IND vs ENG 4th Test Live: ముగిసిన రెండో రోజు ఆట... భారత్ 2nd ఇన్నింగ్స్ 43/0 ...56 పరుగుల వెనుకంజలో భారత్
IND vs ENG 4th Test Score Live: నాలుగో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అంతకుముందు ఇంగ్లాండ్ 290 పరుగల వద్ద ఆలౌటైంది.
ABP DesamLast Updated: 03 Sep 2021 11:03 PM
Background
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లాండ్ 53/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ప్రారంభించింది. 290 పరుగుల జట్టు స్కోరు వద్ద ఇంగ్లాండ్ ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 99 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది....More
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లాండ్ 53/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ప్రారంభించింది. 290 పరుగుల జట్టు స్కోరు వద్ద ఇంగ్లాండ్ ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 99 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. India XI: Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravindra Jadeja, Shardul Thakur, Umesh Yadav, Jasprit Bumrah, Mohammed SirajEngland XI: Rory Burns, Haseeb Hameed, Dawid Malan, Joe Root (c), Ollie Pope, Jonny Bairstow (wk), Moeen Ali, Chris Woakes, Craig Overton, Ollie Robinson, James Anderson
రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. 14 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ ఏమీ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.
ఎట్టకేలకు భారత్ ఓలీ పోప్ - మొయిన్ అలీ భాగస్వామ్యానికి తెరపడింది. 68వ ఓవర్లో జడేజా బంతిని ఎదుర్కొన్న మొయిన్ అలీ (35) ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్‌కి 71 పరుగులు జోడించారు.
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వైస్ కెప్టెన్ మొయిన్ అలీతో కలిసి ఓలీ పోప్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించగలిగింది.
నాలుగో టెస్టు రెండో రోజు లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఇంకా 52 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో పోప్ (38), బెయిర్ స్టో (34) ఉన్నారు.
రెండో రోజు ఆటలో ఉమేశ్ యాదవ్ జోరుగా కనిపిస్తున్నాడు. ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన బంతిని ఎదుర్కొన్న మలన్ (31) రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.