టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీ ఫైనల్‌లో నేడు ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. షేక్ జయేద్ స్టేడియంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లూ సూపర్ 12 దశలో ఒక్కో మ్యాచ్ ఓడిపోయాయి. ఇంగ్లండ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 10 పరుగుల తేడాతో పరాజయం పాలవ్వగా.. న్యూజిలాండ్ తమ మొదటి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతి ఓడిపోయింది.
ఈ రెండు జట్లూ అంతర్జాతీయ టీ20ల్లో 21 సార్లు తలపడగా, 13 సార్లు ఇంగ్లండ్, ఏడు సార్లు న్యూజిలాండ్ విజయం సాధించాయి. ఒక్క మ్యాచ్‌లో ఫలితం రాలేదు. టీ20 వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఆడగా, ఇంగ్లండ్ మూడు సార్లు, న్యూజిలాండ్ రెండు సార్లు గెలిచాయి.
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడటం ఇంగ్లండ్‌కు ఇది మూడోసారి. 2010లో ఇంగ్లండ్ విజేతగా నిలవగా.. 2016 ఫైనల్స్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైంది. అలాగే న్యూజిలాండ్ కూడా 2007,2016 వరల్డ్‌కప్‌ల్లో సెమీఫైనల్స్‌కు చేరుకుంది. అయితే న్యూజిలాండ్ ఒక్కసారి కూడా ఫైనల్స్‌కు పోలేదు.
చివరి లీగ్ మ్యాచ్‌లో జేసన్ రాయ్ గాయపడటంతో ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేడా అనే విషయంలో సందేహం నెలకొంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శామ్ బిల్లింగ్స్ రాయ్ స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే న్యూజిలాండ్ జట్టులో మాత్రం పెద్దగా మార్పులు జరగకపోవచ్చు. లోకి ఫెర్గూసన్ వంటి బౌలర్ గాయంతో దూరమైనా.. న్యూజిలాండ్ ఈ టోర్నీలో పెద్దగా ఇబ్బంది పడలేదు.
న్యూజిలాండ్ తుదిజట్టు(అంచనా)
మార్టిన్ గుప్టిల్, డేరిల్ మిషెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్). డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషం, మిషెల్ శాంట్నర్, ఆడం మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్డ్
ఇంగ్లండ్ తుదిజట్టు(అంచనా)
జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్/శామ్ బిల్లింగ్స్, లియాం లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణాలేంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి