CSK vs PBKS Live Updates: చెన్నైని చితక్కొట్టిన కేఎల్‌ రాహుల్‌.. 13 ఓవర్లకే పంజాబ్‌ ఛేదన పూర్తి

ఐపీఎల్‌ లీగు దశలో ఆఖరి మ్యాచుకు చెన్నై సూపర్‌కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ సిద్ధమయ్యాయి. గెలుపుతో లీగును ముగించాలని కేఎల్‌ రాహుల్‌ సేన భావిస్తోంది. పొరపాట్లను సరిదిద్దుకోవాలని చెన్నై పట్టుదలగా ఉంది.

ABP Desam Last Updated: 07 Oct 2021 06:51 PM
13 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 139-4


శార్దూల్‌ ఠాకూర్‌ 13 పరుగులు ఇచ్చి మార్క్రమ్‌ (13)ను ఔట్‌ చేశాడు. ఆఖరి రెండు బంతుల్ని కేఎల్‌ రాహుల్‌ (98: 42 బంతుల్లో 7x4, 8x6) బౌండరీ, సిక్సర్‌ బాదేశాడు. హెన్రిక్స్‌ (3) అతడికి తోడుగా నిలిచాడు. పంజాబ్‌ కేవలం 13 ఓవర్లకే లక్ష్యం ఛేదించడం ప్రత్యేకం.

12 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 126-3

బ్రావో 20 పరుగులు ఇచ్చాడు. రాహుల్‌ (88) రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. మార్క్రమ్‌ (13) అతడికి తోడుగా ఉన్నాడు. ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 9 పరుగులు అవసరం.

11 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 106-3

చాహర్‌ బౌలింగ్‌కు వచ్చాడు. 14 పరుగులు ఇచ్చాడు. రాహుల్‌ (71) రెండో బంతిని సూపర్‌ సిక్సర్‌గా మలిచాడు. 101 మీటర్లు బంతి వెళ్లింది. మార్క్రమ్‌ (12) అతడికి తోడుగా ఉన్నాడు.

10 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 92-3

డ్వేన్‌ బ్రావో 12 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని మార్క్రమ్‌ (8) సిక్సర్‌గా మలిచాడు. రాహుల్‌ (63) కాస్త నెమ్మదించాడు.

9 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 80-3

దీపక్‌ చాహర్‌ తొమ్మిది పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. ఆఖరి బంతికి షారుక్‌ (8)  ఔటయ్యాడు. అంతకు ముందు రాహుల్‌ (59) ఆఫ్‌సైడ్‌ కూర్చొని లెగ్‌సైడ్‌ అద్భుతమైన సిక్సర్‌ బాదాడు.

8 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 71-2


జడేజా బౌలింగ్‌కు వచ్చాడు. 9 పరుగులు ఇచ్చాడు. రాహుల్‌ (51) అర్ధశతకం చేశాడు. ఐదో బంతిని షారుక్‌ (7) సిక్సర్‌గా మలిచాడు.

రాహుల్‌ అర్ధశతకం


జడ్డూ వేసిన 7.1వ బంతికి సింగిల్‌ తీసి రాహుల్‌ 27వ అర్ధశతకం చేశాడు. ఇందుకు కేవలం 25 బంతులే తీసుకున్నాడు.

7 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 62-2


ఈసారి శార్దూల్‌ ఠాకూర్‌పై కేఎల్‌ రాహుల్‌ (49) ఎదురుదాడికి దిగాడు. ఊహించని రీతిలో అందమైన సిక్సర్‌, బౌండరీ బాదేశాడు. షారుక్‌ (0) మరో ఎండ్‌లో ఉన్నాడు. ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.

6 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 51-2

హేజిల్‌వుడ్‌ ఐదు పరుగులు ఇచ్చాడు. రాహుల్‌ (38) నిలకడగా ఆడాడు. షారుక్‌ (0) బంతిని కనెక్ట్‌ చేయలేకపోతున్నాడు.

5 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 46-2


శార్దూల్‌ ఠాకూర్‌ బ్రేక్‌ ఇచ్చాడు. రెండు వికెట్లు తీసి నాలుగు పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి మయాంక్‌ (12) ఎల్బీ అయ్యాడు. రివ్యూ తీసుకోలేదు. ఆ తర్వాత చూస్తే బంతి వికెట్లను తాకనట్టు కనిపించింది. ఇక ఆఖరి బంతికి అప్పుడే వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) ఔటయ్యాడు. రాహుల్‌ (33), షారుక్‌ ఖాన్‌ (0) క్రీజులో ఉన్నారు.

4 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 42-0


హేజిల్‌వుడ్‌కు ఈ సారి చుక్కలు చూపించారు. కేఎల్‌ రాహుల్‌ (33) వరుసగా రెండు బౌండరీలు బాదేశాడు. ఆ తర్వాత కళ్లు చెదిరే సిక్సర్‌ కొట్టేశాడు. మయాంక్‌ (8) రాహుల్‌ బ్యాటింగ్‌ను ఆస్వాదించాడు. ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.

3 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 27-0

చాహర్‌ బౌలింగ్‌పై మళ్లీ దాడి చేశారు. తొలి బంతినే రాహుల్‌ (19) తిరుగులేని సిక్సర్‌ బాదేశాడు. ఐదో బంతిని మయాంక్‌ (7) బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.

2 ఓవర్లకు పంజాబ్‌ కింగ్స్‌ 13-0

హేజిల్‌వుడ్‌ పరుగులను నియంత్రించాడు. రెండు పరుగులే ఇచ్చాడు. రాహుల్‌ (10), మయాంక్‌ (2) ఆచితూచి ఆడారు. 

1 ఓవర్‌కు పంజాబ్‌ కింగ్స్‌ 11-0


దీపక్‌ చాహర్‌ 11 పరుగులు ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్ని కేఎల్‌ రాహుల్‌ (9) బౌండరీకి పంపించాడు. మయాంక్‌ (1) అతడికి తోడుగా ఉన్నాడు.

20 ఓవర్లకు చెన్నై 134-6

షమి ఈ ఓవర్లో 16 పరుగులు ఇచ్చాడు. తొలి రెండు బంతుల్ని డుప్లెసిస్‌ (76) వరుసగా 4,6 బాదేశాడు. మూడో బంతికి ఔటయ్యాడు. ఐదో బంతిని బ్రావో (4) బౌండరీకి తరలించాడు. దాంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు చేసింది. జడ్డూ (15) అజేయంగా నిలిచాడు.

19 ఓవర్లకు చెన్నై 118-5

అర్షదీప్‌ పది పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని డుప్లెసిస్‌ (66) బౌండరీ తరలించాడు. జడ్డూ (14) నిలకడగా ఆడుతున్నాడు.

18 ఓవర్లకు చెన్నై 108-5


జోర్డాన్‌ 12 పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్‌ (58) ఆఖరి రెండు బంతుల్ని బౌండరీకి పంపించాడు. అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజా (13) నిలకడగా ఆడుతున్నాడు.

17 ఓవర్లకు చెన్నై 96-5

అర్షదీప్‌ పది పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని డుప్లెసిస్‌ (48) బౌండరీకి తరలించాడు. జడ్డూ (11) అతడికి తోడుగా ఉన్నాడు.

16 ఓవర్లకు చెన్నై 86-5

బిష్ణోయ్‌ నాలుగు పరుగులు ఇచ్చాడు. బౌండరీలు రాలేదు. జడ్డూ (10), డుప్లెసిస్‌ (40) ఆచితూచి ఆడారు.

15 ఓవర్లకు చెన్నై 82-5


హర్‌ప్రీత్‌ ఏడు పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని డుప్లెసిస్‌ (37) బౌండరీకి తరలించాడు. అర్ధశతకం వైపు సాగుతున్నాడు. జడ్డూ (9) నిలకడగా ఆడుతున్నాడు.

14 ఓవర్లకు చెన్నై 75-5

హెన్రిక్స్‌ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని జడేజా (7) బౌండరీకి పంపించాడు. డుప్లెసిస్‌ (32) నిలకడగా ఆడుతున్నాడు.

13 ఓవర్లకు చెన్నై 66-5

హర్‌ప్రీత్‌ బ్రార్‌ మళ్లీ చకచకా బౌలింగ్‌ చేశాడు. ఐదు పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్‌ (30), జడేజా (1) ఆచితూచి ఆడారు.

