ఫిఫా ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గ్రూప్-బిలో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో ఇరాన్‌పై 6-2తో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. బెల్లింగ్‌హాం, సాకా, గ్రీలిష్, స్టెర్లింగ్, రాష్‌ఫోర్డ్‌లు ఇంగ్లండ్ తరఫున హీరోలుగా నిలిచారు.
ఇంగ్లండ్ తరఫున బుకాయో సాకా రెండు గోల్స్ సాధించాడు. మార్కస్ రాష్‌ఫోర్డ్, జాక్ గ్రీలిష్, జూడ్ బెల్లింగ్‌హామ్, రహీం స్టెర్లింగ్‌లు తలో గోల్ కొట్టారు. ఇరాన్ తరఫున మెహదీ తరెమీనే రెండు గోల్స్ సాధించాడు. ఈ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ కొంచెం మందకొడిగా ఆరంభించింది. దీంతో వారిపై ఒత్తిడి పడింది.
ఎందుకంటే ఇంగ్లండ్ తన తర్వాతి మ్యాచ్‌ల్లో మరింత కఠినమైన ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంది. యునైటెడ్ స్టేట్స్, వేల్స్ వంటి జట్లతో ఇంగ్లండ్ తన తర్వాతి మ్యాచ్‌ల్లో తలపడాల్సి ఉంది. శుక్రవారం యునైటెడ్ స్టేట్స్‌తోనూ, నవంబర్ 29వ తేదీన వేల్స్ జట్టుతో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌లు ఉన్నాయి.
గతేడాది యూరోపియన్ చాంపియన్ షిప్‌లో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరింది. 55 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ ఒక పెద్ద టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఇది వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్‌కు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇంగ్లండ్ వరల్డ్ కప్ దాహం ఈ టోర్నీలో అయినా తీరుతుందేమో చూడాలి.
ఇక ఇరాన్ ఫిఫా వరల్డ్ కప్‌లో ఒక్కసారి యూరోపియన్ ప్రత్యర్థిని ఓడించలేదు. అలాగే ఫిఫా వరల్డ్ కప్‌లో ఆసియాకు చెందిన జట్టును ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు ఇది రెండోసారి మాత్రమే. 1982 వరల్డ్‌కప్‌లో మొదటిసారి ఇంగ్లండ్ ఒక ఆసియా జట్టును ఎదుర్కొంది. కువైట్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1-0తో విజయం సాధించింది.