Brahmamudi Telugu Serial Today Episode:  స్వప్నకు ఇంత అవమానం జరిగాక ఇక ఈ ఇంట్లో ఉండనివ్వనని కనకం తనతో పుట్టింటికి తీసుకెళ్తానని నాటకం మొదలుపెడుతుంది. స్వప్నను అన్ని సర్దుకుని రమ్మని పిలుస్తుంది. కనకం మాటలకు రుద్రాణికి అనుమానం వస్తుంది. నిజంగానే ఇంటికి తీసుకెళ్లేదే అయితే మాటలు ఎందుకు చెప్తుంది. తీసుకునే వెళ్తుంది కదా ఎక్కడో తేడా కొడుతుంది అని మనసులో అనుకుంటుంది. స్వప్న కన్ఫీజ్‌గా చూస్తుంటే..


కనకం: నాకు తెలుసే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నువ్వు పుట్టింటికి వస్తే.. ఇటు అత్తింటికి అటు పుట్టింటికి అవమానం అని ఆలోచిస్తున్నావు కదా..? అయినా ఈ అవమానం కన్నా ఆత్మాభిమానమే ముఖ్యం. దయచేసి పుట్టింటికి రా తల్లి.


కావ్య: అమ్మా ఏంటమ్మా ఇది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థం అవుతుందా? అమ్మా.. అక్క కాపురం నిలబడాలని కోరుకోవాలి కానీ ఇలా నువ్వే దాని కాపురాన్ని కూల్చేసి తీసుకెళ్లిపోతాను అంటే ఎలా? చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అమ్మ.


రుద్రాణి: లేదు లేదు.. మీ అమ్మ చాలా క్లారిటీగానే మాట్లాడుతుంది. పాకెట్‌ పాలలో రెండు పాకెట్ల నీళ్లు కలిపినట్లు మీ ఇంట్లో ఆత్మాభిమానం, మమకారం రెండూ కలిసిపోతాయి. ఇక్కడి కన్నా మీ అక్క అక్కడ సుఖంగా ఉంటుంది. మట్టి పిసుక్కోవడం.. బొమ్మలకు రంగులు వేసుకోవడం మీకు బ్రష్‌తో పెట్టిన విద్య కదా..!


అంటూ రుద్రాణి మాట్లాడటంతో వాళ్ల అమ్మ కోపంగా రుద్రాణిని తిడుతూ డీఎన్‌ఏ టెస్ట్‌ అయ్యే వరకు స్వప్న ఇక్కడే ఉంటుందని ఇందులో ఎలాంటి మార్పు లేదని ఆర్డర్‌ వేస్తుంది. అలాగయితే నా కూతురును వదిలి నేను ఉండలేనని ముందే ఉత్త మనిషి కాదని చెప్తుంది కనకం.  ధాన్యలక్ష్మీ  కూతురు కడుపుతో ఉన్నప్పుడు తల్లి అవసరం ఎంతో ఉంటుందని కనకం ఇక్కడే ఉండాలని చెప్తుంది. దీంతో  బామ్మ కూడా సరే అంటుంది. కనకం,  అన్నపూర్ణకు ఫోన్‌ చేసి  ఇక్కడ అంతా బాగానే ఉందని చెప్తుంది. అప్పు చేత తన బట్టలు పంపించమని చెప్తుంది. అప్పును ఎందుకని పంపించాలని వాళ్ల అక్క అడుగుతే కళ్యాణ్‌ పెళ్లి ఆగిపోవడం అది కళ్లతో చూడాలని చెప్తుంది కనకం సరే అని ఫోన్‌ పెట్టేస్తుంది అన్నపూర్ణ. 


బెడ్ రూంలో ఆలోచిస్తూ కూర్చున్న అప్పు దగ్గరకు అన్నపూర్ణ వస్తుంది.


అన్నపూర్ణ: అప్పు..


అప్పు: చెప్పు పెద్దమ్మా..


అన్నపూర్ణ: మీ అమ్మ ఫోన్‌ చేసిందే.. మీ అక్కను చూసుకోవడానికి మీ అమ్మను అక్కడే ఉండమని అడిగారట. నిన్ను బట్టలు తీసుకుని రమ్మంది. అన్ని సర్ధిపెడతాను రేపే తీసుకుని వెళ్లు.  


  అని అన్నపూర్ణ చెబితే అప్పు అక్కడికి తాను వెళ్లనని చెప్తుంది. నాకదంతా తెలియదు. నువ్వు వెళ్లాల్సిందే అంటూ అన్నపూర్ణ వెళ్లిపోతుంది.  స్వప్న బెడ్‌రూంలో కూర్చుని కనకం తీసుకొచ్చిన స్వీట్స్‌ తింటూ ఉత్తి చేతులతో వచ్చి ఉంటే నిన్ను తిట్టేదాన్ని అమ్మ అంటుంది.  ఇకపై ఏమైనా చేసేటప్పుడు నాకు చెప్పి చేయి అంటుంది కావ్య. నీకెందుకు చెప్పాలని స్వప్న కోపంగా కావ్యను అడుగుతుంది. ఇద్దరూ గొడవపడుతుంటే కనకం సర్ధిచెప్పి స్వప్నను బయటకు పంపిస్తుంది. కళ్యాణ్‌ పెళ్లికి ముహూర్తం పెట్టే పంతులు వివరాలు కావ్యను అడుగుతుంది కనకం. పంతులు వివరాలు కావ్య చెప్పడంతో అక్కడి నుంచి నరుక్కువద్దాం అని మనసులో  అనుకుంటుంది కనకం.


పంతులు గారి ఇంటి ముందు దీనంగా నిలబడి ఉంటుంది కనకం. కనకాన్ని చూసిన పంతులు ఆశ్యర్యంగా ఎవరని అడుగుతాడు.


పంతులు: దశమ స్థానంలోకి కుజుడు ప్రవేశించినట్లు మీరు నా ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరమ్మా మీరు?


కనకం: మీరొక పెళ్లి..


పంతులు: ముహూర్తం పెట్టాలా..?


కనకం: అవును కానీ ఆ పెళ్లి జరగడానికి కాదు.. చెడగొట్టడానికి..


అని కనకం చెప్పగానే పంతులు షాక్‌ అవుతారు.  తాను అలా చేయనని చెప్తాడు. కనకం సినిమా డైలాగులు చెప్పి తన కూతురు జీవితాన్ని నిలబెట్టమని కోరుకుంటుంది. దీంతో పంతులు ఒప్పుకుని ఇంతకీ ఎవరి పెళ్లి అని అడుగుతాడ. దుగ్గిరాల సీతారామయ్య మనవడి పెళ్లి అనగానే పంతులు సీరియస్‌గా కనకాన్ని తిడతాడు. దీంతో కనకం మీరు సాయం చేయకపోతే నేను సూసైడ్‌ చేసుకుంటానని బెదిరిస్తుంది. ఆ ఇద్దరి జాతకాలు కలవలేదని పెళ్లి చెడగొట్టమంటుంది. పంతులు ఒప్పుకోకపోతే విషం తీసి తాను తాగి చనిపోతానని కనకం బెదిరింపు నాటకం క్లైమాక్స్‌ కు తీసుకెళ్తుంది. దీంతో పంతులు పెళ్లి చెడగొడతానని ఒప్పుకోవడంతో  కనకం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కావ్య బోర్డు మీద ఏవో డాట్స్‌  గీస్తుంటుంది. రాజ్‌ వచ్చి ఏం చేస్తున్నావు అన్నట్లు సైగ చేస్తాడు.


కావ్య: చుక్కలు లెక్క పెడుతున్నానండి


రాజ్‌: ఎందుకు లెక్కపెట్టడం నన్ను అడిగితే నేను చెప్పేవాణ్ణి కదా


కావ్య: మీకు చుక్కల లెక్కలు కూడా తెలుసా?


రాజ్‌: తెలుసు.. పదిహేను కోట్ల  పదిహేను లక్షల పదిహేను వేల పదిహేను వందల పదిహేను


కావ్య: ఎందుకండి కోస్తారు.. నేను నమ్మను..


రాజ్‌: కావాలంటే రాత్రికి పైకి వెళ్లి లెక్కపెట్టుకో అదే లెక్క వస్తుంది. ఇంతకీ నువ్వేం చుక్కలు గీస్తున్నావు.


అని రాజ్‌ అడగ్గానే అరుణ్‌ ను పట్టుకోవడానికి తాను ప్లాన్‌ గీస్తున్నట్లు కావ్య చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు వేణిగారు.. ముకుంద కోసమే ఇదంతా!