IPL 2021 Live Updates: ముంబైపై 20 పరుగులతో చెన్నై విజయం

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ రెండో దశ ప్రారంభం అయిపోయింది. ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్లు తొలిపోరులో ఢీకొంటున్నాయి.

ABP Desam Last Updated: 19 Sep 2021 11:22 PM
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 133-6, 20 పరుగులతో చెన్నై విక్టరీ

డ్వేన్ బ్రేవో వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ మూడు పరుగులు సాధించారు. 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై 136-8 మాత్రమే చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగులతో గెలుపొందారు.


సౌరవ్ తివారీ 50(40)
జస్‌ప్రీత్ బుమ్రా 1(2)

ఆడం మిల్నే అవుట్

డ్వేన్ బ్రేవో బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఆడం మిల్నే కృష్ణప్ప గౌతం చేతికి చిక్కాడు


ఆడం మిల్నే (సి) కృష్ణప్ప గౌతం (బి)డ్వేన్ బ్రేవో (15, 15 బంతుల్లో, ఒక సిక్సర్) 

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 19 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 133-6, లక్ష్యం 157 పరుగులు

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 15 పరుగులు సాధించారు. 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 133-6గా ఉంది. విజయానికి 6 బంతుల్లో 24 పరుగులు కావాలి.


సౌరవ్ తివారీ 48(38)
ఆడం మిల్నే 15(14)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 18 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 118-6, లక్ష్యం 157 పరుగులు

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 10 పరుగులు సాధించారు. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 118-6గా ఉంది. విజయానికి 12 బంతుల్లో 39 పరుగులు కావాలి.


సౌరవ్ తివారీ 43(36)
ఆడం మిల్నే 7(10)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 17 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 108-6, లక్ష్యం 157 పరుగులు

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగారు. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 108-6గా ఉంది.


సౌరవ్ తివారీ 35(32)
ఆడం మిల్నే 5(8)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 16 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 104-6, లక్ష్యం 157 పరుగులు

బ్రేవో వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఏడు పరుగులు సాధించారు. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 104-6గా ఉంది.


సౌరవ్ తివారీ 33(30)
ఆడం మిల్నే 3(4)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 15 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 97-6, లక్ష్యం 157 పరుగులు

పొలార్డ్ అవుట్ కావడంతో స్పిన్నర్ మొయిన్ అలీని ధోని దించాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఆరు పరుగులు సాధించారు. కృనాల్ పాండ్యా రనౌటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 97-6గా ఉంది.


సౌరవ్ తివారీ 29(27)
ఆడం మిల్నే 1(1)

కృనాల్ పాండ్యా అవుట్

సౌరవ్ తివారీతో సమన్వయలోపం కారణంగా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అవుటయ్యాడు.


కృనాల్ పాండ్యా (రనౌట్, డ్వేన్ బ్రేవో/ధోని) (4, 5 బంతుల్లో) 

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 91-5, లక్ష్యం 157 పరుగులు

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు మాత్రమే సాధించారు. ఓవర్ మొదటి బంతికే కీలకమైన పొలార్డ్ వికెట్‌ను హజిల్‌వుడ్ తీశాడు. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 91-5గా ఉంది.


సౌరవ్ తివారీ 26(24)
కృనాల్ పాండ్యా 2(2)

పొలార్డ్ అవుట్

చెన్నై పేసర్ జోష్ హజిల్‌వుడ్ రెండో స్పెల్‌లో రాగానే మొదటి బంతికే కీరన్ పొలార్డ్‌ను అవుట్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో పొలార్డ్ రివ్యూకి వెళ్లాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. చెన్నైకి పెద్ద బ్రేక్.


కీరన్ పొలార్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జోష్ హజిల్‌వుడ్ (15, 14 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 87-4, లక్ష్యం 157 పరుగులు

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఐదు పరుగులు సాధించారు. 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 87-4గా ఉంది.


సౌరవ్ తివారీ 24(22)
పొలార్డ్ 15(13)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 82-4, లక్ష్యం 157 పరుగులు

బ్రేవో వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఏడు పరుగులు సాధించారు. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 82-4గా ఉంది.


సౌరవ్ తివారీ 22(19)
పొలార్డ్ 12(10)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 75-4, లక్ష్యం 157 పరుగులు

ఈసారి రవీంద్ర జడేజాను ధోని బౌలింగ్‌కి దించాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఏకంగా 13 పరుగులు పిండుకున్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 75-4గా ఉంది.


సౌరవ్ తివారీ 17(16)
పొలార్డ్ 11(7)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: పది ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 62-4, లక్ష్యం 157 పరుగులు

విండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో బౌలింగ్‌కి దిగాడు. తన రెండో బంతికే ఇషాన్ కిషన్‌ను అవుట్ చేసిన బ్రేవో ఈ ఓవర్లో 8 పరుగులను ఇచ్చాడు. పది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 62-4గా ఉంది.


సౌరవ్ తివారీ 11(13)
పొలార్డ్ 4(4)

ఇషాన్ కిషన్ అవుట్

వెస్టిండీస్ ఆల్ రౌండర్ బ్రేవో బౌలింగ్‌కి దిగి రెండో బంతికే డేంజరస్ ఇషాన్ కిషన్‌ని అవుట్ చేశాడు. దీంతో ముంబై మరింత కష్టాల్లో పడింది. ముంబై స్కోరు 9.2 ఓవర్లలో 58-4గా ఉంది.


ఇషాన్ కిషన్ (సి) సురేష్ రైనా (బి) డ్వేన్ బ్రేవో (11, 10 బంతుల్లో, ఒక ఫోర్)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 54-3, లక్ష్యం 157 పరుగులు

మొయిన్ అలీ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఆరు పరుగులు సాధించారు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 54-3గా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాటజిక్ టైం అవుట్‌ను తీసుకుంది.


సౌరవ్ తివారీ 11(13)
ఇషాన్ కిషన్ 7(8)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 48-3, లక్ష్యం 157 పరుగులు

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ మూడు పరుగులు మాత్రమే సాధించారు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 48-3గా ఉంది.


సౌరవ్ తివారీ 8(10)
ఇషాన్ కిషన్ 4(5)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఏడు ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 45-3, లక్ష్యం 157 పరుగులు

ఈసారి స్పిన్నర్ మొయిన్ అలీకి ధోని బంతిని అందించాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు సాధించారు. ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 45-3గా ఉంది.


సౌరవ్ తివారీ 6(6)
ఇషాన్ కిషన్ 3(3)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: పవర్ ప్లే ముగిసే సరికి ముంబై స్కోరు 41-3, లక్ష్యం 157 పరుగులు

శార్దూల్ ఠాకూర్‌ను ధోని రంగంలోకి దింపాడు. తన మొదటి ఓవర్లోనే శార్దూల్ సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కి పంపాడు. ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఆరు పరుగులు సాధించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై స్కోరు 41-3గా ఉంది.


సౌరవ్ తివారీ 4(2)
ఇషాన్ కిషన్ 1(1)

సూర్యకుమార్ యాదవ్ అవుట్

శార్దూల్ ఠాకూర్ తన మొదటి ఓవర్లోనే కీలక వికెట్ తీసి చెన్నై శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ముంబై స్కోరు 5.4 ఓవర్లకు 37-3
సూర్యకుమార్ యాదవ్ (సి) ఫాఫ్ డుఫ్లెసిస్ (బి) దీపక్ చాహర్: 3(7)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: ఐదో ఓవర్ ముగిసే సరికి ముంబై స్కోరు 35-2, లక్ష్యం 157 పరుగులు

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించి ఆఖరి బంతికి అన్‌‌మోల్ ప్రీత్ సింగ్ వికెట్‌ను కోల్పోయింది. ఐదో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 35-2గా ఉంది.