12 ఓవర్లకు చెన్నై 61-5, ధోనీ ఔట్‌

రవి బిష్ణోయ్‌ ఆరు పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. తొలి బంతిని బౌండరీకి తరలించిన ఎంఎస్‌ ధోనీ (12) ఆఖరి బంతికి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. డుప్లెసిస్‌ (26) నిలకడగా ఆడుతున్నాడు.

11 ఓవర్లకు చెన్నై 55-4

హర్‌ప్రీత్‌ చకచకా బంతులేశాడు. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. అందులో ఒకటి వైడ్‌. ధోనీ (7), డుప్లెసిస్‌ (25) ఆచితూచి ఆడారు.

10 ఓవర్లకు చెన్నై 53-4


రవి బిష్ణోయ్‌ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. మొదటి బంతిని ధోనీ (6), ఐదో బంతిని డుప్లెసిస్‌ (25) బౌండరీకి పంపించారు.

9 ఓవర్లకు చెన్నై 44-4

క్రిస్‌ జోర్డాన్‌ ఐదు పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. మూడో బంతికి రాయుడు ఔటయ్యాడు. డుప్లెసిస్‌ (21) నిలకడగా ఆడుతున్నాడు. ఎంఎస్ ధోనీ (1) ఆచితూచి ఆడుతున్నాడు.

అంబటి రాయుడు ఔట్‌

జోర్డాన్‌ వేసిన 8.3వ బంతికి అంబటి రాయుడు (4) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడబోయి అర్షదీప్‌కు చిక్కాడు. చెన్నై 42కే 4 వికెట్లు చేజార్చుకుంది.

8 ఓవర్లకు చెన్నై 39-3

రవి బిష్ణోయ్‌ రంగంలోకి దిగాడు. ఆరు పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్‌ (20), అంబటి రాయుడు (2) నిలకడగా ఆడుతున్నారు.

7 ఓవర్లకు చెన్నై 33-3

క్రిస్‌జోర్డాన్‌ బౌలింగ్‌కు వచ్చాడు. మూడు పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. ఐదో బంతికి రాబిన్‌ ఉతప్ప (2)ను ఔట్‌ చేశాడు. డుప్లెసిస్‌ (17) ఒక్కడే కాస్త దూకుడుగా ఆడుతున్నాడు. అంబటి రాయుడు (0) క్రీజులోకి వచ్చాడు.

6 ఓవర్లకు చెన్నై 30-2

అర్షదీప్‌ మళ్లీ మాయ చేశాడు. ఈ ఓవర్లో పది పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. తొలి రెండు బంతుల్ని డుప్లెసిస్‌ (15) బౌండరీకి తరలించాడు. నాలుగో బంతికి మొయిన్‌ అలీ (0) డకౌట్‌ అయ్యాడు.

5 ఓవర్లకు చెన్నై 20-1

షమి అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. కేవలం ఒక పరుగే ఇచ్చాడు. అలీ (0) ఇంకా ఖాతా తెరవలేదు. డుప్లెసిస్‌ (6) నిలకడగా ఆడుతున్నాడు.

రుతురాజ్‌ ఔట్‌; 4 ఓవర్లకు చెన్నై 19-1

అర్షదీప్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. ఐదో బంతికి రుతురాజ్‌ గైక్వాడ్‌ (12)ను ఔట్‌ చేశాడు. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. డుప్లెసిస్‌ (5) నిలకడగా ఆడుతున్నాడు. మొయిన్‌ అలీ (0) క్రీజులోకి వచ్చాడు.

3 ఓవర్లకు చెన్నై 13-0

షమి రెండు పరుగులు ఇచ్చాడు. రుతురాజ్‌ (9), డుప్లెసిస్‌ (2) నిలకడగా ఆడుతున్నారు. షమి కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు.

2 ఓవర్లకు చెన్నై 11-0

హర్‌ప్రీత్‌ బ్రార్‌ ఎనిమిది పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని రుతురాజ్‌ గైక్వాడ్‌ (8) బౌండరీ బాదాడు. డుప్లెసిస్‌ (1) నిలకడగా ఆడుతున్నాడు.

