Samantha Comments on Citadel Shooting: స్టార్‌ హీరోయిన్‌ సమంత రీఎంట్రీకి ముందు పోడ్‌కాస్ట్‌తో ఫ్యాన్స్‌ ముందుకి వచ్చింది. దీని ద్వారా  ప్రజల్లో హెల్త్ అవేర్ నెస్ పెంచుతుంది. ఈ క్రమంలో తాజాగా సమంత తన సిటాడెల్‌ షూటింగ్‌లో మూర్చపోయానంటూ షాకింగ్‌ విషయం చెప్పింది. కాగా మయోసైటిస్‌ బారిన పడ్డ ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే మరోపక్క యశోద, శాకుంతలం, అలాగే యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ చిత్రాల షూటింగ్‌ పూర్తి కాగానే లాంగ్‌ బ్రేక్‌ తీసుకుంది.


మయోసైటిస్‌ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన ఆమె అక్కడ తరచూ మెడిటేషన్‌, యోగా చేస్తున్న ఫోటోలను  షేర్‌ చేసేది. ఇటీవల రీఎంట్రీకి సిద్ధమైన సమంత ఈ గ్యాప్‌లో తన సొంత పోడ్‌కాస్ట్‌తో హెల్త్‌ అవేర్‌నెస్‌ పెంచుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా తన మూడో ఎపిసోడ్‌ రిలీజ్‌ చేసింది.ఇందులో తన వెల్‌నెస్ కోచ్ అల్కేష్ షరోత్రితో కలిసి ఈ ఎపిసోడ్‌లో పాల్గోంది. తన ఆటో ఇమ్యూన్‌ డిసిజ్‌ మయోసైటిస్ వల్ల సిటాడెల్‌ షూటింగ్‌లో తనకు ఎదురైన ఆరోగ్య సమస్యలపై చర్చించింది.






సెట్ లో మూర్చపోయాను


యాక్షన్‌ సిరీస్‌. ఇందులో సమంత కూడా పలు యాక్షన్స్‌ సీన్స్‌లో నటించింది. ముఖ్యంగా సెకండ్‌ షెడ్యూల్‌లో మొత్తం యాక్షన్‌ సీక్వెన్సే ఉన్నాయి. ఓ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు యాక్షన్‌ సన్నివేశాలు చేశాం. ఆ టైం నాలో శక్తి నశించడంతో వీక్‌ అయిపోయాను.  అప్పుడు షూటింగ్‌ సెట్‌లో నేను ఒక్కసారిగా మూర్చపోయాను. అప్పుడు సెట్‌లో అంతా గందరగోళ వాతావరణం నెలకొంది. అదే నా చివరి రోజు అనుకున్నాను. దాంతో డైరెక్టర్‌, మిగతా టీం అంతా ఆందోళనకు గురయ్యారు" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. మయోసైటిస్‌ వంటి అరుదైన వ్యాధితో బాధపడుతూ కూడా ఇలాంటి యాక్షన్‌ సీక్వెన్స్‌ చేసిన ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్‌ అంటున్నారు.


'అందువల్లే మీరు స్టార్ హీరోయిన్ అయ్యారు'


ఈ విషయంలో సమంత ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి అని ప్రశంసలు కురిపిస్తున్నారు. శారీరక సమస్యలతో పోరాడుతూనే మరోవైపు షూటింగ్‌ కంప్లీట్‌ చేయడం అది సమంత చెల్లిందని, అందుకే ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిన.. ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతుందంటూ నెటిజన్లు ఆమెను కొనియాడుతున్నారు. కాగా అమెరికన్ యాక్షన్‌ వెబ్ సిరీస్‌ అయినా సిటాడెల్‌ను అదే పేరుతో ఇండియన్‌ వెర్షన్‌లో తెరకెక్కించారు బాలీవుడ్‌ దర్శక దిగ్గజాలు రాజ్ అండ్‌ డీకే.  అమెరికన్ వెబ్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్‌లో నటించింది. ఈ రీమేక్‌లో ప్రియాంక చోప్రా పాత్రను సమంత పోషించింది. రాజ్ అండ్‌ డీకేలు దర్శకత్వం వహిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తిగాక ప్రస్తుతం ప్రమోషన్స్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది టీం. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైంలోకి రానుంది. అతిత్వరలోనే ఈ సిరీస్‌ రిలీజ్‌ డేట్‌ను ఆ సంస్థ ప్రకటించనుంది.