India vs Sri Lanka 3rd T20I: భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్ శనివారం (జనవరి 7వ తేదీ) రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై లాంటిది. మూడో టీ20లో గెలిచిన జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. భారత గడ్డపై ఇప్పటి వరకు టీ20 సిరీస్‌ను శ్రీలంక గెలవలేకపోయింది. ఇప్పుడు లంకేయులకు ఆ అవకాశం దక్కింది.


అదే సమయంలో శ్రీలంకపై టీమ్ ఇండియా తన అజేయమైన ఆర్డర్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. మూడో మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను టీమ్ ఇండియా నుంచి తప్పించవచ్చు. పుణె వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ వేసిన నో బాల్స్‌తో టీమిండియా కొంప ముంచాయి. దీంతో ఆ జట్టు ఓటమి రూపంలో చవిచూడాల్సి వచ్చింది.


ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మొత్తం ఐదు నో బాల్స్ చేశాడు. మ్యాచ్‌లో అత్యంత ఎక్స్‌పెన్సివ్ బౌలర్ అయ్యాడు. రెండో టీ20లో విజయం సాధించిన శ్రీలంక సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ముంబై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.


హ్యాట్రిక్ నో బాల్స్
శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌలింగ్ చేసేందుకు అర్ష్‌దీప్ సింగ్ వచ్చాడు. ఈ సమయంలో కుశాల్ మెండిస్ బ్యాటింగ్ ఉన్నాడు. అతను తన మొదటి ఐదు బంతుల్లో 5 పరుగులు ఇచ్చాడు. కానీ ఆరో బంతి నో బాల్‌గా మారింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు నో బాల్స్‌ వేశాడు. ఈ విధంగా అర్ష్‌దీప్ సింగ్ నో బాల్స్‌లో హ్యాట్రిక్ కొట్టాడు. ఈ అదనపు మూడు బంతుల్లో అతను 14 పరుగులు చేశాడు.


అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్‌లో మొత్తం 19 పరుగులు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు పాటు శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ ఒక్కో నో బాల్‌ వేశారు. రెండో వన్డేలో భారత్ మొత్తం 7 నోబాల్స్ వేయగా, అందులో 22 పరుగులు వచ్చాయి. అదనంగా నాలుగు వైడ్ బంతులు జోడిస్తే, శ్రీలంక ఇన్నింగ్స్‌లో భారత్ 21.5 ఓవర్లు బౌల్ చేసింది.


ఇప్పటివరకు 14 సార్లు
లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ భారత్ తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 14 సార్లు ఓవర్‌స్టెప్ చేస్తూ నో బాల్ విసిరాడు. దీంతో అర్ష్‌దీప్ సింగ్‌కు‌ నో బాల్‌ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. తన బలహీనత కారణంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రెజెంటేషన్ వేడుకలో హార్దిక్ మాట్లాడుతూ ఒక రోజు మీకు మంచిది కావచ్చు, ఒక రోజు మీకు చెడ్డది కావచ్చు. కానీ మీరు ప్రాథమిక విషయాల నుండి దూరంగా ఉండకూడదని వ్యాఖ్యానించాడు. కాబట్టి మూడో టీ20లో అర్ష్‌దీప్ సింగ్‌ను హార్దిక్ ఆడిస్తాడో లేక పక్కన పెడతాడో చూడాలి.