Delhi Capitals Women vs Gujarat Giants, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓ మోస్తరు స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ (57: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), యాష్లే గార్డ్‌నర్ (51 నాటౌట్: 33 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జెయింట్స్‌కు బ్యాటింగ్‌కు దిగింది. అయితే మొదటి ఓవర్లోనే సోఫీ డంక్లే (4: 6 బంతుల్లో) వికెట్ తీసి మారిజానే కాప్ గుజరాత్‌కు షాక్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత హర్లీన్ డియోల్ (31: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు), లారా వోల్వార్డ్ట్ (57: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కానీ పరుగుల వేగం మాత్రం నెమ్మదించింది. హర్లీన్ డియోల్ నిదానంగా ఆడటంతో స్కోరు నత్తనడకన సాగింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 47 బంతుల్లో 49 పరుగులు జోడించారు.
హర్లీన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన యాష్లే గార్డ్‌నర్ (51 నాటౌట్: 33 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) వేగంగా ఆడింది. మెల్లగా లారా వోల్వార్డ్ట్ కూడా దూకుడు పెంచడంతో స్కోరు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక లారా అవుట్ అయింది. కానీ యాష్లే దూకుడు తగ్గించకపోవడంతో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
తుది జట్లు
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, లారా, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అశ్వనీ, స్నేహ రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మాన్సీ జోషీ
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మారిజానె కాప్, జెస్ జొనాసెన్, అరుంధతీ రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్