IND vs ENG 4th Test Live: ఓవల్ టెస్టులో టీమిండియా ఘన విజయం... 2 - 1 ఆధిక్యంలో టీమిండియా... ఇంగ్లాండ్ 210 ఆలౌట్

IND vs ENG 4th Test Live: నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.

ABP Desam Last Updated: 06 Sep 2021 09:08 PM
ఓవల్ టెస్టులో టీమిండియా విజయం

ఓవల్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 157 పరుగుల తేడాతో విజయం సాధించి 2-1తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 210 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది.  

ఒక్క వికెట దూరంలో

నాలుగో టెస్టులో విజయానికి టీమిండియా ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఓవర్టన్ బౌల్డయ్యాడు.

రూట్ ఔటయ్యాడిలా

క్రిస్ వోక్స్ (18) ఔట్

ఇంగ్లాండ్ 8వ వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో వోక్స్ ... రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

శార్దూల్ ఠాకూర్ @14

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి దక్కుతుందని అనుకుంటున్నారు?

జో రూట్ ఔట్ (36)

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (36) ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో రూట్ బౌల్డ్ అయ్యాడు. 

IND vs ENG 4th Test Live: ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... మైదానంలోనే జో రూట్... 222 పరుగుల వెనుకంజలో ఇంగ్లాండ్

ఓవల్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత్‌ పట్టు బిగించింది. బ్యాట్సమెన్ ‌శ్రమకు బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆఖరి రోజు ప్రారంభంలో చాలా నెమ్మదిగా ఆడిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ క్రమంగా పట్టుకోల్పోయారు. అద్భుతమైన బాల్స్‌తో వారిని భారత్‌ బౌలర్లు బోల్తా కొట్టించారు. బుమ్రా, జడేజా రెండే వికెట్లు తీస్తే... శార్దూల్ ఠాకూర్‌ ఓ వికెట్ తీశాడు. డెవిడ్‌ మలాన్ రన్‌ఔట్‌గా పెవిలియన్ చేరాడు. భారత్‌ విజయానికి ఇంకా నాలుగు వికెట్ల దూరంలో ఉంది. 

లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 131/2

నాలుగో టెస్టు చివరి రోజు ఆటలో లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్ 8, హసీబ్ హమీద్ 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆఖరి రోజు ఆట ప్రారంభం

నాలుగో టెస్టు చివరి రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లాండ్ విజయానికి 284 పరుగులు చేయాలి

IND vs ENG 4th Test Live: పది వికెట్లా?.. 291 పరుగులా? ఆసక్తిగా మారిన ఇంగ్లండ్ ఇండియా టెస్టు మ్యాచ్

368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ చాలా కూల్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఎక్కడా తడబాటు లేకుండా ఓపెనర్స్ టీమిండియా బౌలర్లకు పరీక్ష పెట్టారు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ మంచి స్కోరునే సాధించారు. ఓపెనర్లు హసీబ్ హామీద్, రోహీ బర్న్స్ ఇద్దరు కూడా చాలా క్లాసిక్ ప్లేతో ఆకట్టుకున్నారు. వికెట్ పడకుండానే లాస్ట్ సెసన్ ముగించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ వికెట నష్టపోకుండా 77 పరుగులు చేసింది. హమీద్ 43పరుగులతో బర్న్స్ 31 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 291 పరుగులు చేయాల్సి ఉండగా... భారత్ గెలవాలంటే పది వికెట్లు తీయాలి. 

నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ వికెట్లు కోసం ఎదురుచూస్తోంది. ఓపెనర్లు బర్న్స్(18), హమీద్(17) నిలకడగా ఆడుతూ పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే 15 ఓవర్లకు 15 జట్టు స్కోరును 37 పరుగులకు చేరవేశారు. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 331 పరుగుల దూరంలో నిలిచింది.

బరిలోకి దిగిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్ (1), హమీద్(4) ఆచితూచి ఆడుతున్నారు. వీరిద్దరూ వికెట్లు కాపాడుకునేందుకు ప్రయ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా పేసర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో 5 ఓవర్లు 6 పరుగులు మాత్రమే చేశారు.

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ 466 ఆలౌట్‌..