అన్‌మోల్ ప్రీత్ సింగ్ (బి) దీపక్ చాహర్ 16(14)
సూర్యకుమార్ యాదవ్ 2(4)

సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ డ్రాప్

ఐదో ఓవర్ రెండో బంతికి సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను ఫాఫ్ డుఫ్లెసిస్ వదిలేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: నాలుగో ఓవర్ ముగిసే సరికి ముంబై స్కోరు 34-1, లక్ష్యం 157 పరుగులు

జోష్ హజిల్ వుడ్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఏకంగా 14 పరుగులను సాధించారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 34-1గా ఉంది.


అన్‌మోల్ ప్రీత్ సింగ్ 16(10)
సూర్యకుమార్ యాదవ్ 1(2)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: మూడో ఓవర్ ముగిసే సరికి ముంబై స్కోరు 20-1, లక్ష్యం 157 పరుగులు

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ ఆరు పరుగులను సాధించారు. క్వింటన్ డికాక్‌ను దీపక్ పెవిలియన్‌కు పంపించాడు మూడో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 20-1గా ఉంది.


అన్‌మోల్ ప్రీత్ సింగ్ 2(4)
సూర్యకుమార్ యాదవ్ 1(2)

క్వింటన్ డికాక్ అవుట్

మూడో ఓవర్ రెండో బంతికి క్వింటన్ డికాక్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మొదట అంపైర్ నాటౌట్ ప్రకటించినా.. ధోని రివ్యూకి వెళ్లాడు. పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ దాన్ని అవుట్‌గా ప్రకటించారు.


క్వింటన్ డికాక్ 17(12) (ఎల్బీడబ్యూ) దీపక్ చాహర్

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: రెండో ఓవర్ ముగిసే సరికి ముంబై స్కోరు 14-0, లక్ష్యం 157 పరుగులు

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 12 పరుగులను సాధించారు. రెండో ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 14-0గా ఉంది.


క్వింటన్ డికాక్ 13(10)
అన్‌మోల్ ప్రీత్ సింగ్ 1(2)

డికాక్ క్యాచ్ డ్రాప్

జోష్ హజిల్ వుడ్ బౌలింగ్‌లో రెండో ఓవర్ నాలుగో బంతికి క్వింటన్ డికాక్ ఇచ్చిన క్యాచ్‌ను చెన్నై ఫీల్డర్ రుతురాజ్ డ్రాప్ చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: మొదటి ఓవర్ ముగిసే సరికి ముంబై స్కోరు 2-0, లక్ష్యం 157 పరుగులు

దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ రెండు పరుగులను మాత్రమే సాధించారు. ఈ ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 2-0గా ఉంది.


క్వింటన్ డికాక్ 2(6)
అన్‌మోల్ ప్రీత్ సింగ్ 0(0)

ముంబై ఇన్నింగ్స్ ప్రారంభం

క్వింటన్ డికాక్, అన్‌మోల్ ప్రీత్ సింగ్ ముంబై తరఫున ఓపెనింగ్‌కు వచ్చారు. దీపక్ చాహర్ బంతితో సిద్ధం అయ్యాడు.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: మొదటి ఇన్నింగ్స్‌లో చెన్నై స్కోరు 156-6

ఆఖరి ఓవర్ వేయడానికి తన బెస్ట్ బౌలర్ బుమ్రాను పొలార్డ్ తీసుకొచ్చాడు. ఈ ఓవర్‌లో చెన్నై 15 బ్యాట్స్‌మన్ పరుగులను సాధించారు. దీంతోపాటు బ్రేవో వికెట్‌ను కూడా కోల్పోయింది. చెన్నై తన ఇన్నింగ్స్‌ను 156-6తో ముగించింది. ముంబైకి 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


రుతురాజ్ గైక్వాడ్ 88(58)
శార్దూల్ ఠాకూర్ 1(1)


బుమ్రా: 4-0-33-2

బ్రేవో అవుట్..

