టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడటంతో ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మొయిన్ అలీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో జోస్ బట్లర్ పర్వాలేదనిపించగా.. జానీ బెయిర్‌స్టో క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించాడు. మొదటి వికెట్‌కు 37 పరుగులు జోడించిన అనంతరం ఆడం మిల్నే బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో అవుటయ్యాడు. పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఇష్ సోధి.. ఫాంలో ఉన్న బట్లర్‌ను అవుట్ చేసి న్యూజిలాండ్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కాస్త నిదానంగా ఆడటంతో ఇంగ్లండ్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆ తర్వాత డేవిడ్ మలన్, మొయిన్ అలీ వేగంగా ఆడటంతో స్కోరు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో డేవిడ్ మలన్ అవుటైనా.. లియాం లివింగ్ స్టోన్‌తో కలిసి మొయిన్ అలీ ఇన్నింగ్స్‌ను టాప్ గేర్‌కు చేర్చాడు. 20వ ఓవర్లో లియాం లివింగ్ స్టోన్ అవుటయ్యాడు. వెంటనే బౌండరీతో మొయిన్ అలీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 20 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ మొదటి 10 ఓవర్లలో కేవలం 67 పరుగులు మాత్రం చేయగా.. చివరి 10 ఓవర్లలో 99 పరుగులు చేసింది. ఆఖరి ఐదు ఓవర్లలో ఏకంగా 56 పరుగులు రాబట్టడం విశేషం. కివీ బౌలర్లలో సౌతీ, ఆడం మిల్నే, ఇష్ సోధి, జేమ్స్ నీషం తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకోవాలంటే 120 బంతుల్లో 167 పరుగులు సాధించాలి.
Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణాలేంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి