Cricket Awards: 2022 సంవత్సరానికి ఐసీసీ అవార్డుల ప్రకటన సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 23వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు వివిధ విభాగాల్లో మొత్తం 18 అవార్డులను ప్రకటించనున్నారు. వీటిలో ఐదు జట్టు అవార్డులు, 13 వ్యక్తిగత అవార్డులు ఉంటాయి. ఐసీసీ గత నెలలో ఈ అవార్డుల కోసం షార్ట్‌లిస్ట్ జట్లు, ఆటగాళ్లను ప్రకటించింది, దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఐసీసీ ఓటింగ్ అకాడమీ నుంచి ఓటు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఓటింగ్ కాలం ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అవార్డులు మాత్రమే ప్రకటించాల్సి ఉంది.


ఏ అవార్డును ఎప్పుడు ప్రకటిస్తారు?
జనవరి 23
1. ఐసీసీ మహిళల టీ20 ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్
2. ఐసీసీ పురుషుల టీ20 ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్


జనవరి 24
3. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్
4. ఐసీసీ ఉమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్
5. ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్


జనవరి 25
6. ఐసీసీ పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
7. ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
8. ఐసీసీ పురుషుల టీ20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
9. ఐసీసీ మహిళల టీ20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
10. ఐసీసీ ఎమర్జింగ్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
11 ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్


జనవరి 26
12. ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్
13. ఐసీసీ పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
14. ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
15. ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
16. రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ (ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్)
17. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ (ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్)
18. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు


ముఖ్యమైన అవార్డులు ఇవే
‘ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’పై అందరి దృష్టి ఉంటుంది. ఈ అవార్డు విజేతకు సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందజేస్తారు. బాబర్ ఆజం, బెన్ స్టోక్స్, సికందర్ రజా, టిమ్ సౌతీలు ఈ అవార్డుకు నామినేషన్లు అందుకున్నారు. అదే విధంగా ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో నటాలీ షీవర్, స్మృతి మంథన, అమేలియా కార్, బెత్ మూనీ మధ్య పోటీ ఉంది. ఈ అవార్డు విజేతకు రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని ప్రదానం చేస్తారు.


వ్యక్తిగత అవార్డుల్లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో స్టైలిష్ క్రికెటర్ స్మృతి మంథన రేసులో ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ స్కీవర్, న్యూజిలాండ్‌కు చెందిన అమీలియా కెర్, ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీలతో స్మృతి పోటీ పడనుంది.


ఇక టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, అదే అవార్డు కోసం మహిళల విభాగంలో స్మృతి మంథన పోటీ పడుతున్నారు. మరి ఈ అవార్డుల్లో మనదేశానికి ఒక్క అవార్డు అయినా దక్కుతుందేమో చూడాలి.