చెన్నై ఆల్ రౌండర్ బ్రేవోను బుమ్రా అవుట్ చేశాడు. ఆడిన 8 బంతుల్లోనే బ్రేవో 23 పరుగులు చేయడం విశేషం.


బ్రేవో (సి) కృనాల్ పాండ్యా (బి) జస్‌ప్రీత్ బుమ్రా 23(8)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 19 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 141-5

ట్రెంట్ బౌల్ట్‌ను ముంబై బౌలింగ్‌కు దించింది. చెన్నై ఈ ఓవర్లో ఏకంగా 24 పరుగులను సాధించింది. దీంతో చెన్నై స్కోరు 19 ఓవర్లు ముగిసేసరికి 141-5కు చేరింది. ఈ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ను కొట్టగా, డ్వేన్ బ్రేవో రెండు సిక్సర్లను బాదేశాడు.


రుతురాజ్ గైక్వాడ్ 78(55)
డ్వేన్ బ్రేవో 21(6)


ట్రెంట్ బౌల్ట్: 4-1-35-2

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 18 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 117-5

ఆడం మిల్నే మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. ఈ ఓవర్లో చెన్నై 10 పరుగులను సాధించింది. దీంతో చెన్నై స్కోరు 117-5కు చేరింది.


రుతురాజ్ గైక్వాడ్ 67(52)
డ్వేన్ బ్రేవో 8(3)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 107-5

బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో చెన్నై బ్యాట్స్‌మన్ 9 పరుగులను సాధించి జడేజా వికెట్‌ను కోల్పోయారు. దీంతో చెన్నై స్కోరు 107-5కు చేరింది.


రుతురాజ్ గైక్వాడ్ 65(49)
డ్వేన్ బ్రేవో 0(0)

రవీంద్ర జడేజా అవుట్

డేంజరస్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జస్‌ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తనకు ఇదే మొదటి వికెట్.


రవీంద్ర జడేజా (సి) పొలార్డ్ (బి) జస్ ప్రీత్ బుమ్రా 26(33)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 98-4

ముంబై కెప్టెన్ పొలార్డ్ ఈ ఓవర్‌ను వేశాడు. చెన్నై బ్యాట్స్‌మన్ ఈ ఓవర్‌లో 11 పరుగులను సాధించారు. దీంతో చెన్నై స్కోరు 98-4 కు చేరింది.


రవీంద్ర జడేజా 26(32)
రుతురాజ్ గైక్వాడ్ 56(44)

అర్థశతకం సాధించిన రుతురాజ్ గైక్వాడ్

పొలార్డ్ బౌలింగ్‌లో బౌండరీతో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన అర్థశతకాన్ని చేరుకున్నాడు.


రుతురాజ్ గైక్వాడ్ 51(41 బంతుల్లో: ఆరు ఫోర్లు, ఒక సిక్సర్)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 87-4

రాహుల్ చాహర్ తన చివరి ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లో 6 పరుగులను చెన్నై బ్యాట్స్‌మన్ సాధించారు. దీంతో చెన్నై స్కోరు 87-4 కు చేరింది. బ్యాటింగ్ టీం స్ట్రాటజిక్ టైం అవుట్‌ను ఎంచుకుంది.


రవీంద్ర జడేజా: 25(31)
రుతురాజ్ గైక్వాడ్: 46(39)


రాహుల్ చాహర్: 4-0-22-0

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 81-4

ముంబై ఇండియన్స్ ప్రధాన అస్త్రం బుమ్రాను తీసుకువచ్చింది. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులను ఇచ్చాడు. దీంతో చెన్నై స్కోరు 81-4 కు చేరింది.


రవీంద్ర జడేజా 20(26)
రుతురాజ్ గైక్వాడ్ 45(38)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 81-4

ముంబై ఇండియన్స్ ప్రధాన అస్త్రం బుమ్రాను తీసుకువచ్చింది. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో  పరుగులను ఇచ్చాడు. దీంతో చెన్నై స్కోరు 81-4 కు చేరింది.


రవీంద్ర జడేజా 20(26)
రుతురాజ్ గైక్వాడ్ 45(38)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 74-4

ఈ ఓవర్‌ను రాహుల్ చాహర్ వేశాడు. మొత్తంగా 8 పరుగులను ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మన్ సాధించారు. దీంతో చెన్నై స్కోరు 74-4 కు చేరింది.


రవీంద్ర జడేజా 15(21)
రుతురాజ్ గైక్వాడ్ 44(37)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 12 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 66-4

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మన్ పరుగుల వరద పారించారు. దీంతో ఈ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 66-4 కు చేరింది.


రవీంద్ర జడేజా 14(19)
రుతురాజ్ గైక్వాడ్ 37(33)

మొదటి సిక్సర్ కొట్టిన చెన్నై బ్యాట్స్‌మన్

కృనాల్ పాండ్యా వేసిన 12వ ఓవర్ రెండో బంతిని రుతురాజ్ గైక్వాడ్ బంతిని సిక్సర్ కొట్టాడు. ఇన్నింగ్స్‌లో చెన్నైకి ఇదే మొదటి సిక్సర్

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 48-4

రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో చెన్నై బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు రాబట్టాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 48-4 కు చేరింది.


రవీంద్ర జడేజా 8(16)
రుతురాజ్ గైక్వాడ్ 26(30)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 44-4

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో మొత్తంగా తొమ్మది పరుగులు వచ్చాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 44-4 కు చేరింది.


రవీంద్ర జడేజా 7(13)
రుతురాజ్ గైక్వాడ్ 23(27)

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 9 ఓవర్లు / చెన్నై 35-4

రాహుల్ చాహర్ వేసిన ఆరో బంతికి కూడా పరుగులు తీయలేకపోయిన గైక్వాడ్. స్ట్రాటజిక్ టైం అవుట్. ఆటకు రెండున్నర నిమిషాలు విరామం.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 8.5 ఓవర్లు / చెన్నై 35-4

రాహుల్ చాహర్ వేసిన ఐదో బంతికి పరుగులు తీయలేకపోయిన గైక్వాడ్

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 8.4 ఓవర్లు / చెన్నై 35-4

రాహుల్ చాహర్ వేసిన నాలుగో బంతికి ఒక్క పరుగు తీసిన జడేజా

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 8.3 ఓవర్లు / చెన్నై 34-4

రాహుల్ చాహర్ వేసిన మూడో బంతికి రెండు పరుగులు తీసిన జడేజా

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 8.2 ఓవర్లు / చెన్నై 32-4

రాహుల్ చాహర్ వేసిన రెండో బంతికి ఒక్క పరుగు తీసిన గైక్వాడ్

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 8.1 ఓవర్లు / చెన్నై 31-4

మొదటి బంతినే డాట్‌గా వేసిన రాహుల్ చాహర్

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 8.1 ఓవర్లు / చెన్నై 31-4

మొదటి బంతినే డాట్‌గా వేసిన రాహుల్ చాహర్

పొదుపైన ఓవర్ వేసిన పొలార్డ్.. 8 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 31-4

పొలార్డ్ తన ఎనిమిదో ఓవర్‌ను అత్యంత పొదుపుగా వేయడంతో కేవలం నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి.


రవీంద్ర జడేజా 3(8)


రుతురాజ్ గైక్వాడ్ 18(20)

ఏడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై 27-4

బుమ్రా వేసిన ఈ ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో చెన్నై స్కోరు 27-4కు చేరుకుంది.

జడేజా క్రీజులోకి..

మహేంద్ర సింగ్ ధోని స్థానంలో జడేజా క్రీజులోకి వచ్చాడు.

ధోని అవుట్.. ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై 24-4

చెన్నై కష్టాల బాట నుంచి ఇప్పుడే బయటపడేలా లేదు. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు.


మహేంద్ర సింగ్ ధోని 3(5) (సి) ట్రెంట్ బౌల్ట్ (బి) ఆడం మిల్నే

బౌండరీ సాధించిన రుతురాజ్

ఆడమ్ మిల్నే వేసిన ఐదో ఓవర్ మూడో బంతికి రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే షాట్‌తో బౌండరీ సాధించాడు. 5.3 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 23-3

ఐదు ఓవర్లు ముగిసే సరికి చెన్నై 18-3

ఈ ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఒక బౌండరీ సాధించాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి చెన్నై 18-3తో నిలిచింది.


మహేంద్ర సింగ్ ధోని 2(2)


రుతురాజ్ గైక్వాడ్ 10(13)

ఎట్టకేలకు వికెట్ పడకుండా ఒక ఓవర్ ఆడిన చెన్నై.. నాలుగు ఓవర్లు ముగిసే సరికి 11-3

చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో ఓవర్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఈ ఓవర్లో ఒక బౌండరీతో గైక్వాడ్ 4 పరుగులు రాబట్టాడు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోరు 11-3గా ఉంది.


రుతురాజ్ గైక్వాడ్ 5(9)


మహేంద్ర సింగ్ ధోని 0(0)

రైనా అవుట్.. మూడు ఓవర్లు ముగిసే సరికి చెన్నై 7-3

బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో రైనా ఒక బౌండరీ కొట్టి జోష్ మీద కనిపించినా ఇదే ఓవర్‌లో ఆఖరి బంతికి అవుటయ్యాడు. దీంతో మూడో ఓవర్ ముగిసే సరికి చెన్నై 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


సురేష్ రైనా 4(6) (సి) రాహుల్ చాహర్ (బి) ట్రెంట్ బౌల్ట్

చెన్నై ఇన్నింగ్స్‌లో మొదటి బౌండరీ కొట్టిన రైనా

బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో నాలుగో బంతిని బౌండరీగా తరలించిన రైనా చెన్నై సూపర్ కింగ్స్‌కు  మొదటి బౌండరీని అందించాడు.

రాయుడు రిటైర్డ్ హర్ట్.. రైనా ఇన్

ఆడమ్ మిల్నే వేసిన రెండో ఓవర్ చివరి బంతి నేరుగా ఎడమ చేతిని తాకడంతో అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సురేశ్ రైనా క్రీజులోకి వచ్చాడు.

రెండో ఓవర్ ముగిసేసరికి చెన్నై స్కోరు 3-2

రెండో ఓవర్ ముగిసేసరికి చెన్నై 3 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.


అంబటి రాయుడు 0(3)


రుతురాజ్ గైక్వాడ్ 1(3)

క్రీజులోకి రాయుడు

మొయిన్ అలీ అవుటవ్వడంతో అంబటి రాయుడు క్రీజ్‌లోకి వచ్చాడు. చెన్నై కష్టాల నుంచి గట్టెక్కాలంటే రాయుడు బాగా ఆడటం ఎంతో అవసరం.

రెండో వికెట్ కూడా కొల్పోయిన చెన్నై

ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో సౌరవ్ తివారీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మొయిన్ అలీ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇప్పుడు చెన్నై స్కోరు 2-2.


మొయిన్ అలీ 0(3) (సి) సౌరవ్ తివారీ (బి) ఆడమ్ మిల్నే

మొదటి ఓవర్ ముగిసే సరికి చెన్నై స్కోరు 1-1

చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసింది. ఫాఫ్ డుఫ్లెసిస్ వికెట్ కూడా కోల్పోవడంతో చెన్నై ఇప్పుడు ఒత్తిడిలో ఉంది.


రుతురాజ్ 0(2)


మొయిన్ అలీ 0(1)

మొదటి వికెట్ కోల్పోయిన చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో ఆడమ్ మిల్నే క్యాచ్ పట్టడంతో డుఫ్లెసిస్ డకౌట్‌గా వెనుదిరిగాడు.