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 466 పరుగులకు ఆలౌటైంది. రెండో సెషన్‌లో పంత్‌ (50), శార్దూల్‌ ఠాకూర్‌ (60) అద్భుత బ్యాటింగ్‌కు తోడు టెయిలెండర్లు ఉమేశ్‌ యాదవ్‌ (25), బుమ్రా (24) రాణించారు. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించడమే కాకుండా ఇంగ్లాండ్‌ ముందు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44), రవీంద్ర జడేజా (17) నాలుగో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం జోడించారు.

రెండో సెషన్ లో భారత్ పై చేయి


నాలుగో రోజు రెండో సెషన్ లో టీమ్ ఇండియా అదరగొట్టింది. 26 ఓవర్లు బ్యాటింగ్ చేసి 116 పరుగులు సాధించి 2 వికెట్లు కోల్పోయింది. పంత్(50), శార్దూల్(60) ఏడో వికెట్ శతకం భాగస్వామ్యం జోడించారు. ఇద్దరూ అర్ధశతకాలు సాధించి ఔటయ్యారు. బుమ్రా(19), ఉమేశ్(13) బ్యాటింగ్ చేస్తున్నారు. రెండో సెషన్ పూర్తయ్యేసరికి జట్టు స్కోర్ 445/8 కి చేరింది. 346 పరుగుల ఆధిక్యంలో ఉంది.

రిషభ్ ఔట్

రిషభ్ ఔట్
రిషభ్ పంత్(50) ఔటయ్యాడు. మెుయిన్ అలీ వేసిన 137.1 ఓవర్ కు సింగిల్ తీసిన అతడు 105 బంతుల్లో నాలుగు బౌండరీలతో ఈ సిరీస్ లో తొలి హాఫ్ సెంచరీ సాదించాడు. ఇక రెండో బంతికి ఉమేశ్(1) సింగిల్ తీసివ్వగా మూడో బంతికి పంత్ బౌండరీ బాదబోయి రివర్స్ క్యాచ్ లో బౌలర్ కే చిక్కాడు. 

శార్దూల్ ఔట్

ధాటిగా ఆడుతున్న శార్దూల్ ఠాకుర్(60) ఔటయ్యాడు. రూట్ వేసిన 136.5 ఓవర్ కు షాట్ ఆడి ఓవర్టన్ చేతికి చిక్కాడు. దాంతో 412 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్లోయింది.

శార్దూల్ హాఫ్ సెంచరీ

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ అందుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 65 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు శార్దూల్ ఠాకూర్.

మూడు వికెట్లు.. 59 పరుగులు

భారత్ నాలుగోరోజు తొలి సెషన్ లో మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. దాంతో భోజన విరామ సమయానికికి 329/6 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 230 పరుగులుగా నమోదైంది. క్రీజులో పంత్ (16), శార్దూల్ ఠాకూర్(11) పరుగులతో ఉన్నారు. వీరిద్దరిపైనే జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది.


 





కోహ్లీ ఔట్

కెప్టెన్ కోహ్లీ(44) అదే పొరపాటు చేశాడు. మెుయిన్ అలీ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని..ఆడబోయి స్లిప్ లో ఓవర్టన్ చేతికి చిక్కాడు. దాంతో టీమ్ ఇండియా 312 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. క్రీజులో పంత్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. వీరిద్దరిపైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.

300 దాటిన భారత్


రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్కోర్ 300 దాటింది. ఓవర్టన్ వేసిన 109వ ఓవర్ లో పంత్(4) సింగిల్ తీయడంతో భారత్ స్కోర్ 300కు చేరింది. ఆపై కోహ్లీ(44) చూడచక్కని బౌండరీ బాది మరో నాలుగు పరుగులు సాధించాడు. దాంతో భారత్ లీడ్ 205కు చేరింది.

అయ్యో.. ప్చ్.. రహానే ఔట్..


టీమ్ ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. వైస్ కెప్టెన్ అజింక్య రహానే(0) మరోసారి నిరాశపరిచాడు. కక్సిస్ వోక్స్ బౌలింగ్ ల వికెట్లముందు దొరికిపోయాడు. దాంతో భారత్ 296 పరుగుల వద్ద మరో వికెట్ నష్టపోయింది. కెప్టెన్ కోహ్లీ(40) పరుగులతో ఉన్నాడు. భారత్ ప్రస్తుతం 197 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

జడేజా ఔట్

టీమ్ ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా(16) ఔటయ్యాడు. జట్టు స్కోర్ 296 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. రివ్యూకు వెళ్లినా ఫలితం ఇంగ్లాండ్ కే అనుకూలంగా వచ్చింది. అజింక్య రహానే క్రీజులో వచ్చాడు. కోహ్లీ(40) పరుగులతో కొనసాగుతున్నాడు.

భారీ స్కోర్ లక్ష్యంగా.. 

టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరే లక్ష్యంగా బరిలోకి దిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(26), జడేజా(12) పరుగులతో కొనసాగుతున్నారు. నిన్న 270/3 స్కోరుతో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు 95 ఓవర్లకు 277/3తో నిలిచింది. ఆధిక్యం 178కి చేరింది.

నాలుగో రోజు ఆట..

నాలుగో రోజు ఆట..
టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో రోజుకు స్వాగతం. మూడోరోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా 270/3తో నిలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(22), రవీంద్ర జడేజా(9)నాటౌట్ గా నిలిచారు.

IND vs ENG 4th Test Live: మూడోరోజు టీమిండియాదే... రోహిత్ సూపర్ సెంచరీ..


ఇంగ్లండ్‌తో ఒవెల్‌లో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా పైచేయి సాధించింది. మూడో రోజు అద్భుతమైన ఆట తీరుతో ఆట ముగిసే సమయానికి 270/3స్కోరుతో 171పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజ్‌లో కోహ్లీ 22పరుగులతో రవీంద్ర జడేజా 9పరుగులతో ఉన్నారు. ఇవాళ ఆటలో రోహిత్ శర్మ 127పరుగులు చేస్తే పుజారా 61పరుగులు చేశాడు. 

రోహిత్ సిక్స్ చూడండి

హిట్ మ్యాన్ @100

సిక్స్‌తో శతకం

భారత ఓపెనర్ రోహిత్ శర్మ సిక్స్ కొట్టి 100 పరుగులు పూర్తి చేశాడు.  





1000+ పరుగులు చేసిన క్రికెటర్స్

మైదానంలో బార్మీ ఆర్మీ సందడి

Shot Of The Day

ఇంగ్లాండ్ గడ్డపై ఓపెనర్‌గా రోహిత్ 3వ హాఫ్ సెంచరీ

ఈ సిరీస్‌లో 3వ హాఫ్ సెంచరీ

ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ శతకం

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ శతకం సాధించాడు.  రోహిత్ శర్మ 50 చేసేందుకు 145 బంతులు తీసుకున్నాడు.  

కేఎల్ రాహుల్ ఔటయ్యాడిలా

తొలి సెషన్లో 65 పరుగులు

లంచ్ విరామానికి భారత్ 108/1

నాలుగో టెస్టు మూడో రోజు లంచ్ విరామానికి భారత్ 108/1 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత 9 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. 

కేఎల్ రాహుల్ 46 ఔట్

రెండో ఇన్నింగ్స్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేెఎల్ రాహుల్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 

మైఖెల్ వాన్ ఫన్నీ ట్వీట్

కోహ్లీ కాదు కేఎల్ రాహుల్

మళ్లీ బతికిపోయాడు

ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ పై

రివ్యూలో నాటౌట్

మూడోసారి

48 పరుగుల వెనుకంజలో భారత్ 

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 48 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ ఏమీ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. 

రోహిత్ - రాహుల్ 50 భాగస్వామ్యం

నాలుగో టెస్టు మూడో రోజు ఆటలో భారత ఓపెనర్లు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఓవర్ నైట్ స్కోరు 43/0తో భారత్ మూడో రోజు ఆట ప్రారంభించింది.  

ఓపెనర్ గా రోహిత్ @ 11K

రోహిత్ శర్మ ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 11వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.  





WELCOME

Background

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభమైంది. విజయానికి ఇంగ్లాండ్ 290 పరుగుల దూరంలో ఉంది. వీలైనంత త్వరగా వికెట్లు తీసి మ్యాచ్‌ను చేజెక్కించుకోవాలని భారత్ చూస్తోంది. మరి, ఏం జరుగుతుందో చూద్దాం.  


India XI: Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravindra Jadeja, Shardul Thakur, Umesh Yadav, Jasprit Bumrah, Mohammed Siraj


England XI: Rory Burns, Haseeb Hameed, Dawid Malan, Joe Root (c), Ollie Pope, Jonny Bairstow (wk), Moeen Ali, Chris Woakes, Craig Overton, Ollie Robinson, James Anderson

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.