Ind vs NZ 2nd T20 Live: 17.2 ఓవర్లలో మ్యాచ్ ముగించిన భారత్, ఏడు వికెట్లతో విజయం

భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 19 Nov 2021 10:51 PM
17.2 ఓవర్లలో మ్యాచ్ ముగించిన భారత్, ఏడు వికెట్లతో విజయం

జిమ్మీ నీషం వేసిన ఈ ఓవర్ మొదటి రెండు బంతుల్లోనే రెండు సిక్సర్లతో పంత్ మ్యాచ్ ముగించాడు. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
రిషబ్ పంత్ 12(6)
వెంకటేష్ అయ్యర్ 12(11)
జిమ్మీ నీషం 0.2-0-12-0

17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 143-3, లక్ష్యం 154 పరుగులు

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 18 బంతుల్లో 11 పరుగులు కావాలి.
రిషబ్ పంత్ 0(4)
వెంకటేష్ అయ్యర్ 12(11)
ట్రెంట్ బౌల్ట్ 4-0-36-0

16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 137-3, లక్ష్యం 154 పరుగులు

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యారు. భారత్ విజయానికి 24 బంతుల్లో 17 పరుగులు కావాలి.
రిషబ్ పంత్ 0(0)
వెంకటేష్ అయ్యర్ 7(9)
టిమ్ సౌతీ 4-0-16-3
రోహిత్ శర్మ (సి) గుప్టిల్ (బి) సౌతీ (55: 36 బంతుల్లో, ఒక ఫోర్, ఐదు సిక్సర్లు)
సూర్యకుమార్ యాదవ్ (బి) సౌతీ (1: 2 బంతుల్లో)

15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 134-1, లక్ష్యం 154 పరుగులు

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ అర్థ సెంచరీ పూర్తయింది. భారత్ విజయానికి 30 బంతుల్లో 20 పరుగులు కావాలి.
రోహిత్ శర్మ 55(35)
వెంకటేష్ అయ్యర్ 5(6)
ఆడం మిల్నే 3-0-39-0

14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 122-1, లక్ష్యం 154 పరుగులు

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. రెండో బంతికి కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. భారత్ విజయానికి 36 బంతుల్లో 32 పరుగులు కావాలి.
రోహిత్ శర్మ 48(33)
వెంకటేష్ అయ్యర్ 0(2)
టిమ్ సౌతీ 3-0-13-1
కేఎల్ రాహుల్ (సి) గ్లెన్ ఫిలిప్స్ (బి) సౌతీ (65: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)

13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 116-0, లక్ష్యం 154 పరుగులు

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 42 బంతుల్లో 38 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 65(48)
రోహిత్ శర్మ 46(30)
మిషెల్ శాంట్నర్ 4-0-33-0

12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 105-0, లక్ష్యం 154 పరుగులు

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 48 బంతుల్లో 49 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 63(46)
రోహిత్ శర్మ 37(26)
ట్రెంట్ బౌల్ట్ 3-0-31-0

11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 92-0, లక్ష్యం 154 పరుగులు

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ పూర్తయింది. భారత్ విజయానికి 54 బంతుల్లో 62 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 57(43)
రోహిత్ శర్మ 31(23)
ఆడం మిల్నే 2-0-27-0

10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 79-0, లక్ష్యం 154 పరుగులు

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 60 బంతుల్లో 75 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 45(38)
రోహిత్ శర్మ 30(22)
మిషెల్ శాంట్నర్ 3-0-22-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 63-0, లక్ష్యం 154 పరుగులు

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 66 బంతుల్లో 91 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 43(36)
రోహిత్ శర్మ 16(18)
ఇష్ సోధి 2-0-13-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 57-0, లక్ష్యం 154 పరుగులు

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 72 బంతుల్లో 97 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 39(33)
రోహిత్ శర్మ 14(16)
మిషెల్ శాంట్నర్ 2-0-6-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 52-0, లక్ష్యం 154 పరుగులు

ఇష్ సోధి వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 78 బంతుల్లో 102 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 37(30)
రోహిత్ శర్మ 12(12)
ఇష్ సోధి 1-0-7-0

పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 45-0, లక్ష్యం 154 పరుగులు

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 84 బంతుల్లో 109 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 32(26)
రోహిత్ శర్మ 10(10)
ట్రెంట్ బౌల్ట్ 2-0-18-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 35-0, లక్ష్యం 154 పరుగులు

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 90 బంతుల్లో 119 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 24(22)
రోహిత్ శర్మ 9(8)
టిమ్ సౌతీ 2-0-11-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 32-0, లక్ష్యం 154 పరుగులు

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 96 బంతుల్లో 122 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 22(19)
రోహిత్ శర్మ 8(5)
ఆడం మిల్నే 1-0-14-0

