India vs West Indies 5th T20 Live Streaming: భారత్‌, వెస్టిండీస్‌ టీ20 సిరీసు ఆఖరి మ్యాచ్‌ నేడు జరుగుతోంది. 3-1తో సిరీసును టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. నామమాత్రంగా జరిగే చివరి మ్యాచులో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. నేటి మ్యాచ్‌ టైమింగ్‌, లైవ్‌ టెలికాస్ట్‌, తుది జట్లు, స్టేడియం వివరాలు మీకోసం!


When Does India vs West Indies 5th T20 match Begin (Date and Time in India)?


భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20 వేదిక అమెరికాకు మారింది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో మ్యాచ్‌ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. 7:00 గంటలకు టాస్‌ వేస్తారు. 


Where to Watch India vs West Indies 5th T20 match?


భారత్‌, వెస్టిండీస్‌ సిరీస్‌ను దూరదర్శన్‌ స్పోర్ట్స్‌లో వీక్షించొచ్చు. ప్రైవేటు ఛానళ్లు ఈ సిరీస్‌ను ప్రసారం చేయడం లేదు.


How to Watch India vs West Indies 5th T20 match Live Streaming Online for Free in India?


భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ వస్తుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.


India vs West Indies Series schedule


భారత్‌, వెస్టిండీస్‌ మొదట మూడు వన్డేల సిరీస్‌ ఆడాయి. జులై 29 నుంచి ఐదు టీ20ల సిరీసు మొదలైంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్‌ కీట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ ఆతిథ్యం ఇచ్చింది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.


India vs West Indies 5th T20 match Probable XI


భారత్‌: రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌/ సంజు శాంసన్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌, అవేశ్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌ సింగ్‌


వెస్టిండీస్‌: కైల్‌ మేయర్స్‌, బ్రాండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌, జేసన్ హోల్డర్‌, రోమన్‌ పావెల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రొమారియో షెఫర్డ్‌, అకేల్‌ హుస్సేన్‌, కీమోపాల్‌ / హెడేన్‌ వాల్ష్‌ జూనియర్‌, అల్జారీ జోసెఫ్‌, ఒబెడ్‌ మెకాయ్‌