Zimbabwe vs Gambia Zimbabwe Cricket Team Sets Record Highest Total T20 History | టీ20 క్రికెట్ లో జింబాబ్వే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. పొట్టి ఫార్మాట్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా జింబాబ్వే నిలిచింది. నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్ మ్యాచ్ లో ఈ అద్భుతం జరిగింది. గ్రూప్ బి లో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. 


జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. సికందర్ రాజా 43 బంతుల్లో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 15 సిక్సర్లు, 7 ఫోర్లతో గాంబియాపై సికిందర్ రజా విధ్వంసంకర ఇన్నింగ్స్ ఆడటంతో జింబాబ్వే 344 రన్స్ చేసింది. తద్వారా జింబాబ్వే ఐసీపీ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది.






ఇంటర్నేషనల్ T20 క్రికెట్లో టాప్ 10 అత్యధిక స్కోర్లు ఇవే
1. జింబాబ్వే: 344/4 వర్సెస్ గాంబియా - 2024
2. నేపాల్: 314/3 వర్సెస్ మంగోలియా - 2023
3. భారత్: 297/6 వర్సెస్ బంగ్లాదేశ్ - 2024
4. జింబాబ్వే: 286/5 వర్సెస్ సీషెల్స్ - అక్టోబర్ 2024
5. ఆఫ్ఘనిస్తాన్: 278/3 వర్సెస్ ఐర్లాండ్ - 2019
6. చెక్ రిపబ్లిక్: 278/4 వర్సెస్ టర్కీ - 2019
7. మలేషియా: 268/4 వర్సెస్ థాయిలాండ్ - 2023
8. ఇంగ్లాండ్: 267/3 వర్సెస్ వెస్టిండీస్ - 2023
9. ఆస్ట్రేలియా: 263/3 వర్సెస్ శ్రీలంక - 2016
10. శ్రీలంక: 260/6 వర్సెస్ కెన్యా - 2007