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 18-0, లక్ష్యం 154 పరుగులు

మిషెల్ శాంట్నర్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 102 బంతుల్లో 136 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 16(15)
రోహిత్ శర్మ 1(3)
మిషెల్ శాంట్నర్ 1-0-2-0

రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 16-0, లక్ష్యం 154 పరుగులు

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 108 బంతుల్లో 138 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 15(12)
రోహిత్ శర్మ 0(0)
ట్రెంట్ బౌల్ట్ 1-0-8-0

మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 8-0, లక్ష్యం 154 పరుగులు

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 114 బంతుల్లో 146 పరుగులు కావాలి.
కేఎల్ రాహుల్ 7(6)
రోహిత్ శర్మ 0(0)
టిమ్ సౌతీ 1-0-8-0

20 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు 153-6, భారత్ లక్ష్యం 154 పరుగులు

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 120 బంతుల్లో 154 పరుగులు కావాలి.
మిషెల్ శాంట్నర్ 8(9)
ఆడం మిల్నే 5(4)
దీపక్ చాహర్ 4-0-42-1

19 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 146-6

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. 
మిషెల్ శాంట్నర్ 6(6)
ఆడం మిల్నే 1(1)
హర్షల్ పటేల్ 4-0-25-2

18 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 140-6

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. చివరి బంతికి జిమ్మీ నీషం అవుటయ్యాడు.
మిషెల్ శాంట్నర్ 1(1)
ఆడం మిల్నే 0(0)
భువనేశ్వర్ కుమార్ 4-0-39-1
జిమ్మీ నీషమ్ (సి) పంత్ (బి) భువనేశ్వర్ (3: 12 బంతుల్లో)

17 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 138-5

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మూడో బంతికి గ్లెన్ ఫిలిప్స్ అవుటయ్యాడు.
జిమ్మీ నీషమ్ 2(7)
మిషెల్ శాంట్నర్ 0(0)
హర్షల్ పటేల్ 3-0-19-2
గ్లెన్ ఫిలిప్స్ (సి) (సబ్) రుతురాజ్ గైక్వాడ్ (బి) హర్షల్ పటేల్ (34: 21 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు)

16 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 128-4

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. మొదటి బంతికి టిమ్ సీఫెర్ట్ అవుటయ్యాడు.
గ్లెన్ ఫిలిప్స్ 26(17)
జిమ్మీ నీషమ్ 1(2)
రవిచంద్రన్ అశ్విన్ 4-0-19-1
టిమ్ సీఫెర్ట్ (సి) భువనేశ్వర్ (బి) అశ్విన్ (13: 15 బంతుల్లో, ఒక ఫోర్)

15 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 125-3

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.
గ్లెన్ ఫిలిప్స్ 25(16)
టిమ్ సీఫెర్ట్ 13(14)
భువనేశ్వర్ కుమార్ 3-0-37-0

14 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 114-3

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి.
గ్లెన్ ఫిలిప్స్ 17(13)
టిమ్ సీఫెర్ట్ 11(11)
దీపక్ చాహర్ 3-0-36-1

13 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 102-3

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
గ్లెన్ ఫిలిప్స్ 10(11)
టిమ్ సీఫెర్ట్ 6(7)
అక్షర్ పటేల్ 4-0-26-1

12 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 94-3

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. రెండో బంతికి డేరిల్ మిషెల్ అవుటయ్యాడు.
గ్లెన్ ఫిలిప్స్ 4(8)
టిమ్ సీఫెర్ట్ 4(4)
హర్షల్ పటేల్ 2-0-9-1
డేరిల్ మిషెల్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) హర్షల్ పటేల్ (31: 28 బంతుల్లో, మూడు ఫోర్లు)

11 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 89-2

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 
డేరిల్ మిషెల్ 31(28)
గ్లెన్ ఫిలిప్స్ 3(6)
అక్షర్ పటేల్ 3-0-17-1

10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 84-2

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 
డేరిల్ మిషెల్ 29(24)
గ్లెన్ ఫిలిప్స్ 1(4)
రవిచంద్రన్ అశ్విన్ 3-0-16-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 80-2

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి మార్క్ చాప్‌మన్ అవుటయ్యాడు.
డేరిల్ మిషెల్ 27(22)
గ్లెన్ ఫిలిప్స్ 0(0)
అక్షర్ పటేల్ 2-0-12-1
మార్క్ చాప్‌మన్ (సి) రాహుల్ (బి) గ్లెన్ ఫిలిప్స్ (21: 17 బంతుల్లో, మూడు ఫోర్లు)

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 73-1

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.
డేరిల్ మిషెల్ 25(20)
మార్క్ చాప్‌మన్ 16(13)
రవిచంద్రన్ అశ్విన్ 2-0-12-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 69-1

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.
డేరిల్ మిషెల్ 23(18)
మార్క్ చాప్‌మన్ 14(9)
హర్షల్ పటేల్ 1-0-5-0

పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 64-1

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
డేరిల్ మిషెల్ 21(15)
మార్క్ చాప్‌మన్ 11(6)
రవిచంద్రన్ అశ్విన్ 1-0-8-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 56-1

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. రెండో బంతికి మార్టిన్ గుప్టిల్ అవుటయ్యాడు.
డేరిల్ మిషెల్ 19(13)
మార్క్ చాప్‌మన్ 5(2)
దీపక్ చాహర్ 2-0-24-1
మార్టిన్ గుప్టిల్ (సి) రిషబ్ పంత్ (బి) దీపక్ చాహర్ (31: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)

నాలుగు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 42-0

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.
మార్టిన్ గుప్టిల్ 25(13)
డేరిల్ మిషెల్ 16(11)
భువనేశ్వర్ కుమార్ 2-0-26-0

మూడు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 29-0

అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి.
మార్టిన్ గుప్టిల్ 19(11)
డేరిల్ మిషెల్ 10(7)
అక్షర్ పటేల్ 1-0-5-0

రెండు ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 24-0

దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
మార్టిన్ గుప్టిల్ 15(7)
డేరిల్ మిషెల్ 9(5)
దీపక్ చాహర్ 1-0-10-0

మొదటి ఓవర్ ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 14-0

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.
మార్టిన్ గుప్టిల్ 14(6)
డేరిల్ మిషెల్ 0(0)
భువనేశ్వర్ కుమార్ 1-0-14-0

భారత్ తుదిజట్టు

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్

న్యూజిలాండ్ తుదిజట్టు

మార్టిన్ గుప్టిల్, డేరిల్ మిషెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), జేమ్స్ నీషం, మిషెల్ శాంట్నర్, ఆడం మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్న టీమిండియా రెండో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. రోహిత్ సేనను ఓడించి 1-1తో ఆశలు నిలుపుకోవాలని కివీస్‌ అనుకుంటోంది.


అస్సలు గ్యాప్ లేదు
ఈ సిరీసుకు సన్నద్ధం అయ్యేందుకు టీమ్‌ఇండియాకు కొంత సమయం దొరికింది. ముందుగానే దుబాయ్‌ నుంచి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంది. కుర్రాళ్లు, సీనియర్లు తాజాగా కనిపించారు. కెప్టెన్‌గా రోహిత్‌, కోచ్‌గా ద్రవిడ్‌ తమ ప్రస్థానం ఆరంభించడంతో కుర్రాళ్లు ఉత్సాహంగా కనిపించారు. గెలుపోటములను పక్కనపెట్టి భయం లేకుండా క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నించారు. కివీస్‌ మాత్రం అలసటతో కనిపించింది. గత ఆదివారం ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడి విరామమే లేకుండా టీమ్‌ఇండియాతో తొలి టీ20 ఆడింది.


టీమ్‌ఇండియా బలాలు
రోహిత్‌ ఓపెనింగ్‌ మెరుపులు.
సూర్యకుమార్‌ ఫామ్‌లోకి రావడం.
పంత్‌ పరిణతితో ఆడటం.
భువీ బంతిని స్వింగ్‌ చేస్తూ వికెట్లు తీయగలగడం.
అశ్విన్‌, అక్షర్ జోడీ బంతితో మాయ చేయడం.
వెంకటేశ్‌ అయ్యర్‌ రాకతో ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ దొరకడం


టీమ్‌ఇండియా బలహీనతలు
మంచు కురిస్తే మెరుగ్గా బౌలింగ్‌ చేయకపోవడం.
దీపక్‌ చాహర్‌, సిరాజ్‌ పరుగులు ఇవ్వడం.
వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ చేయకపోవడం.
కివీస్‌ బౌలర్లకు భారత బ్యాటర్ల బలహీనతలు తెలియడం.


పట్టుదలగా కివీస్‌
న్యూజిలాండ్‌ జట్టులో మార్టిన్‌ గుప్టిల్‌ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్సన్‌ స్థానంలో వచ్చిన చాప్‌మన్‌ రాణించాడు. అయితే మిడిలార్డర్‌లో కొంత తడబాటు కనిపించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ ఈ మ్యాచులో అదరగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. రచిన్‌ రవీంద్ర, జిమ్మీ నీషమ్‌ బ్యాటు ఝుళిపించాల్సిన అవసరం ఉంది. కివీస్‌ పేసర్లు తెలివిగా బంతులేస్తారు. ఇక్కడి పిచ్‌లు, భారత బ్యాటర్ల గురించి సౌథీ, బౌల్ట్‌కు బాగా తెలియడం అనకూల అంశం. టాడ్‌ ఆస్ట్లే ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఏదేమైనా రాంచీలో టాస్‌ కీలకం కానుంది.


మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ (62: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. 


న్యూజిలాండ్ తరఫున మార్క్ చాప్‌మన్ (63: 50 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (70: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.