Summer Games flame lit in ancient Olympia: ఒలింపిక్స్( Olympics) పుట్టిల్లుగా భావించే గ్రీస్( Paris) లోని ఒలింపియాలో  పారిస్ ఒలింపిక్స్  జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాన పూజారి పాత్రను పోషించిన  మేరీ మినా పురాతన క్రీడల ప్రదేశంలో  ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. ఈ వేడుక పారిస్ గేమ్స్ నిర్వాహకులు, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ  అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రసంగాల తర్వాత జరిగింది.ఇక 100 రోజుల కౌంట్ డౌన్ కు కూడా పారిస్  సిద్ధమైంది. బుధవారం నుంచి క్రీడల ఆరంభోత్సవానికి 100 రోజుల సమయం ఉంది. ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం ఫ్రాన్స్  దాదాపు 79 వేల 897 కోట్లు ఖర్చు చేస్తోంది. గత మూడు ఒలింపిక్స్   కంటే ఇదే తక్కువ. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ భారీ క్రీడోత్సవాల్లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.


తొలిసారి ఆరుబయట

అయితే ఒలింపిక్స్‌ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవాన్ని స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు పారిస్‌ సిద్ధమైంది. ఫ్రాన్స్‌లో ప్రవహించే సెన్‌ నది ఈ వేడుకలకు వేదిక కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే ఈ వేదికను మారుస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నదిలోనే నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. నదిలో 6 కిలోమీటర్ల దూరం పాటు సుమారు 10,500 మంది అథ్లెట్లు పడవల్లో పరేడ్‌ నిర్వహించనున్నారు. నదికి రెండు వైపుల ఉండి జులై 26న జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మొదట 6 లక్షల మంది ప్రజలను అనుమతించాలని అనుకున్నారు. 

 


సరికొత్త సాంప్రదాయం

వరల్డ్‌ అథ్లెటిక్స్‌(World Athletics) సరికొత్త సంప్రదాయానికి  శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌(Olympic) అథ్లెటిక్స్‌(Athletes)లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో 48 విభాగాల్లో పసిడి పతకాలు గెలిచే వారికి ప్రైజ్‌మనీ అందివ్వనున్నట్లు తెలిపింది. 2024 ఒలింపిక్స్‌లో భాగంగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగాల్లో పోటీపడి స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు నగదు బహుమానం కింద 50 వేల యూఎస్‌ డాలర్లు భారత కరెన్సీలో రూ.41.60 లక్షలు అందించేందుకు సిద్ధమైంది. ఇలా నగదు బహుమానాన్ని ప్రకటించిన తొలి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ(WA) నిలిచింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందజేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. ప్రోత్సాహకాలు అందించేందుకు గాను 2.4 మిలియన్ల యూఎస్‌ డాలర్లను ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వద్ద డిపాజిట్‌ చేసినట్టు తెలిపింది. 2028 లాస్‌ ఎంజేల్స్‌ ఒలింపిక్స్‌ నుంచి రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి కూడా ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.