Former Cricketer Ajinkya Rahane Reveals Dhoni Secret Rules: ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే ఎంఎస్ ధోనీకి సంబంధించిన మైండ్ బ్లాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ధోనీ అత్యంత ప్రశాంతమైన, కూల్ పర్సన్ అని రహానే పొగిడాడు. ధోనీ రూమ్ ఎప్పుడూ ప్లేయర్ల కోసం ఓపెన్ గా ఉండేదని, టీమ్ మెంబర్స్ అందరూ వచ్చి టైమ్ స్పెండ్ చేసేవారని తెలిపాడు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ లో రహానే మాట్లాడుతూ "ధోనీ రూమ్ డోర్ తీసి ఉన్నంత వరకు అందరికీ ఆహ్వానమే. కానీ ఒక్కసారి ఆ రూమ్ డోర్ క్లోజ్ అయితే మాత్రం ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు" అని సీక్రెట్ రూల్ రివీల్ చేశాడు. రహానే తన టి20, వన్డే, టెస్ట్ డెబ్యూలను ధోనీ కెప్టెన్సీలోనే ఆడగా, ఐపీఎల్ లో 2023, 2024 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్ ను షేర్ చేసుకున్నాడు.
బెన్ స్టోక్స్ సలహాతో సోషల్ మీడియాకి దూరం.. మైండ్ రిఫ్రెషింగ్ హాబిట్స్సిరీస్ నడుస్తున్న టైమ్ లో తాను సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేస్తానని రహానే వెల్లడించాడు. 2017 ఐపీఎల్ లో కలసి ఆడుతున్నప్పుడు బెన్ స్టోక్స్ ఇచ్చిన సజెషన్ తో ఈ అలవాటు చేసుకున్నట్లు చెప్పాడు. మ్యాచ్ ల టైమ్ లో ఓటీటీ షోలు చూడటం, బుక్స్ చదవడం, ఫ్యామిలీతో మాట్లాడటం, నెక్స్ట్ డే కి డ్రెస్సెస్ ఐరన్ చేసుకోవడం లాంటి పర్సనల్ రొటీన్ తనకు హెల్ప్ అయిందని వివరించాడు.
ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ వీడియో.. టూ డెకేడ్స్ క్రికెట్ కి ఎండ్ కార్డ్దాదాపు రెండు దశాబ్దాల క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతూ రహానే గతేవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేసి అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో 85 మ్యాచుల్లో 38.46 యావరేజ్ తో 5,077 రన్స్ కొట్టగా, ఇందులో 12 సెంచరీలు, 26 ఫిఫ్టీలు ఉన్నాయి.
వన్డే, టి20 ఇంటర్నేషనల్స్ లో రహానే ఓవరాల్ రికార్డులువన్డేల్లో 90 మ్యాచుల్లో 35.26 యావరేజ్ తో 2,962 రన్స్ చేసి 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు సాధించాడు. టి20 లో 20 మ్యాచుల్లో 375 రన్స్ స్కోర్ చేశాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో ధోనీ అందించిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ క్రికెటర్ తెలిపాడు.
