భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సిరీస్‌లో భాగంగా రేపు చివరి టెస్టు మాంచెస్టర్‌లో జరగాల్సి ఉంది. భారత జట్టు ఫిజియో‌కి తాజాగా కరోనా పాజిటివ్ రావడంతో రేపటి మ్యాచ్ పై అనుమానాలు మొదలయ్యాయి.  

Also Read: ICC T20 World Cup: ధోనీ నియామకంపై వివాదం... టీ20 ప్రపంచకప్ జట్టుకు మెంటార్‌గా ధోనీని ప్రకటించిన జై షా... వివరణ ఇచ్చిన గంగూలీ

ఈ నేపథ్యంలో టీమిండియా తన ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకుంది. ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం అవ్వాలని కోరింది. ఆటగాళ్లకు నిన్న నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, ఆటగాళ్లందరికీ నిర్వహించిన టెస్టులో నెగటివ్ రిపోర్టులే వచ్చాయి. ఇది కాస్తు ఊరట ఇచ్చే విషయమే.  అయినప్పటికీ, నిబంధనల ప్రకారం ఆటగాళ్లకి రెండోసారి కూడా టెస్టులు నిర్వహించారు. 

Also Read: IND vs ENG: టీమిండియాలో మరొకరికి కరోనా పాజిటివ్... ప్రాక్టీస్ సెషన్ రద్దు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. తాను కూడా రేపటి టెస్టుపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని వ్యాఖ్యానించాడు. ఈ టెస్టు జరుగుతుందో లేదో కూడా నేను చెప్పలేను అని PTIకి తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రేపు చివరి టెస్టు ప్రారంభంకావాలని ఆశిద్దాం అని గంగూలీ కోరాడు. 

Also Read: IPL 2021: కామెంటేటర్ బాధ్యతలు ముగిశాయి... ఇక IPL కోసం దినేశ్ కార్తీక్ కసరత్తులు

ఇప్పటికే ప్రధాన కోచ్ రవి శాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా పాజిటివ్‌గా తేలారు. టీమిండియా జట్టు కోసం ఓ ఫిజియో కావాలని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డును బీసీసీఐ కోరినట్లు సమాచారం. ఆటగాళ్లకు రెండోసారి నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఫలితాలపైనే రేపటి టెస్టు జరుగుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు చెప్పినట్లు సమాచారం. 

నాలుగో టెస్టు ప్రారంభానికి ముందు కోచ్ రవిశాస్త్రి లండన్‌లో ఓ పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆ సమయంలోనే అతడికి కరోనా సోకి ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టుల్లో విజయం సాధించిన కోహ్లీ సేన 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ భారత జట్టు కైవసం అవుతుంది. ఓడితే సిరీస్ సమం అవుతుంది.