టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న ఓవల్ టెస్ట్ 4వ రోజు ఆటలో 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు.










తన 210వ ఇన్నింగ్స్ లో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ ల రికార్డ్ ను మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు ఈ రన్ మిషన్. 



  1. ఇది కోహ్లీ కెరీర్ లో 128వ మ్యాచ్. 34 సెంచరీలు, 35 అర్ధ శతకాలతో, 52 సగటుతో ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 10వేల పరుగులు పూర్తి చేశాడు కోహ్లీ.

  2. ఇండియన్ మాజీ క్రికెటర్ అజయ్ శర్మ 160 ఇన్నింగ్స్ లలో 10వేల పరుగులు పూర్తి చేశాడు. అయితే కోహ్లీ మరో 50 మ్యాచ్ ల తర్వాత ఈ ఘనత సాధించాడు.

  3. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ 201 ఇన్నింగ్స్ లలో 10 వేల పరుగులు పూర్తి చేయగా విజయ్ మర్చెంట్ కి ఈ మైలురాయిని చేరుకోవడానికి 171 ఇన్నింగ్స్ లు పట్టింది.

  4. వీవీ ఎస్ లక్ష్మణ్ 194 ఇన్నింగ్స్ లలో, సచిన్ 195 ఇన్నింగ్స్ లలో, ద్రవిడ్ 208 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత అందుకున్నారు.


విరాట్ కోహ్లీ 2019 నుంచి ఒక్క శతకం కూడా చేయలేదు. నేటి మ్యాచ్ లో కూడా 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొయిన్ అలీ బౌలింగ్ లో ఔటయ్యాడు.