Jagadhatri Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో జగదీష్ రెడ్డి కొడుకుని గురించిన క్రిమినల్ వివరాలు తనకు అందించమని తన అసిస్టెంట్ కి చెప్తుంది ధాత్రి. తర్వాత అక్కడ నుంచి బయలుదేరుతారు ధాత్రి దంపతులు.


ధాత్రి : బండిమీద వస్తూ రెడ్డి మన దగ్గర ఏదో దాస్తున్నట్లుగా ఉన్నాడు అంటుంది. అంతలోనే ఫాస్ట్ గా వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్న కారుని చూసి ఇంత ఫాస్ట్ గా మన ఇంటికి ఎవరు వెళ్తున్నారు అనుకుంటూ వాళ్లు కూడా ఫాస్ట్ గా ఇంటికి వెళతారు.


కారు దిగిన దివ్యాంక స్వీట్స్ తీసుకుని ఇంట్లోకి వెళుతుంది.


దివ్యాంక: అప్పటికే ఇంట్లో దిగులుగా ఉన్న కుటుంబ సభ్యులను చూసి నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే ఉన్నారు అని వెటకారంగా మాట్లాడుతుంది.


యువరాజ్ తండ్రి: నీకు ఈ ఇంట్లో ఏం పని, ముందు బయటికి నడువు.


వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే వైజయంతి కౌషికిని పిలుస్తుంది. కిందికి వచ్చిన కౌషికి చేతిలో స్వీట్ బాక్స్ పెట్టి త్వరలోనే నీ చెల్లెలు జైలుకి వెళ్లబోతుంది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దివ్యాంక.


కౌషికి: మా కుటుంబం గురించి మాట్లాడే రేంజ్ నీకు లేదు మాతో తల పడటానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. నిజంగా నా చెల్లెలు తప్పు చేస్తే నేనే తనని పోలీసులకి అప్పగిస్తాను అంటుంది.


ఇదంతా బయటనుంచి చూస్తూ ఉంటారు ధాత్రి దంపతులు. కోపంగా బయటికి వచ్చేస్తున్న దివ్యాంకని ఆపి నీకు కౌషికి వదినకి ఏమైనా సమస్యలు ఉంటే బయటన చూసుకోండి అంతేగాని ఇంటికి వచ్చి నా కుటుంబ సభ్యులని ఏమైనా అంటే ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ధాత్రి.


మరోవైపు ఇదంతా మాధురి వల్లే అని కోపంగా మాధురి రూమ్ కి వెళ్లి అసలు అక్కడ ఏం జరిగింది నిజం చెప్పు అని అడుగుతాడు యువరాజ్.


మాధురి: నాకేమీ తెలియదు.. నన్ను టెన్షన్ పెట్టకు అని గట్టిగా మాట్లాడుతుంది.


యువరాజ్: తప్పు చేసింది కాక మళ్ళీ నా మీదే కేకలు వేస్తావా అంటూ ఆమె చెంప పగలగొడతాడు.


అది చుసిన ధాత్రి దంపతులు యువరాజ్ ని మందలిస్తారు.


కేదార్: తను టెన్షన్ లో ఉన్నప్పుడు తన మీద చేయి చేసుకోవటం గొప్పకాదు, ఒక అన్నగా నేను ఉన్నాను అని ధైర్యం చెప్పు.


యువరాజ్: ఒక అనాథవి నువ్వు కూడా నాకు చెప్తున్నావా అని వెటకారంగా మాట్లాడుతాడు.


ధాత్రి: నా భర్త గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు ఆయనకి ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను.. ఆయన అనాధ కాదు అంటూ యువరాజ్ ని కోప్పడుతుంది.


ఏదో చిరాకులో తనని కొట్టేశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యువరాజ్. కేదార్ మాధురికి ధైర్యం చెప్తుంటే నీలాంటి అన్నయ్య నాకు ఉంటే బాగున్ను అని ఎమోషనల్ అవుతుంది మాధురి.


మరోవైపు కౌషికి ఆమె చిన్నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అతనికి ఆయాసం రావడంతో కౌషికి ఇన్హేలర్ ఇస్తుంది. ఇదంతా దూరం నుంచి చూసిన కేదార్ ఏం జరిగింది అనుకుంటూ అక్కడికి వస్తాడు.


కౌశికి : ఆయన టెన్షన్ పడుతున్నారు అందుకే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.


కేదార్ : మీరు చెల్లెలి గురించి ఏమీ బాధపడకండి నాన్న, తను నిర్దోషి అని నిరూపించే బాధ్యత నాది.


కేదార్ తండ్రి: నన్ను నాన్న అని పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పాను.. నీ సహాయం ఈ ఇంట్లో ఎవరికీ అక్కర్లేదు అని కేదార్ ని అవమానించేలాగా మాట్లాడుతాడు.


ఇదంతా చూస్తున్న యువరాజ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు నాన్న అని ఆయనని పిలవడం నేను విన్నాను. అందుకేనా అక్క నిన్ను ఇంట్లో ఉంచింది అంటూ కేదార్ తల్లిని కూడా అవమానించేలాగా మాట్లాడుతాడు యువరాజ్.


అప్పటివరకు ఓపిక పట్టిన కేదార్ తన తల్లి గురించి తప్పుగా మాట్లాడే సరికి సహనం కోల్పోయి యువరాజ్ పై చేయి చేసుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘బహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంట్లో తిష్టవేసిన కనకం - అరుణ్‌ను పట్టుకోవడానికి కావ్య కొత్త ప్లాన్