1 ఓవర్‌కు చెన్నై 3-0

తొలి ఓవర్‌ను షమి వేశాడు. కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. డుప్లెసిస్‌ (1), రుతురాజ్‌ (2) ఆచితూచి ఆడారు.

టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌

పంజాబ్‌ కింగ్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆఖరి లీగు మ్యాచ్‌ ఆడుతున్నాయి. టాస్‌ గెలిచిన కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

Background

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆఖరి దశకు చేరుకుంది. ప్రతి జట్టు లీగులో చివరి మ్యాచు ఆడేస్తున్నాయి. గురువారం తొలి మ్యాచులో చెన్నై సూపర్‌కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. వీరిలో ఎవరు గెలిచినా? ఎవరు ఓడినా? పెద్దగా ప్రభావమేమీ ఉండదు.


నామమాత్రమే!
భారత్‌లో దుమ్మురేపిన చెన్నై సూపర్‌కింగ్స్ యూఏఈకి వచ్చిన తర్వాతా అదే జోరు కొనసాగించింది. మొత్తంగా 13 మ్యాచుల్లో 9 గెలిచి 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. గత మ్యాచులో ఓటమి ఎదురవ్వడంతో ఆఖరి మ్యాచులో గెలిచి ఆత్మవిశ్వాసంతంతో ప్లేఆఫ్స్‌ ఆడాలన్నది ధోనీసేన వ్యూహం. గెలిచే మ్యాచులను ఓడిపోతూ నిరుత్సాహానికి గురైన రాహుల్‌ సేన కనీసం విజయంతో లీగును ముగించాలని తపన పడుతోంది. ఏదేమైనా చివరి ఐదు మ్యాచుల్లో పంజాబ్‌పై చెన్నై నాలుగు గెలవడం గమనార్హం.


కూల్‌గా చెన్నై


చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఒత్తిడేమీ లేదు. కీలక ఆటగాళ్లకు ఈ మ్యాచులో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్, డుప్లెసిస్‌ పరుగులు వరద పారిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అంబటి రాయుడు సైతం ఫామ్‌ అందుకున్నాడు. అయితే టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే ధోనీసేన గెలుపు అవకాశాలు దెబ్బతింటున్నాయి. మిడిలార్డర్‌ ఇప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. ఇది వారికి చేటు చేసినా ఆశ్చర్యం లేదు. సామ్‌ కరన్‌ గాయంతో వెనుదిరగడంతో బ్రావో కీలకం అవుతాడు. అతడికీ ఫిట్‌నెస్‌ సమస్యలు ఉన్నాయి. జడ్డూ ఎప్పటిలాగే అదరగొడుతున్నాడు. శార్దూల్‌ వికెట్లు తీస్తున్నాడు. దీపక్‌ చాహర్‌ పరిస్థితి తెలియడం లేదు. మిగతా విభాగాల్లో చెన్నైకి ఇబ్బందేమీ లేదు.


గౌరవం కోసం పంజాబ్
పంజాబ్‌ కింగ్స్‌ పేపర్‌ మీద బలంగా కనిపిస్తోంది. మైదానంలోనూ అలాగే ఆడుతున్నా.. చిన్న చిన్న మూమెంట్స్‌ను అందిపుచ్చుకోలేక ఓటమి పాలవుతోంది. వారు మానసికంగా బలంగా మారాల్సి ఉంది. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ మంచి ఓపెనింగ్‌ అందిస్తున్నారు. మిడిలార్డర్‌ మాత్రం ఆఖరి ఓవర్లలో ఒత్తిడి తట్టుకోలేక దగ్గరికొచ్చి చేతులెత్తేస్తున్నారు. పూరన్‌, మార్‌క్రమ్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. బౌలింగ్‌లో అర్షదీప్‌, షమి, రవి బిష్ణోయ్‌ రాణిస్తున్నారు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ సైతం అద్భుతంగా ఆడుతూ ఆశలు రేపుతున్నాడు. ఈ మ్యాచ్‌ను గెలిచి గౌరవంగా లీగ్‌ను ముగించాలని రాహుల్‌ సేన పట్టుదలగా ఉంది. వచ్చే సీజన్‌కు ఆ జట్టు భారీ మార్పులతో వస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.