DC vs RR live score:20 ఓవర్లకు రాజస్థాన్ 121-6; 33 పరుగుల తేడాతో ఓటమి
ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఢిల్లీ, ముంబై రెండు జట్లు గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదున్నాయి.
అవేశ్ ఖాన్ 11 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని సంజు శాంసన్ (70; 53 బంతుల్లో 8x4, 1x6) అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. తబ్రైజ్ శంషీ (2*) అతడికి తోడుగా నిలిచాడు. దిల్లీ 33 పరుగుల తేడాతో విజయం అందుకుంది.
రబాడా 9 పరుగులు ఇచ్చాడు. రెండు వైడ్లు వేశాడు. రెండో బంతిన సంజు (60) బౌండరీకి పంపించాడు. శంషీ (1) అతడికి తోడుగా ఉన్నాడు.
నార్జ్ కేవలం 2 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. సంజు (53) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. శంషీ (1) క్రీజులోకి వచ్చాడు.
నార్జ్ వేసిన 17.2వ బంతికి తెవాతియా (9; 15 balls) ఔటయ్యాడు. హెట్‌మైయిర్ క్యాచ్ అందుకున్నాడు.
అవేశ్ ఖాన్ రంగంలోకి దిగాడు. ఎనిమిది పరుగులు ఇచ్చాడు. సంజు (52) అర్ధశతకం సాధించాడు. తెవాతియా (9) షాట్లకు ప్రయత్నించినా బాల్ మిడిల్ అవ్వడం లేదు.
అక్షర్ పటేల్ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. సంజు (48) బౌండరీ బాదాడు. అర్ధశతకానికి చేరువయ్యాడు. తెవాతియా (10) అతడికి తోడుగా ఉన్నాడు.
రబాడా 14 పరుగులు ఇచ్చాడు. సంజు శాంసన్ (41) మూడు బౌండరీలు బాదాడు. తెవాతియా (4) అతడికి తోడుగా ఉన్నాడు.
ఆన్రిచ్ నార్జ్ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని శాంసన్ (28) బౌండరీకి పంపించాడు. రాహుల్ తెవాతియా (3) నిలకడగా ఆడుతున్నాడు.
అశ్విన్ ఈ ఓవర్లో 3 పరుగులు ఇచ్చాడు. సంజు శాంసన్ (20) ఒత్తిడిలో ఉన్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆశతో ఆడుతున్నాడు. రాహుల్ తెవాతియా (2) అతడికి తోడుగా ఉన్నాడు.
అక్షర్ పటేల్ ఏడు పరుగులు ఇచ్చి రియాన్ పరాగ్ (2; 7 balls) ను ఔట్ చేశాడు. రాహుల్ తెవాతియా (1) క్రీజులోకి వచ్చాడు. సంజు (20) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
రబాడ ఈ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి వికెట్ తీశాడు. రియాన్ పరాగ్ (1) క్రీజులోకి వచ్చాడు. సంజు శాంసన్ (15) నిలకడగా ఆడుతున్నాడు.
రబాడ వేసిన 10.2వ బంతికి మహిపాల్ లోమ్రర్ (19; 24 balls 1x6) ఔటయ్యాడు. దాంతో రాజస్థాన్ 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
అక్షర్ ఐదు పరుగులు ఇచ్చాడు. మహిపాల్ (10), సంజు శాంసన్ (15) ఆచితూచి ఆడుతున్నారు.
అశ్విన్ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని మహిపాల్ (16) సిక్సర్‌గా మలిచాడు. సంజు (13) సమయోచితంగా ఆడుతున్నాడు.
అక్షర్ రంగంలోకి దిగాడు. కేవలం ఆరు పరుగులు ఇచ్చాడు. సంజు (12), మహిపాల్ (8) ఆచితూచి ఆడారు.
అశ్విన్ ఏడు పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని సంజు (10) బౌండరీకి తరలించాడు. మహిపాల్ (5) అతడికి అండగా ఉన్నాడు.
కాగిసో రబాడా వచ్చాడు. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. శాంసన్ (5), మహిపాల్ (3) క్రీజులో ఉన్నారు. పరుగులు చేసేందుకు కష్టపడుతున్నారు.
అశ్విన్ వేసిన ఈ ఓవర్లో కేవలం రెండు పరుగులే వచ్చాయి. డేవిడ్ మిల్లర్ ఔటయ్యాడు. మహిపాల్ లోమ్రర్ (2), సంజు శాంసన్ (4) క్రీజులో ఉన్నారు. వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంది.
యాష్ వేసిన 4.2వ బంతికి డేవిడ్ మిల్లర్ (7; 10 బంతుల్లో) ఔటయ్యాడు. అడుగు ముందుకు వేసిన అతడిని పంత్ స్టంపౌట్ చేశాడు. దీంతో 17 పరుగులకే రాజస్థాన్ 3 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది.
నార్జ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. సంజు శాంసన్ (4) త్రుటిలో ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. మిల్లర్ (7) అతడికి తోడుగా ఉన్నాడు.
అవేశ్ ఖాన్ కేవలం 4 పరుగులే ఇచ్చాడు. సంజు (3), మిల్లర్ (6) ఆచితూచి ఆడుతున్నారు.
