IND vs ENG 4th Test Live: ముగిసిన తొలి రోజు ఆట... ఇంగ్లాండ్ 53/3... భారత్ తొలి ఇన్నింగ్స్ 191 ఆలౌట్

భారత్ X ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. లండన్‌లోని ఓవల్ వేదికగా ఈ టెస్టు జరుగుతోంది.

Continues below advertisement

LIVE

Background

భారత్ X ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. లండన్‌లోని ఓవల్ వేదికగా ఈ టెస్టు జరుగుతోంది.  ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే మూడు టెస్టులు జరిగాయి. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అయ్యింది. రెండో టెస్టులో భారత్ విజయం సాధించగా... మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో నాలుగో టెస్టు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

India XI:  Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), R Jadeja, Ravichandran Ashwin, Mohammed Siraj, Mohammed Shami, Jasprit Bumrah

England XI: Rory Burns, Haseeb Hameed, Dawid Malan, Joe Root (c), Jonny Bairstow, Ollie Pope, Moeen Ali, Chris Woakes, Sam Curran, Ollie Robinson, James Anderson

Continues below advertisement
23:01 PM (IST)  •  02 Sep 2021

ముగిసిన తొలి రోజు ఆట .... ఇంగ్లాండ్ 53/3

భారత్ X ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. 

22:55 PM (IST)  •  02 Sep 2021

జో రూట్ 21 ఔట్

వరుస సెంచరీలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ నాలుగో టెస్టులో 21 పరుగులకే ఔటయ్యాడు. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో రూట్ బౌల్డయ్యాడు. 

22:37 PM (IST)  •  02 Sep 2021

ENG 45/2

12 ఓవర్లకు ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. 

22:36 PM (IST)  •  02 Sep 2021

ఆచితూచి ఆడుతోన్న రూట్, మలన్

ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోడంతో ఇంగ్లాండ్ ఆచితూచి ఆడుతోంది. రూట్, మలన్ జాగ్రత్తగా ఆడుతూ వికెట్ పడకుండా ఆడుతున్నారు. 

22:06 PM (IST)  •  02 Sep 2021

ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

భారత బౌలర్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 





22:04 PM (IST)  •  02 Sep 2021

భారత్ 191 ఆలౌట్

నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 191 పరుగులకు భారత్ ఆలౌటైంది. 


 





20:21 PM (IST)  •  02 Sep 2021

టీ విరామానికి భారత్ 122/6


20:09 PM (IST)  •  02 Sep 2021

రహానె (14) ఔట్

భారత్ మరో వికెట్ కోల్పోయింది. ఓవర్టన్ బౌలింగ్లో రహానె (14)... మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చాడు. 

19:45 PM (IST)  •  02 Sep 2021

కోహ్లీ ఔటయ్యాడిలా


19:44 PM (IST)  •  02 Sep 2021

5 సార్లు వికెట్ కీపర్‌కే క్యాచ్ ఇచ్చాడు


19:26 PM (IST)  •  02 Sep 2021

టెస్టుల్లో 27వ అర్ధ శతకం


19:25 PM (IST)  •  02 Sep 2021

కోహ్లీ 50

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో కోహ్లీ అర్ధ శతకం సాధించాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ 50 పరుగులు చేయడం వరుసగా ఇది రెండో సారి.  

19:17 PM (IST)  •  02 Sep 2021

అర్ధ శతకానికి చేరువలో కోహ్లీ

భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నాలుగో టెస్టులో అర్ధ శతకానికి చేరువయ్యాడు. 39 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 45, రహానె 5 పరుగులతో ఉన్నారు. 

17:49 PM (IST)  •  02 Sep 2021

లంచ్ విరామానికి భారత్ 54/3

నాలుగో టెస్టు మొదటి రోజు ఆటలో లంచ్ విరామానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. 

17:10 PM (IST)  •  02 Sep 2021

3వ వికెట్ కోల్పోయిన భారత్

పుజారా (4) రూపంలో భారత్ 3వ వికెట్ కోల్పోయింది. భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. 

17:05 PM (IST)  •  02 Sep 2021

Fastest to 23000 international runs (Inns):

490 Virat Kohli*
522 Sachin Tendulkar
544 Ricky Ponting
551 Jacques Kallis
568 Kumar Sangakkara
576 Rahul Dravid
645 M Jayawardene

16:47 PM (IST)  •  02 Sep 2021

5 మేడిన్ ఓవర్లు... 2 వికెట్లు


16:43 PM (IST)  •  02 Sep 2021

ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన భారత్

నాలుగో టెస్టులో భారత్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (11) ఔటవ్వగా... కేఎల్ రాహుల్ (17) రాబిన్ సన్ బౌలింగ్లో LBWగా వెనుదిరిగాడు.

16:40 PM (IST)  •  02 Sep 2021

వరుసగా 6 మేడిన్ ఓవర్లు

భారత్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ వరుసగా 6 మేడిన్ ఓవర్లు వేసింది. 8వ ఓవర్ నుంచి 14వ ఓవర్ వరకు భారత్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది.  

16:29 PM (IST)  •  02 Sep 2021

రోహిత్ శర్మ ఔటయ్యాడిలా


16:28 PM (IST)  •  02 Sep 2021

తొలి వికెట్ కోల్పోయిన భారత్

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓక్స్ బౌలింగ్లో రోహిత్ శర్మ (11) బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

16:04 PM (IST)  •  02 Sep 2021

7 ఓవర్లకు టీమిండియా 28/0

7 ఓవర్లకు టీమిండియా 28/0 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 17, రోహిత్ శర్మ 11 పరుగులతో ఉన్నారు. 

15:42 PM (IST)  •  02 Sep 2021

Most Test matches at home

95 James Anderson*
94 Sachin Tendulkar
92 Ricky Ponting
89 Alastair Cook
89 Steve Waugh
88 Jacques Kallis

15:36 PM (IST)  •  02 Sep 2021

తొలి ఓవర్లో ఒక పరుగు

టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. అండర్సన్ వేసిన తొలి ఓవర్లో భారత్ ఒక్క పరుగు సాధించింది.  

15:35 PM (IST)  •  02 Sep 2021

ఓవల్‌లో 13 ఆడితే భారత్ ఒకటే నెగ్గింది

ఓవల్ మైదానంలో భారత్‌కిది 14వ మ్యాచ్. అంతకుముందు 13 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ ఒకే మ్యాచ్‌(1971) నెగ్గింది. ఏడు మ్యాచ్‌లు డ్రా చేసుకుని, అయిదింట్లో ఓడింది.

15:15 PM (IST)  •  02 Sep 2021

బట్లర్ స్థానంలో ఓలీ పోప్

జాస్ బట్లర్ స్థానంలో ఓలీ పోప్, సామ్ కరన్ స్థానంలో క్రిస్ ఓక్స్ ఇంగ్లాండ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. 

15:14 PM (IST)  •  02 Sep 2021

భారత్ చేసిన రెండు మార్పులు

ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి స్థానంలో ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. 

15:10 PM (IST)  •  02 Sep 2021

ఇంగ్లాండ్ జట్టు


15:08 PM (IST)  •  02 Sep 2021

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది

నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కోహ్లీ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  

15:07 PM (IST)  •  02 Sep 2021

నాలుగో టెస్టుకి టీమిండియా జట్టిదే


Sponsored Links by Taboola