2026 Women Asia Cup Schedule Released, IND VS PAK Match:  ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) తాజాగా ఉమెన్స్ టి20 ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మెగా టోర్నమెంట్ దుబాయ్ వేదికగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగనుంది. త్రీ-టైమ్ ఛాంపియన్స్ అయిన ఇండియా తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 5న తలపడనుంది. ఈ టోర్నీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అయిన ఇండియా, గ్రూప్-ఎ లో పాకిస్తాన్, థాయిలాండ్, హాంకాంగ్ టీమ్‌లతో కలసి ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ లీడర్‌షిప్ లోని ఇండియన్ టీమ్ ఆగస్టు 30న థాయిలాండ్‌తో జరిగే మ్యాచ్ తో తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేయనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తో ఆడాక, సెప్టెంబర్ 5న పాకిస్తాన్‌తో బిగ్ ఫైట్ చేయనుంది.

Continues below advertisement

Continues below advertisement

గ్రూప్ వర్గీకరణ.. ఎనిమిది టీమ్‌ల మధ్య టైట్ కాంపిటీషన్ఈ ఎనిమిది టీమ్‌ల టోర్నమెంట్‌ను రెండేసి గ్రూప్‌లుగా డివైడ్ చేశారు. గ్రూప్-ఎ లో ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, హాంకాంగ్ ఉండగా, గ్రూప్-బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా, హోస్ట్ యూఏఈలు ఉన్నాయి. ఆగస్టు 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో థాయిలాండ్, హాంకాంగ్ మ్యాచ్ తో టోర్నీ స్టార్ట్ కానుంది. లాస్ట్ ఎడిషన్ విన్నర్ శ్రీలంక ఆగస్టు 29న యూఏఈతో, బంగ్లాదేశ్ ఆగస్టు 31న ఇండోనేషియాతో తమ ఫస్ట్ మ్యాచులు ఆడనున్నాయి.

సెమీఫైనల్స్, ఫైనల్స్ షెడ్యూల్ వివరాలుపాకిస్తాన్ టీమ్ సెప్టెంబర్ 1న థాయిలాండ్‌తో, సెప్టెంబర్ 7న హాంకాంగ్‌తో లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. శ్రీలంక సెప్టెంబర్ 2న ఇండోనేషియాతో, సెప్టెంబర్ 6న బంగ్లాదేశ్‌తో ఫైట్ చేయనుంది. బంగ్లాదేశ్ సెప్టెంబర్ 8న యూఏఈతో లీగ్ స్టేజ్ ముగిస్తుంది. ప్రతీ గ్రూప్ నుంచి టాప్ టూ లో నిలిచిన టీమ్‌లు నాకౌట్ స్టేజ్‌కి క్వాలిఫై అవుతాయి. ఫస్ట్ సెమీఫైనల్ సెప్టెంబర్ 10న, సెకండ్ సెమీఫైనల్ సెప్టెంబర్ 11న జరగనున్నాయి.

దుబాయ్ లో ఫ్లడ్ లైట్ల వెలుగులో సమరంసెమీఫైనల్స్ లో గెలిచిన టూ టీమ్‌లు సెప్టెంబర్ 13న జరిగే గ్రాండ్ ఫైనల్ లో ఛాంపియన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. టోర్నమెంట్ లోని మొత్తం 15 మ్యాచులు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులోనే డే-నైట్ మ్యాచులుగా జరగనున్నాయని ఏసీసీ తెలిపింది.