Ind vs NZ 3rd T20 Live: 17.2 ఓవర్లలో ముగిసేసరికి 111కు న్యూజిలాండ్ ఆలౌట్, 73 పరుగులతో టీమిండియా విజయం

Ind vs NZ 3rd T20 International, Eden Garden: న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది.

ABP Desam Last Updated: 21 Nov 2021 10:33 PM
17.2 ఓవర్లలో ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 111 ఆలౌట్, 73 పరుగులతో టీమిండియా విజయం

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. లోకి ఫెర్గూసన్ అవుట్ అవ్వడంతో టీమిండియా 73 పరుగులతో విజయం సాధించింది.
ట్రెంట్ బౌల్ట్ 2(2)
దీపక్ చాహర్ 2.2-0-26-1
లోకి ఫెర్గూసన్ (సి అండ్ బి) దీపక్ చాహర్ (14: 8 బంతుల్లో, రెండు సిక్సర్లు)

17 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 110-9, లక్ష్యం 185 పరుగులు

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇష్ సోధి అవుటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 18 బంతుల్లో 75 పరుగులు కావాలి.
ట్రెంట్ బౌల్ట్ 1(1)
లోకి ఫెర్గూసన్ 14(7)
హర్షల్ పటేల్ 3-0-26-2
ఇష్ సోధి (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) హర్షల్ పటేల్ (9: 11 బంతుల్లో, రెండు ఫోర్లు)

16 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 95-8, లక్ష్యం 185 పరుగులు

వెంకటేష్ అయ్యర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆడం మిల్నే అవుటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 24 బంతుల్లో 90 పరుగులు కావాలి.
ఇష్ సోధి 9(10)
లోకి ఫెర్గూసన్ 1(3)
వెంకటేష్ అయ్యర్ 3-0-12-1
ఆడం మిల్నే (సి) రోహిత్ శర్మ (బి) వెంకటేష్ అయ్యర్ (7: 6 బంతుల్లో, ఒక సిక్సర్)

15 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 93-7, లక్ష్యం 185 పరుగులు

యజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగులు మాత్రమే వచ్చింది. న్యూజిలాండ్ విజయానికి 30 బంతుల్లో 92 పరుగులు కావాలి.
ఇష్ సోధి 8(8)
ఆడం మిల్నే 7(5)
యజ్వేంద్ర చాహల్ 4-0-26-1

14 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 92-7, లక్ష్యం 185 పరుగులు

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మిషెల్ శాంట్నర్ రనౌటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 36 బంతుల్లో 93 పరుగులు కావాలి.
ఇష్ సోధి 8(5)
ఆడం మిల్నే 6(2)
దీపక్ చాహర్ 2-0-11-1
మిషెల్ శాంట్నర్ (రనౌట్ ఇషాన్ కిషన్) (2: 4 బంతుల్లో)

13 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 83-6, లక్ష్యం 185 పరుగులు

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. జిమ్మీ నీషం అవుటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 42 బంతుల్లో 102 పరుగులు కావాలి.
మిషెల్ శాంట్నర్ 0(2)
ఆడం మిల్నే 6(2)
హర్షల్ పటేల్ 2-0-11-1
జిమ్మీ నీషం (సి) రిషబ్ పంత్ (బి) హర్షల్ పటేల్ (3: 7 బంతుల్లో)

12 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 76-5, లక్ష్యం 185 పరుగులు

వెంకటేష్ అయ్యర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. టిమ్ సీఫెర్ట్ రనౌటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 48 బంతుల్లో 109 పరుగులు కావాలి.
మిషెల్ శాంట్నర్ 0(2)
జిమ్మీ నీషం 3(4)
వెంకటేష్ అయ్యర్ 2-0-10-0
టిమ్ సీఫెర్ట్ (రనౌట్ ఇషాన్ కిషన్/పంత్) (17: 18 బంతుల్లో, ఒక ఫోర్)

11 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 70-4, లక్ష్యం 185 పరుగులు

యజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. మార్టిన్ గుప్టిల్ అవుటయ్యాడు. న్యూజిలాండ్ విజయానికి 54 బంతుల్లో 115 పరుగులు కావాలి.
టిమ్ సీఫెర్ట్ 14(16)
జిమ్మీ నీషం 0(2)
యజ్వేంద్ర చాహల్ 3-0-25-1
మార్టిన్ గుప్టిల్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) చాహల్ (51: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)

