IND vs ENG Cricket Score LIVE: ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో కోహ్లీ సేన ఓటమి

IND vs ENG 3rd Test Score LIVE Updates: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ABP Desam Last Updated: 28 Aug 2021 05:14 PM

Background

భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు టెయిలెండర్ల వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. దీంతో ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ తొలి...More

IND vs ENG Cricket Score LIVE: బ్యాట్లెత్తేశారు... మ్యాచ్‌ వదిలేశారు...

ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ అత్యంత ఘోరమైనా విఫల్యంతో ఇన్నింగ్స్ ఓటమి తన ఖాతాలో వేసుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ సేనను ఆండ్రసన్, రాబిన్‌సన్ కోలుకోలేని దెబ్బకొట్టారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ ఇప్పుడు 1-1తో సమమైంది.