FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ 2022 క్వార్టర్ ఫైనల్ మ్యాచులో నెదర్లాండ్స్ పై అర్జెంటీనా విజయం సాధించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హోరాహోరీగా సాగిన మ్యాచులో నెదర్లాండ్స్ ను పెనాల్టీ షూటౌట్లో చిత్తు చేసి సెమీస్ లోకి అడుగుపెట్టింది అర్జెంటీనా. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో మెస్సీ జట్టు 2-2 (4-3)తో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. చివర్లో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో ​​మార్టినెజ్ నెదర్లాండ్ గోల్ ను అడ్డుకోవటంతో ఆ జట్టు 4-3తో విజయం సాధించింది.


ఈ మ్యాచులో లియోనల్ మెస్సీ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండు గోల్స్ చేసి తన జట్టును 2-0 తో ముందంజలో నిలిపాడు. అయితే అర్జెంటీనా గెలుపు ఖాయమనుకున్న సమయంలో నెదర్లాండ్స్ ఆటగాడు వౌట్ వెఘోర్స్ట్83 వ నిమిషం, 101 నిమిషంలో గోల్స్ చేసి.. నెదర్లాండ్స్ ను రేసులో నిలిపాడు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. 






హోరాహోరీగా పెనాల్టీ షూటౌట్


అదనపు సమయంలో కూడా రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో ​​మార్టినెజ్ అదరగొట్టాడు.ముందుగా నెదర్లాండ్స్ ఆటగాడు వర్జిల్ వాన్ డిజ్క్ వేసిన పెనాల్టీ గోల్ ను ఎమిలియానో మార్టినెజ్ ఆపాడు. ఆ తర్వాత మెస్సీ గోల్ చేయడంతో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ ప్రయత్నాన్ని ఎమిలియానో అడ్డుకున్నాడు. ఆ తర్వాత అర్జెంటీనా మరో గోల్ చేయడంతో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది.


ఇక, మూడో ప్రయత్నంలో గోల్ చేయడంలో నెదర్లాండ్స్ సఫలం అయింది. అర్జెంటీనా మూడో ప్రయత్నంలో కూడా సక్సెస్ అవ్వడంతో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్ ఆటగాడు వౌట్ వెఘోర్స్ట్ మరోసారి మెరవడంతో 3-2కి అర్జెంటీనా ఆధిక్యాన్ని తగ్గించింది. అయితే.. నాలుగో ప్రయత్నంలో అర్జెంటీనా గోల్ చేయడంలో విఫలం అయింది. అయితే.. నాలుగో ప్రయత్నంలో నెదర్లాండ్స్ మెరవడంతో 3-3 తో రెండు జట్లు మరోసారి సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే, ఆఖర్లో అర్జెంటీనా గోల్ కీపర్.. ఎమిలియానో మెరవడం.. డి జాంగ్ గోల్ చేయడంతో 4-3 తో విక్టరీ కొట్టి సెమీస్ కు దూసుకెళ్లింది అర్జెంటీనా.