Paraguayan Senator Attacks Kylian Mbappe:  ఫిఫా వరల్డ్ కప్ లో పరాగ్వేపై ఫ్రాన్స్ 1-0 తో గెలిచినప్పటి నుంచి కిలియన్ ఎంబాప్పే, పరాగ్వే మహిళా సెనేటర్ సెలెస్టే అమరిల్లా మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు ఒక వరస్ట్ స్టేజ్ కు చేరింది. తనను ఒక అసహ్యకరమైన మహిళ అని, సెనేటర్ పదవికి ఆమె అనర్హురాలని ఎంబాప్పే అన్నట్లు వచ్చిన రిపోర్ట్స్ పై అమరిల్లా తీవ్రంగా రియాక్ట్ అయింది. బుధవారం పరాగ్వే సెనేట్ హాల్ లోనే ఫ్రెంచ్ స్ట్రైకర్ ను దారుణమైన బూతు పదంతో తిట్టి అందరినీ షాక్ కు గురిచేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పరాగ్వే గోల్ కీపర్ ఒర్లాండ్ గిల్ కు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ఎంబాప్పే నిరాకరించడంపై ఆమె తన కోపాన్ని వెళ్లగక్కింది.

Continues below advertisement

Continues below advertisement

కీపర్ ను అవమానించిన ఎంబాప్పే.. "వరల్డ్ కప్ లో ఫస్ట్ టైమ్ ఆడుతున్న మా పరాగ్వే కుర్రాడు ఒర్లాండ్ గిల్ ఎంతో వినయంతో షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాపితే, ఈ దారుణమైన వ్యక్తి దాన్ని రిజెక్ట్ చేసి అతని మొహం మీదే అరిచాడు. ఇదెంతా ఫ్రెంచ్ సంస్కృతి కాదు. ఒక నిజమైన ఫ్రెంచ్ వ్యక్తి ఎప్పుడూ ఇలాంటి వరస్ట్ పని చేయడు" అని అమరిల్లా సెనేట్ ఫ్లోర్ లో ఆరోపించింది. అథెంటిక్ రాడికల్ లిబరల్ పార్టీకి చెందిన ఈ సెనేటర్, పరాగ్వే ఓటమి తర్వాత ఫ్రాన్స్ ప్లేయర్లు తీవ్రమైన జాతి వివక్ష కామెంట్స్ చేశారని క్లెయిమ్ చేసింది. ఫ్రాన్స్ అంటే రూసో, డెస్కార్టెస్, మోంటెస్క్యూ, విక్టర్ హ్యూగో, సిమోన్ డి బ్యూవోయిర్ లాంటి గొప్ప మేధావుల సంస్కృతి అని, అలాంటి గొప్ప ఫ్రాన్స్ హెరిటేజ్ ను ఎంబాప్పే లాంటి అనాగరికుడితో పోల్చలేనని ఆమె ఫుల్ ఫైర్ అయింది.

Read Also: FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!

రొనాల్డీన్హోలా జైల్లో పెడతా.. ఎక్స్ అకౌంట్ లో లీగల్ వార్నింగ్అంతకుముందు అమరిల్లా తన ఎక్స్ అకౌంట్ లో ఎంబాప్పేకు ఒక ఓపెన్ లెటర్ రాస్తూ తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. "పరాగ్వే ప్రజలతో పెట్టుకోవద్దు ఎంబాప్పే. గతంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డీన్హోను మార్చి 2020 లో మా దేశంలో ఎలా జైల్లో పెట్టామో గుర్తుంచుకో. నన్ను అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. నీపై జెండర్ వయొలెన్స్, మహిళలపై పొలిటికల్ వయొలెన్స్ కింద కేసు వేసి కోర్టుకు ఈడుస్తా. ఇది చాలా సీరియస్ మేటర్. నేను లీగల్ గా యాక్షన్ తీసుకోక ముందే ఎంబాప్పే నాకు క్షమాపణ చెప్పాలి" అని ఆమె డిమాండ్ చేసింది. ఈ పొలిటికల్ డ్రామా ప్రెజెంట్ ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మొరాకో మ్యాచ్ పైనే ఎంబాప్పే ఫోకస్.. మరోవైపు మొరాకోతో జరగబోయే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఫ్రాన్స్ హెడ్ కోచ్ డిడియర్ డెషాంప్స్ కు ఈ వివాదంపై క్వశ్చన్ ఎదురైంది. గ్రౌండ్ వెలుపల జరుగుతున్న ఈ గొడవల వల్ల ఎంబాప్పే మైండ్ అస్సలు డిస్టర్బ్ కాలేదని, అతను కంప్లీట్ గా గేమ్ పైనే ఫోకస్ పెట్టాడని కోచ్ క్లారిటీ ఇచ్చాడు. "కిలియన్ మానసికంగా చాలా స్ట్రాంగ్ గా, మంచి పొజిషన్ లో ఉన్నాడు. త‌ర్వాతి బిగ్ మ్యాచ్ లో పర్ఫార్మ్ చేయడానికి అతను వంద శాతం రెడీగా ఉన్నాడు" అని డెషాంప్స్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశాడు. ఈ నాన్-ఫుట్‌బాల్ కాంట్రవర్సీని పక్కన పెట్టి ఫ్రాన్స్ టీమ్ క్వార్టర్స్ లో విక్టరీ కొట్టి సెమీస్ లోకి వెళ్లడమే టార్గెట్ గా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.