Viral Video - Player Killed By Lightning Strike: థాయిలాండ్‌లో ఘోరమైన ట్రాజెడీ జరిగింది. స్థానిక ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా హఠాత్తుగా గ్రౌండ్ పై పిడుగుపడి సోఫ్వాన్ అవే అనే 24 ఏళ్ల యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోర ప్రమాదంలో మరో 12 మంది ప్లేయర్లు తీవ్రంగా గాయపడ్డారు. వర్షంలో ప్లేయర్లు ఫుట్‌బాల్ ఆడుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్రౌండ్ పై పిడుగు పడింది. వింగర్ గా ఆడుతున్న సోఫ్వాన్ అవే అక్కడికక్కడే కిందపడి అచేతనంగా మారిపోయాడు. ఎమర్జెన్సీ మెడికల్ టీమ్స్ అతడిని కాపాడటానికి ట్రై చేసినప్పటికీ తీవ్ర గాయాల వల్ల హాస్పిటల్ లో డెత్ అయ్యాడు.
గోలోక్ ఎఫ్ఏ కప్ లో విపత్తు.. ప్రొటోకాల్స్ పై ఫ్యాన్స్ ఫైర్తాజా రిపోర్ట్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ గోలోక్ ఎఫ్ఏ కప్ టోర్నమెంట్ లో సామ్‌కోల్ట్స్, అబు x నాంగ్ సిరిన్ టీమ్‌ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో స్పోర్ట్స్ లవర్స్ సంతాపాన్ని తెలియజేశారు. పిడుగులు పడే వర్షంలో మ్యాచ్‌ను కంటిన్యూ చేయడంపై నిర్వాహకులపై ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు మ్యాచ్ ని ఆపేసే ఆటోమేటిక్ ప్రొటోకాల్ అన్ని చోట్లా ఉండాలని కామెంట్స్ చేశారు.
థాయిలాండ్‌లో పిడుగుపాట్ల భయం.. 283 మందిపై ప్రభావంథాయిలాండ్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ డేటా ప్రకారం 2020 నుంచి 2024 మధ్య కంట్రీలో దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారని, అందులో చాలా మంది స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ ఎంత ఎఫర్ట్ పెట్టినా తీవ్ర గాయాల వల్ల బాధితుడు చనిపోయాడని పోలీస్ చీఫ్ థున్ సిరికుంట్ బెర్నామా న్యూస్ ఏజెన్సీతో స్పష్టం చేశాడు.
ఫుట్‌బాల్ అసోసియేషన్ సంతాపం.. ఫ్యామిలీకి సానుభూతిఈ విషాదకర సంఘటనపై థాయిలాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. "సోఫ్వాన్ అవే హఠాన్మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో అతడి ఫ్యామిలీకి, క్లబ్ సభ్యులకు మా సానుభూతి తెలియజేస్తున్నాం" అని అసోసియేషన్ ప్రతినిధి తెలిపాడు.