ఆన్రిచ్ నార్జ్ సైతం అద్భుతం చేశాడు. తొలి బంతికే యశస్వీ జైశ్వాల్ (5; 4 balls)ను ఔట్ చేశాడు. ఈ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. మిల్లర్ (4), సంజుశాంసన్ (1) క్రీజులో ఉన్నారు.
ఆన్రిచ్ నోర్జే మొదటి బంతికే జైస్వాల్‌ను అవుట్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా.. పంత్ రివ్యూకి వెళ్లి వికెట్ సాధించాడు.
యశస్వి జైస్వాల్ (సి) రిషబ్ పంత్ (బి) ఆన్రిచ్ నోర్జే 5(4)
అవేశ్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో రాజస్తాన్ బ్యాట్స్‌మన్ ఆరు పరుగులు సాధించారు. ఆఖరి బంతికి లియామ్ లివింగ్ స్టోన్ అవుటయ్యాడు. ఓవర్ ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 6-1గా ఉంది.
యశస్వి జైస్వాల్ 5(3)
అవేశ్ ఖాన్ 1-0-6-1
లియామ్ లివింగ్ స్టోన్ (సి) రిషబ్ పంత్ (బి) అవేశ్ ఖాన్ 1(3)
ముస్తాఫిజుర్ తొమ్మిది పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క బౌండరీ రాలేదు. అశ్విన్ (6), లలిత్ (14) డబుల్స్ తీశారు.
చేతన్ సకారియా ఈ ఓవర్లో ఒక వికెట్ తీసి పది పరుగులు ఇచ్చాడు. అశ్విన్ (1), లిలిత్ యాదవ్ (12) నిలకడగా ఆడుతున్నారు.
చేతన్ సకారియా వేసిన 18.2వ బంతిని భారీ షాట్ ఆడబోయి అక్షర్ పటేల్ (12; 7b 1x6) ఔటయ్యాడు.
కార్తీక్ త్యాగీ 11 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని లలిత్ యాదవ్ (10) బౌండరీగా మలిచాడు. అక్షర్ పటేల్ (6) ఆచితూచి ఆడుతున్నాడు.
ముస్తాఫిజుర్ వేసిన ఈ ఓవర్లో కేవలం 4 పరుగులే వచ్చాయి. అక్షర్ పటేల్ (2), లలిత్ యాదవ్ (5) క్రీజులో ఉన్నారు.
ముస్తాఫిజుర్ వేసిన 16.3వ బంతికి హెట్‌మైయిర్ (28; 16b 5x4) ఔటయ్యాడు. చేతన్ సకారియాకు క్యాచ్ ఇచ్చాడు.
కార్తీక్ త్యాగా 16 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో హెట్‌మైయిర్ (28) రెచ్చిపోయాడు. మొత్తం మూడు బౌండరీలు కొట్టాడు. లలిత్ యాదవ్ (3) అతడికి తోడుగా ఉన్నాడు.
సకారియా 12 పరుగులు ఇచ్చాడు. హెట్‌మైయిర్ (15) రెండు బౌండరీలు బాదాడు. లలిత్ యాదవ్ (2) నిలకడగా ఆడుతున్నాడు.
తెవాతియా కేవలం రెండు పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. హెట్‌మైయిర్ (4), లలిత్ యాదవ్ (1) క్రీజులో ఉన్నారు.
తెవాతియా వేసిన 13.2 బంతికి శ్రేయస్ అయ్యర్ 43(32b, 1x4, 2x6 ) ఔటయ్యాడు. బంతిని ముందుకు దూకి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు.
తెవాతియా వేసిన 13.2 బంతికి శ్రేయస్ అయ్యర్ 43(32b, 1x4, 2x6 ) ఔటయ్యాడు. బంతిని ముందుకు దూకి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు.
శంషీ ఈ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ (43) అర్ధశతకానికి చేరువయ్యాడు. హెట్‌మైయిర్ (3) అతడికి తోడుగా ఉన్నాడు.
ముస్తాఫిజుర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన బ్రేక్ ఇచ్చాడు. రిషభ్ పంత్‌ను ఔట్ చేశాడు. అయ్యర్ (39) దూకుడుగా ఆడుతున్నాడు. హెట్‌మైయిర్ (1) క్రీజులోకి వచ్చాడు.
ముస్తాఫిజుర్ వేసిన 11.4వ బంతికి రిషభ్ పంత్ (24; 24 బంతుల్లో 2x4) ఔటయ్యాడు. బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు.
శంషీ 13 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని అయ్యర్ (38 ) కళ్లు చెదిరే సిక్సర్‌గా మలిచాడు. రిషభ్ పంత్ (21) అతడికి తోడుగా ఉన్నాడు.
తెవాతియా బౌలింగ్ చేశాడు. పది పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని అయ్యర్ (27) అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. పంత్ (19) షాట్లకు ప్రయత్నిస్తున్నాడు.
శంషీ బౌలింగ్ చేశాడు. తొమ్మిది పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని రిషభ్ పంత్ (17) స్వీప్ చేశాడు. చక్కని బౌండరీ బాదాడు. శ్రేయస్ (19) నిలకడగా ఆడాడు. అతడు షాట్లు ఆడకుండా బౌలింగ్ చేస్తున్నారు. బంతి బ్యాటు మీదకు రావడం లేదు.
రాహుల్ తెవాతియా బౌలింగ్‌కు దిగాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. పంత్ (12), అయ్యర్ (15) నిలకడగా ఆడుతున్నారు. షాట్ల కోసం ప్రయత్నిస్తున్నా రాజస్థాన్ తెలివిగా బౌలింగ్ చేస్తోంది.
శంషీ బౌలింగ్‌కు దిగాడు. కేవలం ఆరు సింగిల్స్ ఇచ్చాడు. శ్రేయస్ (12), పంత్ (10) ఆచితూచి ఆడారు.
పవర్ ప్లే ముగిసింది. కార్తీక్ త్యాగీ 11 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని శ్రేయస్ (9), నాలుగో బంతిని పంత్ (7) బౌండరీకి పంపించారు.
చేతన్ సకారియా 4 పరుగులిచ్చి వికెట్ తీశాడు. రిషభ్ పంత్ (2) క్రీజులోకి వచ్చాడు. శ్రేయస్ (4) నిలకడగా ఆడుతున్నాడు.
చేతన్ సకారియా వేసిన 4.1వ బంతికి పృథ్వీ షా (10; 12 బంతుల్లో) ఔటయ్యాడు. లియామ్ లివింగ్‌స్టన్ క్యాచ్ అందుకున్నాడు.
ఈ ఓవర్లో కార్తీక్ త్యాగీ కేవలం 3 పరుగులు ఇచ్చి కీలకమైన ధావన్‌ను ఔట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ (2) క్రీజులోకి వచ్చాడు. పృథ్వీ షా (10) ఆచితూచి ఆడుతున్నాడు.
కార్తీక్ త్యాగీ అద్భుతం చేశాడు. అందుకున్న తొలి బంతికే శిఖర్ ధావన్ (8; 8 బంతుల్లో 1x4)ను ఔట్ చేశాడు.
చేతన్ సకారియా బౌలింగ్‌కు వచ్చాడు. తెలివిగా బంతులు వేశాడు. వేగం తగ్గించడంతో దిల్లీ ఓపెనర్లు బౌండరీలు కొట్టలేకపోయారు. ఆఖరి మూడు బంతులకు పృథ్వీ షా (10) డబుల్స్ తీశాడు. ధావన్ (8) అతడికి తోడుగా ఉన్నాడు.
సంజు శాంసన్ రెండో ఓవర్లోనే స్పిన్‌ను పరిచయం చేశాడు. మహిపాల్ లోమ్రర్ బౌలింగ్‌కు వచ్చాడు. కేవలం 5 పరుగులే ఇచ్చాడు. మొదటి బంతిని శిఖర్ ధావన్ (7) అద్భుతమైన బౌండరీ బాదాడు. కానీ ఆ తర్వాత ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పృథ్వీ షా (4) అతడికి తోడుగా ఉన్నాడు.
తొలి ఓవర్‌ను ముస్తాఫిజుర్ వేశాడు. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. శిఖర్ ధావన్ (2), పృథ్వీ షా (4) నిలకడగా ఆడారు. షాట్లు ఆడేందుకు తొందరపడలేదు.
టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దిల్లీని బ్యాటింగ్‌కు పంపించింది.
Background
ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌లో యూఏఈలో మధ్యాహ్నం జరగనున్న మొదటి మధ్యాహ్నం మ్యాచ్ ఇదే. ఢిల్లీ, ముంబై రెండు జట్లు గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదున్నాయి. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ను 12 బంతుల్లో 8 పరుగులు చేయనివ్వకుండా కట్టడి చేసి రాజస్తాన్ విజయం సాధించింది. దీంతో రాజస్తాన్ మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది.
ఢిల్లీని దెబ్బకట్టడం కష్టమే..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపు మీద ఉంది. ఆన్రిచ్ నోర్జే, కగిసో రబడలు బంతితో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నారు. మార్కస్ స్టాయినిస్ గాయం నుంచి కోలుకుని తిరిగొస్తాడో లేదో చూడాలి. ఢిల్లీలో పృథ్వీ షా, ధావన్, శ్రేయస్ అయ్యర్, పంత్, స్టాయినిస్, హెట్‌మేయర్ ఇలా అందరూ ఫాంలో ఉన్నారు.
రాజస్తాన్ ఆత్మవిశ్వాసంతో..
గత మ్యాచ్‌లో పంజాబ్‌పై అద్భుత విజయం సాధించి రాజస్తాన్ కూడా పోటీకి ఢీ అంటోంది. రాజస్తాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్‌లో కొన్ని లోపాలున్నా విజయాలు సాధించే జట్టు కూర్పును మార్చే అవకాశం అయితే లేదు. ఇక రాజస్తాన్‌లో ఆకట్టుకుంటున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఎవిన్ లూయిస్, సంజు శామ్సన్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి బ్యాట్స్‌మన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి వంటి బౌలర్లు ఉన్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -