ఉంది.
సౌరభ్ తివారీ 25(19)
హార్దిక్ పాండ్యా 1(1)
మహ్మద్ షమీ 2-0-14-1
మహ్మద్ షమీ బౌలింగ్‌లో డికాక్ క్లీన్ బౌల్డయ్యాడు.
క్వింటన్ డికాక్ (బి) మహ్మద్ షమీ (27: 29 బంతుల్లో, రెండు ఫోర్లు)
హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 54-2గా ఉంది.
సౌరభ్ తివారీ 23(17)
క్వింటన్ డికాక్ 22(26)
హర్‌ప్రీత్ బ్రార్ 1-0-11-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 43-2గా ఉంది.
సౌరభ్ తివారీ 13(12)
క్వింటన్ డికాక్ 21(25)
రవి బిష్ణోయ్ 2-0-11-2
మార్క్రమ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 35-2గా ఉంది.
సౌరభ్ తివారీ 12(11)
క్వింటన్ డికాక్ 14(20)
మార్క్రమ్ 3-0-18-0
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 30-2గా ఉంది.
సౌరభ్ తివారీ 10(8)
క్వింటన్ డికాక్ 11(17)
నాథన్ ఎల్లిస్ 1-0-5-0
ఎయిడెన్ మార్క్రమ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 25-2గా ఉంది.
సౌరభ్ తివారీ 6(4)
క్వింటన్ డికాక్ 10(15)
ఎయిడెన్ మార్క్రమ్ 2-0-13-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యారు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 18-2గా ఉంది.
సౌరభ్ తివారీ 1(1)
క్వింటన్ డికాక్ 8(12)
రవి బిష్ణోయ్ 1-0-3-2
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్ (బి) రవి బిష్ణోయ్ (0: 1 బంతి)
రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి హిట్ మ్యాన్ పెవిలియన్‌కు చేరాడు.
రోహిత్ శర్మ (సి) మన్‌దీప్ సింగ్ (బి) రవి బిష్ణోయ్ (8: 10 బంతుల్లో, ఒక ఫోర్)
అర్ష్‌దీప్ సింగ్ ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 15-0గా ఉంది.
రోహిత్ శర్మ 8(9)
క్వింటన్ డికాక్ 3(3)
అర్ష్‌దీప్ సింగ్ 1-0-3-0
మహ్మద్ షమీ ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 12-0గా ఉంది.
రోహిత్ శర్మ 8(9)
క్వింటన్ డికాక్ 3(3)
మహ్మద్ షమీ 1-0-6-0
ఎయిడెన్ మార్క్రమ్ ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 6-0గా ఉంది.
రోహిత్ శర్మ 2(3)
క్వింటన్ డికాక్ 3(3)
ఎయిడెన్ మార్క్రమ్ 1-0-6-0
నాథన్ కౌల్టర్ నైల్ ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 135-6గా ఉంది.
నాథన్ ఎల్లిస్ 6(4)
హర్‌ప్రీత్ బ్రార్ 14(19)
నాథన్ కౌల్టర్ నైల్ 4-0-19-0
బుమ్రా ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీపక్ హుడా అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 127-6గా ఉంది.
నాథన్ ఎల్లిస్ 0(0)
హర్‌ప్రీత్ బ్రార్ 12(17)
బుమ్రా 4-0-24-2
బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి దీపక్ హుడా అవుటయ్యాడు.
దీపక్ హుడా (సి) పొలార్డ్ (బి) బుమ్రా (28: 26 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
నాథన్ కౌల్టర్ నైల్ ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 122-5గా ఉంది.
దీపక్ హుడా 28(25)
హర్‌ప్రీత్ బ్రార్ 8(12)
నాథన్ కౌల్టర్ నైల్ 3-0-11-0
బుమ్రా ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 118-5గా ఉంది.
దీపక్ హుడా 26(23)
హర్‌ప్రీత్ బ్రార్ 7(8)
బుమ్రా 3-0-20-1
రాహుల్ చాహర్ ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. మార్క్రమ్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 112-5గా ఉంది.
దీపక్ హుడా 26(22)
హర్‌ప్రీత్ బ్రార్ 2(3)
రాహుల్ చాహర్ 4-0-27-1
రాహుల్ చాహర్ బౌలింగ్‌లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఎయిడెన్ మార్క్రమ్ (బి) రాహుల్ చాహర్ (42: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు)
ట్రెంట్ బౌల్ట్ ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 105-4గా ఉంది.
దీపక్ హుడా 25(20)
మార్క్రమ్ 38(27)
ట్రెంట్ బౌల్ట్ 3-0-30-0
రాహుల్ చాహర్ ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 90-4గా ఉంది.
దీపక్ హుడా 19(18)
మార్క్రమ్ 29(24)
రాహుల్ చాహర్ 3-0-20-0
కృనాల్ పాండ్యా ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 83-4గా ఉంది.
దీపక్ హుడా 18(17)
మార్క్రమ్ 23(19)
కృనాల్ పాండ్యా 4-0-24-1
రాహుల్ చాహర్ ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 75-4గా ఉంది.
