IND vs AFG, T20 LIVE: 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 144-7, 66 పరుగులతో భారత్ విజయం

T20 WC 2021, Match 33, IND vs AFG: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నేటి సూపర్ 12 మ్యాచ్‌లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి.

ABP Desam Last Updated: 03 Nov 2021 11:13 PM
20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 144-7, 66 పరుగులతో భారత్ విజయం

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. భారత్ 66 పరుగులతో విజయం సాధించింది.
కరీం జనత్ 42(22)
షరాఫుద్దీన్ 2(3) 
హార్దిక్ పాండ్యా 2-0-23-0

19 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 130-7, లక్ష్యం 211 పరుగులు

షమీ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. నబీ, రషీద్ ఖాన్ అవుటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 6 బంతుల్లో 81 పరుగులు కావాలి.
కరీం జనత్ 30(18)
షరాఫుద్దీన్ 0(1) 
షమీ 4-0-32-3
నబీ (సి) జడేజా (బి) షమీ (35: 32 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)
రషీద్ ఖాన్ (సి) పాండ్యా (బి) షమీ (0: 1 బంతి)

18 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 125-5, లక్ష్యం 211 పరుగులు

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 12 బంతుల్లో 86 పరుగులు కావాలి.
కరీం జనత్ 26(15)
నబీ 35(31)
శార్దూల్ ఠాకూర్ 3-0-31-0

17 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 109-5, లక్ష్యం 211 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 18 బంతుల్లో 102 పరుగులు కావాలి.
కరీం జనత్ 23(13)
నబీ 22(27)
బుమ్రా 4-0-25-1

16 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 98-5, లక్ష్యం 211 పరుగులు

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 24 బంతుల్లో 113 పరుగులు కావాలి.
కరీం జనత్ 22(12)
నబీ 18(23)
శార్దూల్ ఠాకూర్ 2-0-15-0

15 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 88-5, లక్ష్యం 211 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 30 బంతుల్లో 123 పరుగులు కావాలి.
కరీం జనత్ 10(8)
నబీ 16(20)
బుమ్రా 3-0-14-1

14 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 85-5, లక్ష్యం 211 పరుగులు

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 36 బంతుల్లో 126 పరుగులు కావాలి.
కరీం జనత్ 9(6)
నబీ 14(16)
రవిచంద్రన్ అశ్విన్ 4-0-14-2

13 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 80-5, లక్ష్యం 211 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 42 బంతుల్లో 131 పరుగులు కావాలి.
కరీం జనత్ 7(4)
నబీ 11(12)
రవీంద్ర జడేజా 3-0-19-1

12 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 70-5, లక్ష్యం 211 పరుగులు

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఐదో బంతికి జద్రాన్ అవుటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 48 బంతుల్లో 141 పరుగులు కావాలి.
కరీం జనత్ 1(1)
నబీ 7(9)
రవిచంద్రన్ అశ్విన్ 3-0-9-2
జద్రాన్ (బి) అశ్విన్ (11: 13 బంతుల్లో, ఒక సిక్సర్)

11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 66-4, లక్ష్యం 211 పరుగులు

శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 54 బంతుల్లో 145 పరుగులు కావాలి.
జద్రాన్ 11(12)
నబీ 4(5)
శార్దూల్ ఠాకూర్ 1-0-5-0

10 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 61-4, లక్ష్యం 211 పరుగులు

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. గుల్బాదిన్ నయీబ్ అవుటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 60 బంతుల్లో 150 పరుగులు కావాలి.
జద్రాన్ 9(10)
నబీ 1(1)
రవిచంద్రన్ అశ్విన్ 2-0-5-1
గుల్బాదిన్ నయీబ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ (18: 20 బంతుల్లో, మూడు ఫోర్లు)

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 58-3, లక్ష్యం 211 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 66 బంతుల్లో 153 పరుగులు కావాలి.
జద్రాన్ 8(7)
గుల్బాదిన్ నయీబ్ 18(18)
రవీంద్ర జడేజా 2-0-9-1

