ప్రపంచవ్యాప్తంగా ఫిపా వరల్డ్‌ కప్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాచ్‌ షెడ్యూల్‌ విడుదలైన మరుక్షణం నుంచే చాలా దేశాల్లో సాకర్‌ ఫీవర్‌ మొదలైపోతోంది. అయితే కేవలం మ్యాచ్‌లో స్టన్నింగ్‌ గోల్స్‌కు మాత్రమే కాదు.. షాకింగ్‌ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ కేర్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. విజయాలతో పాటు వివాదాలకు దారి తీసిన సందర్భాలు చరిత్రలో చాలా మిగిలిపోయాయి. అలా ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోయిన వివాదాలు, నిరసనలు చాలానే ఉన్నాయి. అంతేదుకు.. తాజాగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ 2022 కూడా గందరగోళం నెలకొంది. 


ఇదే విషయం మరింత ముదిరితే మాత్రం టోర్నమెంట్ మధ్యలో 7 దేశాలు ప్రపంచ కప్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. వన్ లవ్ ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగితే తమ ఆటగాళ్లు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుట్‌బాల్ అత్యున్నత సంస్థ FIFA-7 యూరోపియన్ దేశాలను హెచ్చరించింది. ఏడు యూరోపియన్ దేశాలలో జర్మనీ కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసింది. జపాన్‌తో మ్యాచ్‌కు ముందు తీసిన గ్రూప్ ఫొటోలో ఆ జట్టు ఆటగాళ్లు నోరు మూసుకుని ఫోటోలకు ఫోజు ఇచ్చారు. ఆటగాళ్లతో పాటు జర్మనీ మంత్రి నాన్సీ ఫీజర్ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఆమె ‘వన్ లవ్ ఆర్మ్‌బ్యాండ్’ ధరించి మ్యాచ్ చూడటానికి స్టేడియానికి చేరుకుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇలా గతంలో కూడా చాలానే నినాదాలు, వివాదాలు జరిగి, ఏకంగా టోర్నీలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. 


అలాంటి ఓ వివాదమే.. ఉరుగ్వే 1934 ఇటలీలో జరిగి, ఏకంగా పోటీని బహిష్కరించారు అప్పటి ఫీఫా అధికారులు. ఇక 1966లో జరిగిన ఏకైక ప్రపంచకప్‌ను యావత్‌ ఆఫ్రికా ఖండం బహిష్కరించింది. 16-జట్లు ఫైనల్స్‌కు లైనప్‌లో యూరప్ నుండి 10 జట్లు, ఆతిథ్య ఇంగ్లాండ్‌తో సహా, లాటిన్ అమెరికా నుండి నాలుగు, సెంట్రల్ అమెరికన్, కరేబియన్ ప్రాంతం నుండి ఒకటి ఉండాలని ఫిఫా నిర్ణయించింది. ఫైనల్స్‌ ముగిసిన రెండు సంవత్సరాల తర్వాత, ఆఫ్రికాకు ప్రపంచ కప్ స్థానాన్ని అందజేయాలని అది ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఆసియాకు కూడా ఒకటి లభించి, బహిష్కరణ పని చేసింది. ఇక 2002లో రికార్డు స్థాయిలో అయిదో ప్రపంచకప్‌ను సాధించాక సాంబా జట్టు మళ్లీ కప్పు నెగ్గలేదు. 


2014లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లోనూ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే గత రెండేళ్లలో బ్రెజిల్‌ ఫామ్‌ను బట్టి చూస్తే ఈసారి కప్పు గెలిచే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. నాకౌట్‌లో తడబడే బలహీనతను అధిగమిస్తే ఆ జట్టు 20 ఏళ్ల విరామం తర్వాత కప్పు గెలవొచ్చు. బ్రెజిల్‌ తర్వాత ఎక్కువ అవకాశాలున్నది అర్జెంటీనాకే. 2014లో జట్టును టైటిల్‌కు అత్యంత చేరువగా తీసుకెళ్లిన మెస్సి తనకు చివరిదిగా భావిస్తున్న ప్రపంచకప్‌లో కల నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తానడంలో సందేహం లేదు. అయితే 2014 FIFA ప్రపంచ కప్‌కు ప్రతిస్పందనగా అనేక బ్రెజిలియన్ నగరాల్లో బహిరంగ ప్రదర్శనలు జరిగాయి. సామాజిక ప్రాజెక్టులు, గృహనిర్మాణాల కంటే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లకే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1974వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ ప్రపంచ కప్ సాకర్‌లో చిలీతో ఆడేందుకు నిరాకరించింది. గతంలో మరణశిక్షల కోసం ఉపయోగించిన చిలీ వేదిక వద్ద ప్రపంచ కప్ ప్లేఆఫ్ గేమ్ ఆడేందుకు నిరాకరించింది. 


దీంతో FIFA వారిని టోర్నీ నుండి నిషేధించింది. చిలీని అదే స్టేడియంలో నిర్ణీత సమయంలో మ్యాచ్‌కు హాజరు కావడానికి అనుమతించింది.  బంతిని ఖాళీ నెట్‌లోకి దూర్చి, 1-0 విజేతలుగా ప్రకటించింది. తద్వారా చిలీకి డిఫాల్ట్‌గా ప్రపంచకప్ అర్హత లభించింది. ఇక అర్జెంటీనా హోస్ట్ చేసిన 1978 ఎడిషన్‌ను ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ సంఘటనలు కప్పిపుచ్చినందున వివాదమైంది. 1976లో సైనిక తిరుగుబాటుకు గురైంది. అర్జెంటీనా- నెదర్లాండ్స్ మధ్య జరిగిన పెద్ద ఈవెంట్ ముగింపు సందర్భంగా డచ్ జట్టు మ్యాచ్ తర్వాత వేడుకలను విస్మరించింది.