FIR Against Hockey Player Varun Kumar: భారత హాకీ జట్టు(Indian hockey player) సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత(Arjuna Award) వరుణ్‌ కుమార్‌(Varun Kumar)పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరు(Bengaluru) పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఐదేళ్లుగా వరుణ్‌ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటకకు చెందిన ఓ యువతికి 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్‌ కుమార్‌ పరిచయమయ్యాడు. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. బెంగళూరులో హాకీ మ్యాచ్‌ల కోసం వచ్చినప్పుడు వరుణ్ కలిసేవాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గత ఐదేళ్లుగా వరుణ్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. బెంగళూరులోని శాయ్‌ స్టేడియానికి వచ్చిన సమయంలో వరుణ్‌ తనతో శృంగారంలో పాల్గొనేవాడని ఆరోపించారు. ప్రస్తుతం తన వయసు 22 ఏళ్లు అని తెలిపింది. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన వరుణ్‌.. పంజాబ్‌లోని జలంధర్‌లో నివసిస్తున్నాడు. అతడిని విచారించేందుకు కర్ణాటక పోలీసుల బృందం జలంధర్‌ వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్‌ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్‌.. జాతీయ జట్టులోనూ ఆడాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.


ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న దశలో..
గత ఒలింపిక్స్‌( Tokyo Olympics) లో కాంస్యం(bronze medallist) తో నవ శకానికి నాంది పలికిన భారత పురుషుల హాకీ జట్టు(Indian men's hockey Team) ఈసారి కూడా విశ్వ క్రీడల్లో సత్తా చాటాలని భావిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో కాంస్యాన్ని సాధించి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంతర్జాతీయ వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పురుషుల హాకీ జట్టు మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని చూస్తోంది. కానీ పారిస్‌ ( Paris )ఒలింపిక్స్‌ పురుషుల హాకీ జట్టుకు కఠినమైన డ్రా ఎదురుకావడం ఆందోళన కలిగిస్తోంది.


కఠినమైన గ్రూప్‌లో...
పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల హాకీలో భారత జట్టుకు కఠినమైన డ్రా ఎదురైంది. రాబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లో క్లిష్టమైన గ్రూప్‌ బి నుంచి భారత్‌ బరిలోకి దిగనుంది. ఈ గ్రూపులో ఒలింపిక్‌ ఛాంపియన్‌, ప్రపంచ నెంబర్‌ 2 బెల్జియం(Belgium ), రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అర్జెంటీనా, బలీయమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ జట్లు ఉన్నాయి. ఈ జట్లన్నింటినీ దాటి భారత్‌ సెమీస్‌ చేరాలంటే అంచనాలను మించి రాణించాల్సి ఉంది. గ్రూప్‌ ఎలో నెదర్లాండ్స్‌( Netherlands), జర్మనీ, బ్రిటన్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు దూసుకెళ్తాయి. భారత మహిళల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. జపాన్ చేతిలో ఓటమితో భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీ(Hockey Olympic Qualifiers)లో జపాన్ తో జరిగిన కీలక పోరులో 0-1 తేడాలో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. దాంతో క్వాలిఫయర్ టోర్నీలో నాలుగో స్థానానికి పరిమితమైన మహిళల జట్టు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించలేదు.