టీమిండియా ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్య ఎంతటి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడో ఈ మధ్య సోషల్ మీడియాలో అతడు పోస్టు చేసిన ఫొటోల ద్వారానే తెలుస్తోంది. తాజాగా అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటోల్లో తన వాచ్‌ని కూడా చూపించాడు.
ఇప్పుడు ఈ వాచ్ గురించే అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ వాచ్ అంత స్పెషల్ మరి. ఈ వాచ్ కాస్ట్ తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత విలువైన వాచ్‌ల్లో ఇదొకటి అంట.
IPL పుణ్యమా అని పాండ్యా సోదరులు(హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య) బాగా సంపాదించారు. వీరిద్దరూ ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీకే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ ముంబయి ఇండియన్స్ జట్టులో చేరడంతో ఒక్కసారిగా వీరి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయింది. లగ్జరీ ఫ్లాట్లు, విలాసవంతమైన జీవన శైలి, విలువైన కార్లు, బ్రాండెడ్ వస్తువులను కొనడంలో ఏమాత్రం వెనకాడటం లేదు.
హార్దిక్ పాండ్య... పటేక్ ఫిలిప్పీ నాటిలస్ ప్లాటినమ్ 5711 అనే బ్రాండెడ్ వాచ్‌ను కొనుగోలు చేశాడు. ఈ వాచీ డయల్ చుట్టూ అత్యంత అరుదైన 32 గ్రీన్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. వాచ్ మొత్తం ప్లాటినంతో తయారైంది. దీని ధర రూ.5 కోట్ల పైమాటే అంట. 5711 రేంజ్ అరుదైన బ్రాండ్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచీల్లో ఇదొకటి. ఈ వాచ్ పెట్టుకుని దిగిన ఫొటోలను పాండ్య సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఇప్పుడు ఇది వైరల్ అయ్యింది.
ప్రస్తుతం హార్దిక్ పాండ్య దుబాయ్‌లో ఉన్నాడు. IPL - 2021 మిగతా సీజన్ కోసం దుబాయ్ చేరుకున్నాడు. సెప్టెంబరు 19 నుంచి IPL తిరిగి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.