భారత్ X ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానంలో జరగనుంది. బుధవారం (ఆగస్టు 25) నాడు టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో లార్డ్స్ నుంచి భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇప్పటికే లీడ్స్ చేరుకున్నారు. అనంతరం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ఫొటోలను BCCI ట్విటర్ ద్వారా పంచుకుంది. 






రిషబ్ పంత్, జడేజా, అశ్విన్, రోహిత్ శర్మతో పాటు తదితరులు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఇరు జట్లు మధ్య తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 






మూడో టెస్టులోనూ విజయం సాధించి 1-0 ఆధిక్యాన్ని 2-0గా మార్చుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోపక్క మూడో టెస్టులో గెలిచి టీమిండియా ఆధిక్యాన్ని తగ్గించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఇంగ్లాండ్ సారథి జో రూట్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మూడో టెస్టు కోసం ఇంగ్లాండ్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. రెండో టెస్టు ఆడిన జట్టులో పలు మార్పులు చేసి మూడో టెస్టుకు సిద్ధమైంది. 


Also Read: Arshi Khan Engagement: క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న నటి... కాబోయేవాడు భారతీయడై ఉంటాడు


మూడో టెస్టు కోసం కోహ్లీ కూడా జట్టులో మార్పులు చేయనున్నట్లు సమాచారం. జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ వస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన శార్దూల్ ఠాకూర్ ఈ టెస్టులో అందుబాటులో ఉన్నాడు. కాబట్టి జట్టులో అయితే మార్పులు ఖాయంగా కనిపిస్తుంది. మరి, ఎవరి స్థానంలో ఎవరు తుది జట్టులో స్థానం దక్కించుకుంటారో చూడాలి. 


Also Read: Paralympics 2020 India Full Schedule: రేపటి నుంచే టోక్యో పారాలింపిక్స్... భారత్ నుంచి 54 మంది అథ్లెట్లు... షెడ్యూల్ ఇదే