దీపక్ హుడా 12(13)
మార్క్రమ్ 21(17)
రాహుల్ చాహర్ 2-0-13-0
ట్రెంట్ బౌల్ట్ ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 69-4గా ఉంది.
దీపక్ హుడా 9(10)
మార్క్రమ్ 18(14)
ట్రెంట్ బౌల్ట్ 2-0-15-0
నాథన్ కౌల్టర్ నైల్ ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 62-4గా ఉంది.
దీపక్ హుడా 3(6)
మార్క్రమ్ 17(12)
నాథన్ కౌల్టర్ నైల్ 2-0-8-0
రాహుల్ చాహర్ ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 57-4గా ఉంది.
దీపక్ హుడా 3(3)
మార్క్రమ్ 12(9)
రాహుల్ చాహర్ 1-0-7-0
బుమ్రా ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 50-4గా ఉంది.
దీపక్ హుడా 1(2)
మార్క్రమ్ 7(4)
బుమ్రా 2-0-15-2
జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో నికోలస్ పూరన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
నికోలస్ పూరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా (2: 3 బంతుల్లో)
కీరన్ పొలార్డ్ ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. కీలకమైన గేల్, కేఎల్ రాహుల్ వికెట్లు ఈ ఓవర్లోనే పడ్డాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 46-3గా ఉంది.
పూరన్ 1(1)
మార్క్రమ్ 5(2)
కీరన్ పొలార్డ్ 1-0-8-2
పొలార్డ్ బౌలింగ్‌లోనే కేఎల్ రాహుల్ కూడా భారీ షాట్‌కు వెళ్లి వికెట్ సమర్పించుకున్నాడు.
కేఎల్ రాహుల్ (సి) బుమ్రా (బి) పొలార్డ్ (21: 22 బంతుల్లో, రెండు ఫోర్లు)
పొలార్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గేల్ అవుటయ్యాడు.
గేల్ (సి) హార్దిక్ పాండ్యా (బి) పొలార్డ్ (1: 4 బంతుల్లో)
కృనాల్ పాండ్యా ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 38-1గా ఉంది.
కేఎల్ రాహుల్ 20(20)
క్రిస్ గేల్ 1(3)
కృనాల్ పాండ్యా 3-0-16-1
కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మన్‌దీప్ సింగ్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
మన్‌దీప్ సింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కృనాల్ పాండ్యా (15: 14 బంతుల్లో, రెండు ఫోర్లు)
నాథన్ కౌల్టర్ నైల్ ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 35-0గా ఉంది.
కేఎల్ రాహుల్ 18(18)
మన్‌దీప్ సింగ్ 15(13)
నాథన్ కౌల్టర్ నైల్ 1-0-3-0
జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 32-0గా ఉంది.
కేఎల్ రాహుల్ 16(15)
మన్‌దీప్ సింగ్ 14(10)
జస్‌ప్రీత్ బుమ్రా 1-0-11-0
కృనాల్ పాండ్యా ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 21-0గా ఉంది.
కేఎల్ రాహుల్ 9(10)
మన్‌దీప్ సింగ్ 10(9)
కృనాల్ పాండ్యా 2-0-13-0
ట్రెంట్ బౌల్ట్ ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 12-0గా ఉంది.
కేఎల్ రాహుల్ 7(8)
మన్‌దీప్ సింగ్ 4(4)
ట్రెంట్ బౌల్ట్ 1-0-8-0
రోహిత్ శర్మ.. కృనాల్ పాండ్యా చేతికి బంతిని అందించాడు. ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి పంజాబ్ స్కోరు 4-0గా ఉంది.
కేఎల్ రాహుల్ 2(4)
మన్‌దీప్ సింగ్ 2(2)
కృనాల్ పాండ్యా 1-0-4-0
కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), మన్‌దీప్ సింగ్, గేల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రార్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
దిల్లీపై కోల్‌కతా విజయం సాధించింది. ఆన్రిచ్ నార్జ్ వేసిన 18.2 బంతికి నితీశ్ రాణా (36*) బౌండరీ బాది గెలుపు బావుటా ఎగరేశాడు. 128 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 7 వికెట్లు నష్టపోయి మరో పది బంతులు ఉండగానే గెలిచింది.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్. టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు జరగగా, 14 మ్యాచ్‌ల్లో ముంబై, 13 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలిచాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే ఆ రికార్డు సమం అవుతుంది.
ముంబై ఇండియన్స్‌కు యూఏఈలో ఇంతవరకు ఒక్క అంశం కూడా కలసిరాలేదు. అంత బలమైన బౌలింగ్ లైనప్ కాని బెంగళూరు చేతిలోనే ముంబై 111 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు నిండా స్టార్లే ఉన్నా ఇంతవరకు ఎవరూ సరిగ్గా ఆడలేదు. కనీసం ఇద్దరు బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినా.. భారీ స్కోరును చేసే సామర్థ్యం ముంబైకి ఉంది.
ఇక పంజాబ్ విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్ మినహా ఎవరూ సరిగా ఆడటం లేదు. మయాంక్ అగర్వాల్, గేల్, పూరన్, మార్క్రమ్ ఉన్నప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో ఇబ్బంది పడుతోంది. అయితే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించారు కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా అదే జట్టు కొనసాగే అవకాశం ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -