Just In





IND vs ENG Cricket Score LIVE: ముగిసిన రెండో రోజు ఆట... ENG 423/8... 345 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్
INDIA Vs ENGLAND 3rd Test: మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆతిథ్య ఇంగ్లాండ్ 345 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
LIVE

Background
భారత్ X ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో భారత్ 78 పరుగులకే ఆలౌటవ్వగా... ఇంగ్లాండ్ వికెట్ ఏమీ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో తొలి రోజే ఇంగ్లాండ్ 42 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. మరి రెండో రోజు కోహ్లీ సేన ఏమైనా అద్భుతం చేస్తుందేమో చూడాలి.
345 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్
మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 345 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.
సిరాజ్ ఖాతాలో సామ్ కరన్ వికెట్
సామ్ కరన్ రూపంలో ఇంగ్లాండ్ 8వ వికెట్ కోల్పోయింది. సిరాజ్ వేసిన బంతిని ఎదుర్కొన్న కరన్ (15) సబ్ స్టిట్యూట్ యమాంక్ అగర్వాల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Highest 1st innings lead conceded by India under Kohli's captaincy
290 v Eng Leeds 2021 *
289 v Eng Lord's 2018
241 v Eng Chennai 2020/21
183 v NZ Wellington 2019/20
జో రూట్, మొయిన్ అలీ ఔట్
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ (121) బుమ్రా బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత 119వ ఓవర్లో జడేజా బౌలింగ్లో మొయిన్ అలీ (8) ఔటయ్యాడు.
300 దాటిన ఇంగ్లాండ్ ఆధిక్యం
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పై 300కు పైగా పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది.
బట్లర్ ఔట్
ఇంగ్లాండ్ 5వ వికెట్ కోల్పోయింది. షమి బౌలింగ్లో బట్లర్(7)... ఇషాంత్ శర్మకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Most Test centuries among active cricketers:
27 - Steve Smith
27 - Virat Kohli
24 - Kane Williamson
24 - David Warner
23 - Joe Root
జో రూట్ జోరు
Joe Root is the first player to score hundreds in three successive Tests twice in the same calendar year.
జో రూట్ శతకం
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ శతకం సాధించాడు.
రూట్, మలన్ హాఫ్ సెంచరీ
జో రూట్, డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం దిశగా స్కోరు సాధిస్తోంది.
లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 182/2
మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 104 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.
జడేజాకి చిక్కిన మరో ఓపెనర్
మరో ఓపెనర్ హమీద్ (68) ఔటయ్యాడు. జడేజా బౌలింగ్లో హమీద్ కూడా బౌల్డయ్యాడు.
బర్న్స్ ఔటయ్యాడిలా
బర్న్స్ ఔట్
హమ్మయ్య ఎట్టకేలకు టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. ఓపెనర్ బర్న్స్ (61) షమి బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 135 పరుగుల ఓపెనర్ల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ రోజు బర్న్స్ పుట్టిన రోజు.
57 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్
మూడో టెస్టులో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 57 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.