ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అత్యంత కఠినమైన ప్రత్యర్థితో తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (10), షెఫాలీ వర్మ (12) విఫలమైన తరుణంలో యస్తికా భాటియా (59; 83 బంతుల్లో 6x4), మిథాలీ రాజ్ (68; 96 బంతుల్లో 4x4, 1x6), హర్మన్ ప్రీత్ కౌర్ (57 నాటౌట్; 47 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలతో గట్టెక్కించారు. ఆఖర్లో పూజా వస్త్రాకర్ (34; 28 బంతుల్లో 1x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.
టీమ్‌ఇండియా మంచి స్కోరు చేసినప్పటికీ ఆస్ట్రేలియా భయపడటం లేదు. సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హేలీ (50; 49 బంతుల్లో) హాఫ్ సెంచరీ కొట్టేసింది. రేచెల్ హెయిన్స్ (34) హాఫ్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. భారత బౌలర్లు ఇప్పటి వరకు వికెట్ తీయలేదు. వీరిద్దరూ ఇలాగే ఆడితే మిథాలీ సేనకు విజయం దక్కడం డౌటే! ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఆసీస్ ఓపెనర్లే టీమ్‌ఇండియాను ఓడించారు.