డుఫ్లెసిస్ 0(3) (సి) ఆడమ్ మిల్నే (బి) ట్రెంట్ బౌల్ట్

ఆట ఆరంభం

చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుఫ్లెసిస్‌లను ఓపెనర్‌లుగా పంపింది. మొదటి ఓవర్ వేయటానికి బౌల్ట్ బంతితో సిద్ధం అయ్యాడు.

వాతావరణ అప్‌డేట్

నేటి మ్యాచ్ జరిగే దుబాయ్ వేదిక వాతావరణ నివేదిక వచ్చేసింది. దీని ప్రకారం వాతావరణం చాలా క్లియర్‌గా ఉండనుంది. మ్యాచ్ 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

చెన్నై సూపర్ కింగ్స్(తుది జట్టు)

ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(కెప్టెన్/వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డీజే బ్రేవో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజిల్ వుడ్

ముంబై ఇండియన్స్(తుది జట్టు)

క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, సౌరవ్ తివారీ, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆడం మిల్నే, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

హార్దిక్ కూడా దూరం

నేటి మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విధ్వంసక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా దూరమయ్యాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

రోహిత్ శర్మ లేకపోవడంతో ముంబై కెప్టెన్‌గా పొలార్డ్

ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో ముంబై ఇండియన్స్‌కు పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

పిచ్ రిపోర్ట్

ఈ పిచ్ చాలా హార్డ్‌గా ఉంది. వాతావరణం కూడా వేడిగా ఉంది. బ్యాటింగ్ చేయడానికి ఇది చాలా మంచి వికెట్. పిచ్ చూడటానికి కాస్త పచ్చగా ఉంది. ఈ ట్రాక్‌లో 2020లో పేస్ బౌలర్లు ఎక్కువ వికెట్లు తీసుకున్నారు. ఈ వికెట్ మీద టాస్ గెలిస్తే చేజింగ్ ఎంచుకోవడం మంచిదని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నారు. చెన్నై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వచ్చి పిచ్‌ను పరిశీలించి వెళ్లాడు.

Background

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ రెండో దశ మరికొన్ని నిమిషాల్లో మొదలవుతోంది. లీగ్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్లు తొలిపోరులో ఢీకొంటున్నాయి. 


ప్రస్తుతం చెన్నైతో పోలిస్తే ముంబయి కాస్త బలంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. డికాక్, సూర్య, కిషన్‌, పొలార్డ్‌, హార్దిక్‌కు ఈ మధ్య మ్యాచ్‌ అనుభవం బాగానే దొరికింది. బుమ్రా, బౌల్ట్‌‌ల వంటి బౌలర్లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.


చెన్నై పరిస్థితి మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. ఆటగాళ్లలో ఫిట్‌నెస్‌ లోపాలు బయటపడ్డాయి. డుప్లెసిస్‌ ఇంకా కోలుకోలేదు. డ్వేన్‌ బ్రావో ఫిట్‌నెస్‌తో ఉన్నా ఏ స్థాయిలో ఆడతాడో చెప్పలేం. క్వారంటైన్‌ కారణంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్ అందుబాటులో లేడు. రుతురాజ్‌ గైక్వాడ్‌తో ఓపెనింగ్‌కు ఎవరొస్తారో తెలియదు. మిడిలార్డర్లో ఎవరు విఫలమైనా ధోనీపై ఒత్తిడి తప్పదు. బౌలింగ్ విభాగంలో దీపక్ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ రాణించకపోతే ఇబ్బందులు తప్పనిసరి.


ఐపీఎల్‌లో చెన్నైపై ముంబయిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా 19 సార్లు ముంబయి, 12 సార్లు చెన్నై గెలిచాయి. చివరి ఐదు మ్యాచ్‌ల్లో రోహిత్‌సేన ఏకంగా నాలుగుసార్లు గెలవడం విశేషం. ఈ సీజన్‌ తొలిదశలో మే 1వ తేదీన ధోనీసేనతో తలపడ్డ పోరులో ముంబయి  219 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో ఛేదించింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.