Argentina Beat Egypt In Dramatic World Cup Clash: ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో తాజాగా అత్యంత నాటకీయమైన హై-వోల్టేజ్ పోరు జరిగింది. ఈజిప్ట్‌తో జరిగిన బిగ్ ఫైట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 0-2 తో వెనుకబడినప్పటికీ లాస్ట్ మినిట్స్ లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇస్తూ 3-2 తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో లెజెండ్ లియోనెల్ మెస్సి ఒక పెనాల్టీని మిస్ చేయగా, ఈజిప్ట్ కొట్టిన ఒక క్రూషియల్ గోల్ ను వీఏఆర్ రిజెక్ట్ చేసింది. అంపైర్ డెసిషన్స్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. మ్యాచ్ ముగిశాక ఈజిప్ట్ ఫార్వర్డ్ ప్లేయర్ మోస్తఫా జికో రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ వరల్డ్ కప్ ఆల్రెడీ ఫిక్స్ అయిందని, కప్ ను బలవంతంగా అర్జెంటీనా చేతిలో పెడుతున్నారంటూ జికో సంచలన కామెంట్స్ చేయడం ప్రెజెంట్ వరల్డ్ ఫుట్‌బాల్ లో షాక్ కు గురిచేస్తోంది.
రిఫరీ అన్యాయం చేశాడు.. వరల్డ్ కప్ ఫిక్స్ అన్న మోస్తఫా జికోమ్యాచ్ 60వ నిమిషంలో మోస్తఫా జికో ఈజిప్ట్ తరఫున థర్డ్ గోల్ కొట్టి టీమ్‌కు 3-0 లీడ్ ఇచ్చేలా కనిపించాడు. అయితే వీఏఆర్ రివ్యూలో ఈజిప్ట్ ప్లేయర్ హైసెం హసన్, అర్జెంటీనా డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ ను ఫౌల్ చేసినట్లు తేలడంతో ఆ గోల్ క్యాన్సిల్ అయింది. దీనిపై ప్రముఖ ఇటాలియన్ జర్నలిస్ట్ ఫాబ్రిజియో రొమానో షేర్ చేసిన పోస్ట్ లో జికో తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. "రిఫరీ కంప్లీట్‌గా అన్యాయం చేశాడు, ఒక దేశం పడిన కష్టాన్ని అతను బూడిదలో పోసిన పన్నీరు చేశాడు. ఈ వరల్డ్ కప్ కప్ ను అర్జెంటీనాకే ఇచ్చేస్తున్నారు, వాళ్లే విన్నర్ అవుతారు. ఇక్కడ ఎలాంటి ఫెయిర్ గేమ్ జరగడం లేదు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే రిఫరీ మాకు అగైనెస్ట్ గా ఉన్నాడు. అర్జెంటీనాపై మేము 2-0 తో గెలిచి బయటకు వెళ్లడం వారికి ఇష్టం లేదు, ఈ టోర్నమెంట్ మొత్తం ఫిక్స్ అయింది" అని జికో ఆరోపించాడు.
మెస్సి కన్నీళ్లు.. అర్జెంటీనా చారిత్రాత్మక కంబ్యాక్ విధ్వంసంమంగళవారం జరిగిన ఈ మ్యాచ్ లో చాలా సమయం వరకు 39 ఏళ్ల లియోనెల్ మెస్సి ఆడుతున్న లాస్ట్ వరల్డ్ కప్ లో అర్జెంటీనా దారుణంగా ఎగ్జిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈజిప్ట్ ప్లేయర్లు యాసర్ ఇబ్రహీం, మోస్తఫా జికో చెరో గోల్ కొట్టి అర్జెంటీనాను గట్టి దెబ్బకొట్టారు. వీఏఆర్ రివ్యూ లేకపోతే ఈజిప్ట్ 3-0 తో లీడ్ లో ఉండేది. 1958, 1962 లో బ్రెజిల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ లు గెలిచిన ఫస్ట్ టీమ్‌గా నిలవాలన్న అర్జెంటీనా ఆశలు దాదాపు క్లోజ్ అయినట్లే కనిపించాయి. కానీ 79వ నిమిషంలో డిఫెండర్ క్రిస్టియన్ రొమేరో హెడర్ ద్వారా ఫస్ట్ గోల్ కొట్టి అర్జెంటీనా ఫైట్‌బ్యాక్ స్టార్ట్ చేశాడు.
మెస్సి ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్.. ఆ తర్వాత 83వ నిమిషంలో కెప్టెన్ లియోనెల్ మెస్సి తన క్లాసిక్ షాట్ తో ఈ టోర్నమెంట్‌లో 8వ గోల్ సాధించాడు. ఈ గోల్ తో వరల్డ్ కప్ హిస్టరీలోనే తన ఓవరాల్ గోల్స్ సంఖ్యను 21 కి పెంచుకుని ఆల్ టైమ్ రికార్డును మరింత పటిష్టం చేసుకున్నాడు. స్కోరు 2-2 తో ఈక్వల్ అయిన తర్వాత మ్యాచ్ ఇంజరీ టైమ్ లో ఎంజో ఫెర్నాండెజ్ మైండ్ బ్లాకింగ్ విన్నింగ్ గోల్ కొట్టి అర్జెంటీనాకు 3-2 తో ఊహించని విక్టరీ అందించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే మెస్సి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈజిప్ట్ మ్యాచ్ లో అర్జెంటీనా లక్ నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయిందని, క్వార్టర్స్ లో వారి అటాకింగ్ గేమ్ మరింత డేంజరస్ గా మారబోతుందని తెలుస్తోంది.
