Ronaldo vs Messi: ఫుట్ బాల్  చరిత్రలో అత్యుత్తమ ఆటగాడి గా కొనసాగుతున్న మెస్సీ కి చెక్ పెట్టాలనుకుంటున్న అని మరో దిగ్గజ ఫుట్‌బాలర్‌ రోనాల్డో తన మనసులోని మాట బయటపెట్టాడు. ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్నాక అతడు మీడియాతో మాట్లాడాడు.


ఏం జరిగిందంటే?


లూయిస్ వీట్టాన్ బ్రాండ్ అడ్వర్టైజ్ మెంట్ షూటింగ్ కోసం ఫుట్ బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లు రోనాల్డో, మెస్సీని చదరంగంలో తలపడుతునట్టు చిత్రీకరించారు. షూట్ తర్వాత రోనాల్డో మాట్లాడుతూ తనకు, మెస్సీ కి మధ్య ఉన్న పోటీని కొనసాగించాలనుకుంటున్న అని తెలిపారు.


రోనాల్డో మాట్లాడింది ఏంటంటే?


మెస్సీకి, రోనాల్డోకి చివరిదైన వరల్డ్ కప్ ముందు మాట్లాడుతూ "ఇది నా ఐదో వరల్డ్ కప్, ఇది అద్భుతంగా కొనసాగుతుందని నేను చాలా విశ్వాసంతో వున్నాను" అని అన్నారు. ఫోటోషూట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ "మేము చదరంగంలోనే కాదు జీవితంలో చెక్ మేట్ పెట్టుకుంటున్నాం. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం. చదరంగంలో కాదు ఫుట్ బాల్‌లో మా పోటీ మరింత  ఆసక్తికరంగా వుంటుంది" అని అన్నారు.


మెస్సీ వెర్సెస్ రోనాల్డో 


ఫుట్ బాల్ ఆటలో గత దశాబ్దకాలంగా రోనాల్డో, మెస్సీ నిరంతరంగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ, ఒకరి రికార్డులను మరొకరు బద్దలకొడుతూ, ఫుట్ బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లు ఎదిగారు. ఇప్పటివరకు ఏ ఒక్కరూ వరల్డ్ కప్ అందుకోలేదు. తమ ఖ్యాతిని కొనసాగించడానికి వరల్డ్ కప్ ఎంతో ఉపయోగపడుతుంది.


రోనాల్డో భవిష్యత్తు


పోర్చుగల్ కు దూరంగా ఉన్నప్పటి నుంచి ఐదు సార్లు 'బాలన్‌ డీ ఓర్‌' విజేతగా నిలిచాడు, మొదటి సారి వరల్డ్ కప్ గెలవడంపై దృష్టి సారించాడు. పేయిర్స్ మోర్గాన్ తో బాంబ్ షెల్ ఇంటర్వ్యూ తర్వాత క్లబ్ ఫూట్ బాల్ లో భవిష్యత్తు సందేహంగానే ఉంది.