ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు జట్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. మంగళవారం విడుదల చేసిన టెస్టు జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి టీమిండియా ఈ ఘనత సాధించింది.


ఇప్పటికే భారత్ టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్‌గా ఉంది. టెస్టుల్లో కూడా అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే వన్డేల్లో కూడా నంబర్ వన్ స్థానానికి చేరనుంది. హైదరాబాద్‌లో ఈ తొలి వన్డే జరగనుంది.


ప్రస్తుతం భారత్ 115 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 111 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో, 100 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, 85 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి. వెస్టిండీస్ 79 పాయింట్లతో ఆరో స్థానంలో, 77 పాయింట్లతో పాకిస్థాన్ ఏడో స్థానంలో, 71 పాయింట్లతో శ్రీలంక ఎనిమిదో స్థానంలో, 46 పాయింట్లతో బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో, 25 రేటింగ్ పాయింట్లతో జింబాబ్వే 10వ స్థానంలో ఉన్నాయి.


గత నెలలో, బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0తో పర్యాటక జట్టును ఓడించింది. ఆస్ట్రేలియా వారి సొంత మైదానంలో దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. కాగా ఈ సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో భారత్ రేటింగ్ పాయింట్లలో ముందంజ వేసి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.


ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంక్‌లో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. టీమ్ ఇండియా 115 రేటింగ్ పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో, 100 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, 85 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి. వెస్టిండీస్ 79 పాయింట్లతో ఆరో స్థానంలో, 77 పాయింట్లతో పాకిస్థాన్ ఏడో స్థానంలో, 71 పాయింట్లతో శ్రీలంక ఎనిమిదో స్థానంలో, 46 పాయింట్లతో బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో, 25 రేటింగ్ పాయింట్లతో జింబాబ్వే 10వ స్థానంలో ఉన్నాయి.


ఆస్ట్రేలియాతో భారత్ సిరీస్
త్వరలో భారత జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి-మార్చిలో ఇరు దేశాల మధ్య ఈ సిరీస్ జరగనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించాలంటే టీమిండియా కనీసం 3-1 తేడాతో కంగారూ జట్టును ఓడించాలి. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ చేరడం ఖాయం. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఫైనల్స్‌కు చేరుకుంటుందా లేదా అన్నది తేలనుంది.


ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్ పాయింట్లను పరిశీలిస్తే, భారత్ నంబర్ టూ స్థానంలో ఉంది. అయితే మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఫైనల్ కోసం గట్టి పోటీ ఇస్తోంది. ఆస్ట్రేలియాను ఓడించడంలో భారత జట్టు సఫలమైతే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడమే కాకుండా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలోనే నిలవనుంది.