10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 68-3, లక్ష్యం 185 పరుగులు

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 60 బంతుల్లో 117 పరుగులు కావాలి.
టిమ్ సీఫెర్ట్ 12(14)
మార్టిన్ గుప్టిల్ 51(34)
అక్షర్ పటేల్ 3-0-9-3

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 61-3, లక్ష్యం 185 పరుగులు

యజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 60 బంతుల్లో 124 పరుగులు కావాలి.
టిమ్ సీఫెర్ట్ 9(12)
మార్టిన్ గుప్టిల్ 47(30)
యజ్వేంద్ర చాహల్ 2-0-23-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 45-3, లక్ష్యం 185 పరుగులు

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 66 బంతుల్లో 140 పరుగులు కావాలి.
టిమ్ సీఫెర్ట్ 4(10)
మార్టిన్ గుప్టిల్ 36(26)
హర్షల్ పటేల్ 1-0-4-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 41-3, లక్ష్యం 185 పరుగులు

వెంకటేష్ అయ్యర్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 78 బంతుల్లో 144 పరుగులు కావాలి.
టిమ్ సీఫెర్ట్ 2(6)
మార్టిన్ గుప్టిల్ 34(24)
వెంకటేష్ అయ్యర్ 1-0-4-0

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 37-3, లక్ష్యం 185 పరుగులు

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 84 బంతుల్లో 148 పరుగులు కావాలి.
టిమ్ సీఫెర్ట్ 0(4)
మార్టిన్ గుప్టిల్ 32(20)
భువనేశ్వర్ కుమార్ 2-0-12-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 30-3, లక్ష్యం 185 పరుగులు

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు వచ్చింది. న్యూజిలాండ్ విజయానికి 90 బంతుల్లో 155 పరుగులు కావాలి.
టిమ్ సీఫెర్ట్ 0(2)
మార్టిన్ గుప్టిల్ 25(16)
అక్షర్ పటేల్ 2-0-2-3
గ్లెన్ ఫిలిప్స్ (బి) అక్షర్ (0: 4 బంతుల్లో)

నాలుగు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 29-2, లక్ష్యం 185 పరుగులు

యజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 96 బంతుల్లో 156 పరుగులు కావాలి.
గ్లెన్ ఫిలిప్స్ 0(1)
మార్టిన్ గుప్టిల్ 24(15)
యజ్వేంద్ర చాహల్ 1-0-7-0

మూడు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 22-2, లక్ష్యం 185 పరుగులు

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. న్యూజిలాండ్ విజయానికి 102 బంతుల్లో 163 పరుగులు కావాలి.
గ్లెన్ ఫిలిప్స్ 0(0)
మార్టిన్ గుప్టిల్ 16(7)
దీపక్ చాహర్ 1-0-1-2
డేరిల్ మిషెల్ (సి) హర్షల్ పటేల్ (బి) అక్షర్ పటేల్ (5: 6 బంతుల్లో)
మార్క్ చాప్‌మన్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ పటేల్ (0: 2 బంతుల్లో)

రెండు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 21-0, లక్ష్యం 185 పరుగులు

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 108 బంతుల్లో 164 పరుగులు కావాలి.
డేరిల్ మిషెల్ 5(5)
మార్టిన్ గుప్టిల్ 16(7)
దీపక్ చాహర్ 1-0-16-0

మొదటి ఓవర్ ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 5-0, లక్ష్యం 185 పరుగులు

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 114 బంతుల్లో 180 పరుగులు కావాలి.
డేరిల్ మిషెల్ 0(3)
మార్టిన్ గుప్టిల్ 5(3)
భువనేశ్వర్ కుమార్ 1-0-5-0

20 ఓవర్లలో భారత్ స్కోరు 184-7, న్యూజిలాండ్ లక్ష్యం 185

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ విజయానికి 120 బంతుల్లో 185 పరుగులు కావాలి.
దీపక్ చాహర్ 21(8)
అక్షర్ పటేల్ 2(4)
ఆడం మిల్నే 4-0-47-1

19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 165-7

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. హర్షల్ పటేల్ హిట్ వికెట్‌గా అవుటయ్యాడు.
దీపక్ చాహర్ 2(2)
అక్షర్ పటేల్ 2(4)
లోకి ఫెర్గూసన్ 4-0-45-1
హర్షల్ పటేల్ (హిట్ వికెట్) (బి) లోకి ఫెర్గూసన్ (18: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)

18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 156-6

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి.
హర్షల్ పటేల్ 12(8)
అక్షర్ పటేల్ 1(3)
ట్రెంట్ బౌల్ట్ 4-0-31-1

17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 148-6

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. శ్రేయస్ అయ్యర్ అవుటయ్యారు.
హర్షల్ పటేల్ 6(4)
అక్షర్ పటేల్ 1(1)
ఆడం మిల్నే 3-0-28-1
శ్రేయస్ అయ్యర్ (సి) మిషెల్ (బి) ఆడం మిల్నే (25: 20 బంతుల్లో, రెండు ఫోర్లు)

16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 140-5

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్ అవుటయ్యారు.
శ్రేయస్ అయ్యర్ 25(19)
అక్షర్ పటేల్ 0(0)
ట్రెంట్ బౌల్ట్ 3-0-24-1
వెంకటేష్ అయ్యర్ (సి) మార్క్ చాప్‌మన్ (బి) ట్రెంట్ బౌల్ట్ (20: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)

15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 134-4

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి.
శ్రేయస్ అయ్యర్ 21(15)
వెంకటేష్ అయ్యర్ 19(13)
మిషెల్ శాంట్నర్ 4-0-27-3

14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 127-4

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.
శ్రేయస్ అయ్యర్ 20(13)
వెంకటేష్ అయ్యర్ 13(9)
ఇష్ సోధి 4-0-31-1

13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 114-4

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి.
శ్రేయస్ అయ్యర్ 15(11)
వెంకటేష్ అయ్యర్ 5(5)
లోకి ఫెర్గూసన్ 3-0-36-0

12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 108-4

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. రెండో బంతికి రోహిత్ శర్మ అవుటయ్యాడు.
శ్రేయస్ అయ్యర్ 13(8)
వెంకటేష్ అయ్యర్ 2(2)
ఇష్ సోధి 3-0-18-1
రోహిత్ శర్మ (సి అండ్ బి) ఇష్ సోధి (56: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు)

11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 103-3

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ అర్థ సెంచరీ పూర్తయింది. ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది రెండో అర్థ సెంచరీ.
రోహిత్ శర్మ 56(29)
శ్రేయస్ అయ్యర్ 10(6)
మిషెల్ శాంట్నర్ 3-0-20-3

10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 90-3

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 48(25)
శ్రేయస్ అయ్యర్ 5(4)
ఇష్ సోధి 2-0-13-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 83-3

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. రిషబ్ పంత్ అవుటయ్యాడు
రోహిత్ శర్మ 46(23)
శ్రేయస్ అయ్యర్ 0(0)
మిషెల్ శాంట్నర్ 2-0-7-3
రిషబ్ పంత్ (సి) జిమ్మీ నీషం (బి) శాంట్నర్ (4: 6 బంతుల్లో)

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 77-2

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 42(20)
రిషబ్ పంత్ 3(3)
ఇష్ సోధి 1-0-6-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 71-2

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యారు.
రోహిత్ శర్మ 39(17)
రిషబ్ పంత్ 0(0)
మిషెల్ శాంట్నర్ 1-0-2-2
ఇషాన్ కిషన్ (సి) టిమ్ సీఫెర్ట్ (బి) మిషెల్ శాంట్నర్ (29: 21 బంతుల్లో, ఆరు ఫోర్లు)
సూర్యకుమార్ యాదవ్ (సి) గుప్టిల్ (బి) మిషెల్ శాంట్నర్ (0: 4 బంతుల్లో)

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 69-0

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 39(17)
ఇషాన్ కిషన్ 29(20)
లోకి ఫెర్గూసన్ 2-0-30-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 49-0

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 24(13)
ఇషాన్ కిషన్ 24(17)
ఆడం మిల్నే 2-0-20-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 39-0

లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 23(12)
ఇషాన్ కిషన్ 15(12)
లోకి ఫెర్గూసన్ 1-0-10-0

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 29-0

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 14(9)
ఇషాన్ కిషన్ 14(9)
ట్రెంట్ బౌల్ట్ 2-0-18-0

రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 18-0

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 8(6)
ఇషాన్ కిషన్ 10(6)
ఆడం మిల్నే 1-0-10-0

మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 8-0

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 8(6)
ఇషాన్ కిషన్ 0(0)
ట్రెంట్ బౌల్ట్ 1-0-8-0

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఆశ్చర్యకరంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Background

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆఖరిదైన మూడో మ్యాచ్‌కి ఈడెన్ గార్డెన్‌ ముస్తాబైంది. రెండున్నరేళ్ల తర్వాత ఇక్కడ మ్యాచ్‌ జరుగుతుండటంతో అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది. 2-0తో సిరీసు కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా వైట్‌వాష్‌పై కన్నేసింది. అలా జరగకుండా ఆపాలని న్యూజిలాండ్‌ కూడా పట్టుదలతో ఉంది. మరి మ్యాచ్‌లో ఎవరి బలమేంటి? కొత్త కుర్రాళ్లలో ఎవరికి అరంగేట్రం చేసే అవకాశం దక్కనుంది.


సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో టీమ్‌ఇండియాపై ఒత్తిడి లేదు. గెలుపోటములను ప్రస్తావన మైండ్‌లోకి రాకుండా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. కుర్రాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, అవేశ్‌ ఖాన్‌ అరంగేట్రానికి సై అంటున్నారు. సీఎస్‌కేలో గైక్వాడ్‌ పరుగుల వరద పారిస్తే డీసీలో అవేశ్‌ వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్‌, కేఎల్‌ రాహుల్‌, భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అరంగేట్రంలోనే అదరగొట్టిన హర్షల్‌ పటేల్‌పై అంచనాలు పెరిగిపోయాయి.


టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే మూడో టీ20లో  అతడు మరో 87 పరుగులు చేస్తే చాలు. భారత్‌ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. న్యూజిలాండ్‌ సిరీసులో రోహిత్ శర్మ 103 పరుగులు చేశాడు. పొట్టి క్రికెట్లో 118 మ్యాచుల్లోనే 3141 పరుగులు చేశాడు. భారత్‌ తరఫున టీ20ల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అంతకన్నా ముందు విరాట్‌ కోహ్లీ 3227తో ఉన్నాడు. హిట్‌మ్యాన్ మరో 87 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డు బద్దలవుతుంది.


అంతర్జాతీయంగా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మార్టిన్‌ గుప్టిల్ ముందున్నాడు. అతడు కేవలం 107 ఇన్నింగ్సుల్లోనే 3248 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియాతో రెండో మ్యాచులో 17 బంతుల్లోనే 31 పరుగులు చేయడంతో ఈ ఘనత అందుకున్నాడు. విరాట్‌ కోహ్లీని అధిగమించాడు. ఇక మూడో స్థానంలో రోహిత్ ఉన్నాడు


సిరీసులో వైట్‌వాష్‌ అవ్వనివ్వకూడదని న్యూజిలాండ్‌ పట్టుదలగా ఉంది. మార్టిన్‌ గప్తిల్‌, గ్లెన్ ఫిలిప్స్‌, మిచెల్‌, ఛాప్‌మన్‌ ఫామ్‌లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్‌, టిమ్‌ సౌతీ స్థాయికి తగ్గట్టు బంతులు వేస్తున్నా కాపాడుకోగల స్కోరు బ్యాటర్లు చేయలేదు. పైగా టాస్‌ ఓడిపోవడం వారిని వెనకబడేలా చేసింది. జట్టులో మరీ మార్పులేమీ ఉండకపోవచ్చు. ఈడెన్‌ పిచ్‌ కివీస్‌ బౌలింగ్‌కు నప్పడం సానుకూల అంశం.


ఈడెన్‌ గార్డెన్‌ పేస్‌, బౌన్స్‌కు అనుకూలిస్తుంది. బౌన్స్‌ ఉంటుంది కాబట్టి పేసర్లే కాకుండా స్పిన్నర్లూ వికెట్లు తీయగలరు. ఫ్లాట్‌ పిచ్‌ కావడంతో బ్యాటర్లు పరుగుల వరద పారించేందుకు అవకాశం ఉంటుంది. కోల్‌కతా వాతావరణం బాగుంది. 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.