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 51-3, లక్ష్యం 211 పరుగులు

రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 72 బంతుల్లో 160 పరుగులు కావాలి.
జద్రాన్ 1(4)
గుల్బాదిన్ నయీబ్ 18(15)
రవిచంద్రన్ అశ్విన్ 1-0-2-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 49-3, లక్ష్యం 211 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. ఐదో బంతికి గుర్బాజ్ అవుటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 78 బంతుల్లో 162 పరుగులు కావాలి.
జద్రాన్ 0(0)
గుల్బాదిన్ నయీబ్ 17(13)
రవీంద్ర జడేజా 1-0-2-1
రహ్మనుల్లా గుర్బాజ్ (సి) పాండ్యా (బి) జడేజా (19: 10 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు)

పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 47-2, లక్ష్యం 211 పరుగులు

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 84 బంతుల్లో 164 పరుగులు కావాలి.
రహ్మనుల్లా గుర్బాజ్ 19(8)
గుల్బాదిన్ నయీబ్ 15(9)
హార్దిక్ పాండ్యా 1-0-9-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 38-2, లక్ష్యం 211 పరుగులు

షమీ వేసిన ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 90 బంతుల్లో 173 పరుగులు కావాలి.
రహ్మనుల్లా గుర్బాజ్ 19(7)
గుల్బాదిన్ నయీబ్ 6(4)
షమీ 3-0-27-1

నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 17-2, లక్ష్యం 211 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. మొదటి బంతికి జజాయ్ అవుటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 96 బంతుల్లో 194 పరుగులు కావాలి.
రహ్మనుల్లా గుర్బాజ్ 3(4)
గుల్బాదిన్ నయీబ్ 1(1)
బుమ్రా 2-0-11-1
హజ్రతుల్లా జజాయ్ (సి) ఠాకూర్ (బి) బుమ్రా (13: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)

మూడు ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 13-1, లక్ష్యం 211 పరుగులు

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. చివరి బంతికి షెహజాద్ అవుటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 102 బంతుల్లో 198 పరుగులు కావాలి.
రహ్మనుల్లా గుర్బాజ్ 0(0)
హజ్రతుల్లా జజాయ్ 12(9)
మహ్మద్ షమీ 2-0-6-1
మహ్మద్ షెహజాద్ (సి) అశ్విన్ (బి) షమీ 0(3)

రెండు ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 12-0, ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యం 211 పరుగులు

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 108 బంతుల్లో 199 పరుగులు కావాలి.
మహ్మద్ షెహజాద్ 0(3)
హజ్రతుల్లా జజాయ్ 12(9)
జస్‌ప్రీత్ బుమ్రా 1-0-7-0

మొదటి ఓవర్ ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోరు 5-0, లక్ష్యం 211 పరుగులు

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 114 బంతుల్లో 206 పరుగులు కావాలి.
మహ్మద్ షెహజాద్ 0(1)
హజ్రతుల్లా జజాయ్ 5(5)
మహ్మద్ షమీ 1-0-5-0

20 ఓవర్లలో భారత్ స్కోరు 210-2, ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యం 211 పరుగులు

హమీద్ హసన్ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 120 బంతుల్లో 211 పరుగులు కావాలి.
హార్దిక్ పాండ్యా 35(13)
రిషబ్ పంత్ 27(13)
హమీద్ హసన్ 4-0-34-0

19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 194-2

నవీన్ ఉల్ హక్ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా రెండు సిక్సర్లు కొట్టాడు.
హార్దిక్ పాండ్యా 31(11)
రిషబ్ పంత్ 17(9)
నవీన్ ఉల్ హక్ 4-0-59-0

18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 175-2

హమీద్ హసన్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా మూడు ఫోర్లు కొట్టాడు.
హార్దిక్ పాండ్యా 14(6)
రిషబ్ పంత్ 16(8)
హమీద్ హసన్ 3-0-20-0

రాహుల్ అవుట్.. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 160-2

గుల్బాదిన్ నయీబ్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. మూడో బంతికి రాహుల్ అవుటయ్యాడు. చివరి రెండు బంతులకు పంత్ సిక్సర్లు సాధించాడు.
హార్దిక్ పాండ్యా 1(1)
రిషబ్ పంత్ 15(7)
గుల్బాదిన్ నయీబ్ 4-0-39-1
కేఎల్ రాహుల్ (బి) గుల్బాదిన్ నయీబ్ (69: 48 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)

16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 145-1

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి.
కేఎల్ రాహుల్ 68(46)
రిషబ్ పంత్ 2(4)
రషీద్ ఖాన్ 4-0-36-0

