CSK vs RCB Toss Update: ఐపీఎల్ 2024 మహా సంగ్రామానికి తెర లేచింది. సీజన్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో హోం గ్రౌండ్‌లో చెన్నై ఛేజింగ్ చేయాల్సి ఉంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దురదృష్టవశాత్తూ మొదటి మ్యాచ్‌లోనే టాస్ కోల్పోయాడు.
చెపాక్ మైదానంలో స్క్వేర్ బౌండరీస్ 65 మీటర్లు, 66 మీటర్లుగా ఉన్నాయి. స్ట్రయిట్ బౌండరీ పొడవు 80 మీటర్లు. వికెట్ చూడటానికి చాలా మంచిగా ఉంది. కానీ అక్కడక్కడ కొన్ని క్రాక్స్ ఉన్నాయి. దీని వల్ల బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్లకు పిచ్ నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. తేమ కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ ట్రోఫీని ఓపెనింగ్ సెరెమోనీలో స్టేజీపైకి తీసుకువచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ఫ్లెసిస్‌కు కూడా చెన్నై ఆడియన్స్ నుంచి మంచి స్వాగతం లభించింది.
మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయ్యాక అతడి కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మునుపటిలా రాణిస్తుందా లేదా అనే ప్రశ్న అభిమానులతో పాటు క్రికెట్ నిపుణుల మదిలో కూడా మెదులుతోంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత టైటిల్ రేసులో చెన్నై బలమైన పోటీదారుగా నిలవడం విశేషం.
ఐపీఎల్ 2023 సీజన్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అనుభవానికి ఏమాత్రం కొదవ లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌ను డాడీస్ ఆర్మీ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి సీనియర్ల విషయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రెజర్ సిట్యుయేషన్లలో మైదానంలో ఎలా ఉంటాడో మాత్రం చూడాలి.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే
చెన్నై సూపర్ కింగ్స్ సబ్స్
శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, షేక్ రషీద్, నిశాంత్ సింధు, మొయిన్ అలీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సబ్స్
యష్ దయాళ్