Rafael Nadal: సుదీర్ఘ టెన్నిస్‌ చరిత్రలో రారాజుగా నిలిచిన   క్లే కింగ్‌ రఫెల్‌ నాదల్‌(Rafael Nadal)  ఫ్రెంచ్‌ ఓపెన్‌(French Open) గ్రాండ్‌స్లామ్‌లోనే తన పోరాటాన్ని ముగించాడు. గాయం నుంచి తేరుకుని బరిలోకి దిగనా  తన పాట జోరును కొనసాగించలేకపోయాడు.  తొలి రౌండ్‌లోనే జర్మనీ ప్లేయర్‌ జర్మనీ ప్లేయర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ చేతిలో ఓటమిపాలై  ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. ఓడినాసరే అభిమానుల జయజయధ్వానాల మధ్య  వెనుదిగిగాడు. 

 

టెన్నిస్‌ చరిత్రలో రఫెల్‌ నాదల్‌ది ఒక ప్రత్యేక అధ్యాయం .  ఎవరికీ సాధ్యం కాని రీతిలో  నాదల్‌ సాగించిన జైత్రయాత్ర  అనితరసాధ్యం.  20 ఏండ్ల చరిత్రలో  ఫ్రెంచ్‌ ఓపెన్‌  అనే పేరుకు  నాదల్‌ ప్రత్యామ్నాయమేమో అనిపించిన నాదల్ జైత్రయాత్ర  ఓటమితో ముగిసింది. అయితే అది కూడా ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనే. గాయం నుంచి కొలుకొని ఆత్మవిశ్వాసంతో బరిలో దిగిన నాదల్ తన మునుపటి స్థాయి ప్రదర్శించలేకపోయాడు.  ఇద్దరి మధ్య మ్యాచ్ 3 గంటల 5 నిమిషాల పాటు సాగింది. జ్వెరెవ్  నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి  పలుమార్లు ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే ముందుగా ఓడి తరువాత  గెలవడం నాదల్‌కు కొత్తేం కాదు కాబట్టి  అందరూ నాదల్  అద్భుతం చేస్తాడా  అనుకున్నారు  కానీ వెంటనే నాదల్‌  అలాంటి మెరుపులు ఏమి చేయలేకపోయాడు. తాజాగా  రోమ్‌ ఓపెన్‌ గెలిచి మంచి జోరుమీదున్న జ్వెరెవ్‌ తన జోరు కొనసాగించాడు. నాదల్ ను ఓడించాడు నాదల్ మొత్తం కెరీర్  ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇది మూడో ఓటమి.
  

 

నాదల్ నిష్క్రమణ

సుమారు రెండు దశాబ్దాల పాటు ఎర్రమట్టి కోర్టులో తిరుగులేని బావుటా ఎగరేసి, ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఏకంగా 14   టైటిళ్లు సొంతం చేసుకున్న రారాజు   ఇలా  తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం అభిమానులను  తీవ్రంగా నిరాశపరిచేదే. అయితే నాదల్ అనారోగ్యం, గాయాలు ఆటకు దూరంగా ఉండటంతవటాని పై పెద్దగా ఆశలు లేవు అని చెప్పుకోవచ్చు. కానీ అభిమానం గెలుపు ఓటములకు అందనిది. ఆ అభిమానానికే నాదల్ తలొగ్గాడు. ఈ ఓటమితో నాదల్ కి ఇది అని అభిమానులకే కాదు నాదల్ కు కూడా అర్థం అయ్యింది. అందుకే అటు అభిమమానులు, ఇటు ఆటగాడు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మళ్లీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడతానని కచ్చితంగా చెప్పలేనన్న నాదల్ తను ఇక్కడికి మళ్ళీ తిరిగివస్తానన్న గ్యారెంటీ లేదనాడు. అయితే ఒలింపిక్స్‌ కోసం మాత్రం ఇక్కడికి  తప్పక వస్తాను అన్నాడు. 

 

నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్ల వేట.. 

 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ లో నాదల్ ఆట  2005లో మొదలైంది. ఆ తర్వాత ఏకంగా 14 సార్లు  తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2022 వరకూ సాగింది. అటు  గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ నాదల్ సత్తా చాటాడు. రోజర్‌ ఫెదరర్‌, జొకోవిచ్‌తో వంటి ఎంతోమంది ఆటగాళ్లు నాదల్ ను దాటలేకపోయారు. మొత్తం కెరియర్లో  నాదల్ 4 సార్లు మాత్రమే ఓడిపోయాడు. రొబిన్‌ సొదర్లింగ్‌ ఒకసారి జొకోవిచ్‌ రెండు సార్లు , తాజాగా జ్వెరెవ్‌  మాత్రమే రఫెల్‌ను ఓడించారు.