15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 142-1

కరీం జనత్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి రోహిత్ అవుటయ్యాడు.
కేఎల్ రాహుల్ 66(43)
రిషబ్ పంత్ 1(1)
కరీం జనత్ 1-0-7-1
రోహిత్ శర్మ (సి) నబీ (బి) కరీం జనత్ (74: 46 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు)

14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 135-0

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతులకు రోహిత్ సిక్సర్లు సాధించాడు.
రోహిత్ శర్మ 74(45)
కేఎల్ రాహుల్ 60(40)
రషీద్ ఖాన్ 3-0-33-0

13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 119-0

గుల్బాదిన్ నయీబ్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. రెండో బంతికి రాహుల్ బౌండరీ సాధించాడు. ఆ బౌండరీతో రాహుల్ అర్థసెంచరీ పూర్తయింది. చివరి బంతికి రాహుల్ మరో బౌండరీ సాధించాడు.
రోహిత్ శర్మ 60(41)
కేఎల్ రాహుల్ 58(38)
గుల్బాదిన్ నయీబ్ 3-0-24-0

12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 107-0

నవీన్ ఉల్ హక్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. రెండో బంతికి రోహిత్ బౌండరీ సాధించాడు. ఆ బౌండరీతో రోహిత్ అర్థసెంచరీ పూర్తయింది. నాలుగో బంతికి రాహుల్ సిక్సర్ కొట్టాడు. చివరి బంతికి రోహిత్ మరో బౌండరీ సాధించాడు.
రోహిత్ శర్మ 58(39)
కేఎల్ రాహుల్ 48(34)
నవీన్ ఉల్ హక్ 3-0-40-0

11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 91-0

గుల్బాదిన్ నయీబ్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. మూడో బంతికి రోహిత్ బౌండరీ సాధించాడు.
రోహిత్ శర్మ 49(35)
కేఎల్ రాహుల్ 41(32)
గుల్బాదిన్ నయీబ్ 2-0-12-0

10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 85-0

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి రాహుల్ బౌండరీ సాధించాడు.
రోహిత్ శర్మ 44(32)
కేఎల్ రాహుల్ 40(29)
షరాఫుద్దీన్ అష్రాఫ్ 2-0-17-0

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 74-0

షరాఫుద్దీన్ అష్రాఫ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 40(30)
కేఎల్ రాహుల్ 33(25)
షరాఫుద్దీన్ అష్రాఫ్ 2-0-25-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 65-0

రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 38(28)
కేఎల్ రాహుల్ 26(21)
రషీద్ ఖాన్ 1-0-6-0

ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 59-0

గుల్బాదిన్ నయీబ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 36(26)
కేఎల్ రాహుల్ 22(17)
గుల్బాదిన్ నయీబ్ 1-0-6-0

ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 53-0

హమీద్ హసన్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది.
రోహిత్ శర్మ 34(24)
కేఎల్ రాహుల్ 18(13)
హమీద్ హసన్ 2-0-6-0

ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 52-0

నవీన్ ఉల్ హక్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు.
రోహిత్ శర్మ 34(19)
కేఎల్ రాహుల్ 17(12)
నవీన్ ఉల్ హక్ 2-0-24-0

నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 35-0

హమీద్ హసన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.
రోహిత్ శర్మ 19(13)
కేఎల్ రాహుల్ 16(11)
హమీద్ హసన్ 1-0-5-0

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 30-0

నవీన్ ఉల్ హక్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి రోహిత్ శర్మ బౌండరీ సాధించాడు.
రోహిత్ శర్మ 16(9)
కేఎల్ రాహుల్ 14(9)
నవీన్ ఉల్ హక్ 1-0-7-0

రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 23-0

షరాఫుద్దీన్ అష్రాఫ్ వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. రెండో బంతికి రోహిత్ శర్మ బౌండరీ సాధించగా, ఐదు, ఆరు బంతులకు రాహుల్ సిక్సర్, ఫోర్ కొట్టాడు.
రోహిత్ శర్మ 10(4)
కేఎల్ రాహుల్ 13(8)
షరాఫుద్దీన్ అష్రాఫ్ 1-0-16-0

మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 7-0

మహ్మద్ నబీ వేసిన మొదటి ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ బౌండరీ సాధించాడు.
రోహిత్ శర్మ 5(2)
కేఎల్ రాహుల్ 2(4)
మహ్మద్ నబీ 1-0-7-0

భారత్ తుదిజట్టు

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా

ఆఫ్ఘనిస్తాన్ తుదిజట్టు

హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షెహజాద్(వికెట్ కీపర్), రహమానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), గుల్బాదిన్ నయీబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్ ఉల్ హక్, హమీద్ హసన్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్

టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌12లో టీమ్‌ఇండియా ప్రమాదకర అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు వరుస ఓటములతో దిగాలు పడిన కోహ్లీసేనకు ఈ పోరులో విజయం అత్యంత కీలకం. అఫ్గానిస్థాన్‌, భారత్‌ ఇప్పటి వరకు రెండుసార్లే టీ20ల్లో తలపడ్డాయి. రెండుసార్లూ టీమ్‌ఇండియాదే విజయం. ఇక ఈ ప్రపంచకప్‌లో కోహ్లీసేన ఫామ్‌ ఏమంత బాగాలేదు. టాస్‌ గెలిచి మొదట ఫీల్డింగ్‌ చేసిన పాక్‌, న్యూజిలాండ్‌ విజయాలు అందుకున్నాయి. అఫ్గాన్‌ మాత్రం మూడు మ్యాచులాడి రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది.


ఈ మ్యాచ్‌ అబుదాబిలో జరగనుంది. ఇక్కడ కూడా టాసే కీలకం. ఈ వేదికలో పది మ్యాచులు జరిగితే ఏడింట్లో ఛేజ్‌ చేసిన జట్లే గెలవడం గమనార్హం. మిగతా మూడు జట్లు తొలుత బ్యాటింగ్‌ చేసినా గెలవడానికి కారణం అవి నమీబియా, ఐర్లాండ్‌పై ఆడటమే! అబుదాబి పిచ్‌ కూడా దుబాయ్‌ తరహాలోనే ప్రవర్తిస్తోంది. మొదట బ్యాటింగ్‌కు అస్సలు అనుకూలించడం లేదు. మంగళవారం పాక్‌ను తొలి పది ఓవర్ల వరకు నమీబియా బంతితో వణికించింది!


టీమ్‌ఇండియాఓటమి భారంతో కనిపిస్తోంది. ఆటగాళ్లలో ఉత్తేజం, పట్టుదల కనిపించడం లేదు. బహుశా ఈ మ్యాచులో రోహిత్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తారు. ఇషాన్‌ రావడంతో మరి రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తారా అన్న సందేహాలూ ఉన్నాయి. సూర్యకుమార్‌ యాదవ్ ఇంకా కోలుకోలేదు. హార్దిక్‌ పాండ్య భారంగా మారుతున్నాడు. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ రాణించాలి. వరుణ్‌ చక్రవర్తి ఇప్పటి వరకు తన మ్యాజిక్‌ చూపించలేదు. బహుశా అతడి స్థానంలో రాహుల్‌ చాహర్‌ను తీసుకోవచ్చు. రవీంద్ర జడేజా సైతం బంతితో రాణించడం లేదు. జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే సత్తా చాటుతున్నాడు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, శార్దూల్‌ ఠాకూర్ రాణించాల్సిన అవసరం ఉంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


అఫ్గాన్‌కు యూఏఈలో తిరుగులేని రికార్డు ఉంది. మొన్న పాక్‌ చేతిలో తప్ప ఎన్నడూ అక్కడ ఓటమి చవిచూడలేదు. లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ అత్యంత కీలకం అవుతాడు. అయితే రషీద్‌ బౌలింగ్‌ను ఇషాన్‌ చితకబాదగలడు. మహ్మద్‌ నబీ కెప్టెన్‌గా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. జజాయ్‌, షెహజాద్‌ బ్యాటింగ్‌ చేయడం వారికి అత్యవసరం. అఫ్గాన్‌లో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లే ఉండటంతో ఏడో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగలరు. ఒకవేళ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంటే మాత్రం టీమ్‌ఇండియాకు అగ్ని పరీక్ష పెట్టగలరు! ఏదేమైనా అఫ్గాన్‌ను తక్కువగా తీసుకుంటే కోహ్లీసేనకు ఇబ్బంది తప్పదు!

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.