పి.వి సింధు (PV Sindhu).. ఈ పేరు తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశానికి సుపరిచరితం. భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ (Badminton) క్రీడాకారిణి. ఆసియా క్రీడలు,  కామన్వెల్త్ క్రీడలలో పతకాలే  కాకుండా రెండు ఒలింపిక్ పతకాలు, ఒక ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణంతో సహా అనేక అవార్డులను భారత్ దేశానికి తెచ్చిపెట్టింది.  28 ఏళ్ళ సింధు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్లో  పాల్గొంది. ఈ సందర్భంగా తన ఆమె ఆట గురించి మాత్రమే కాకుండా  ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా  ప్రశ్నలు ఎదురయ్యాయి. లవ్ లైఫ్, రిలేషన్షిప్ గురించి అడిగిన ప్రశ్నలకు సింధు సరదాగా  సమాధానమిచ్చింది. 
రిలేషన్ షిప్ స్టేటస్పై అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ తను సింగిల్ అని,  ప్రస్తుతం  బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుత  లక్ష్యం ఒలింపిక్స్ మాత్రమే అని,  దాని కోసమే కష్టపడుతున్నానని చెప్పింది జీవితంలోఒక  భాగస్వామి ఉండాలని మీరు అనుకుంటున్నారా  అని ప్రశ్నించగా దాని గురించి తానెప్పుడూ అంతగా ఆలోచించలేదని,  అదంతా విధి అని భావిస్తానని, ఏది  ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పింది. అప్పటికి కూడా వదలని యాంకర్ మీరు  ఎవరితోనైనా డేటింగ్ చేశారా అని ప్రశ్నించగా.. 'లేదు' అని  బదులిచ్చింది. అయితే ఇందులో తప్పు, ఒప్పు అన్న ఆలోచన కన్నా తను ఆ విషయాలు పెద్దగా పట్టించుకొనని, జీవితం ఎలా తీసుకుపోతే అలా వెళ్ళిపోతానని సమాధానం ఇచ్చింది. 

ఇప్పటికే ఒలింపిక్స్ లో  రెండు పతకాలు సాధించిన సింధు.. వచ్చే ఏడాది జరగబోయే పారిస్ ఒలంపిక్స్ కు  సన్నద్ధమవుతోంది.  బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొణె ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటోంది.  జూలై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది.  సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన ఆమె.. అంచెలంచెలుగా ఎదుగుతూ 2012, సెప్టెంబరు 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకొని మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వాలీబాల్ క్రీడాకారులైన పీవీ రమణ (PV Ramana), విజయలక్ష్మి(Vijaya Laxmi) దంపతులకు జన్మించింది. పీవీ రమణ వాలీబాల్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారుడు. ఆయనకు 2000లో కేంద్ర ప్రభుత్వం అర్జన అవార్డుతో సత్కరించింది. రియో ఒలింపిక్స్ లో ర‌జ‌తంతో మెరిసిన తెలుగుతేజం పీవీ సింధుకు నాటి చంద్రబాబు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ను ఆఫర్ చేసింది.


అక్టోబర్ లో జరిగిన  ఫ్రెంచ్ సూప‌ర్ ఓపెన్ రెండో రౌండ్‌లో సింధు గాయంతో త‌ప్పుకున్న‌ది. థాయిలాండ్‌కు చెందిన సుప‌నిదా క‌టేతాంగ్‌తో మ్యాచ్ ఆడుతున్న స‌మ‌యంలో ఆమె గాయంతో ఆటనుంచి తప్పుకుంది. తిరిగి  ట్రైనింగ్ మొద‌లుపెట్ట‌డానికి ముందు కొన్ని వారాలు రెస్టు తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించిన‌ట్లు సింధు తెలిపింది. అప్పటి నుంచి సుమారు నెల రోజులు బ్రేక్ తీసుకొని తరువాత  ప్రకాశ్ పడుకొనే సారధ్యంలో ఒలింపిక్స్ క్రీడ‌ల‌పై ఫోక‌స్ పెట్టింది.