IND vs NZ Pune Test: బుధవారం నుంచి పూణెలో భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. పూణె టెస్టు సందర్భంగా టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు. కేఎల్ రాహుల భవిష్యత్ సహా మీడియా అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ప్రస్తుతం ఫామ్ లేని కేఎల్ రాహుల్ అనేకే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతే కాకుండా ఆయన భవిష్యత్‌పై కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రెండో టెస్టు ఆయన్ని ఆడిస్తారా లేకుంటే రాహుల్ ప్లేస్‌లో వేరే ఆటగాడిని తీసుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయాలనే గంభీర్‌ను మీడియా అడిగింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్‌కు టీమిండియా అండగా ఉంటుందని గౌతీ చెప్పారు. కాన్పూర్‌లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేశాడు. బెంగళూరు టెస్టులో రాహుల్ ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడని అన్నారు.
న్యూజిలాండ్‌తో ఆడితే 11 మంది టీమిండియా ఆటగాళ్లను సోషల్ మీడియా డిసైడ్ చేయబోదన్నారు" మేము ఆడే జట్టులో 11 మందిని సోషల్ మీడియా డిసైడ్ చేయదు. అందుకే సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారు, ఏం అంచనాలతో ఉన్నారనే విషయాలు మాకు ముఖ్యం కాదు. టీం యాజమాన్యం ఏమనుకుంటుందనేదేముఖ్యం. అతను (కేఎల్‌రాహుల్) కాన్పూర్‌లో కఠినమైన పిచ్‌లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మంచి స్కోర్ చేయాలని కసి ఉంది. అతనికి మేనేజ్‌మెంట్ మద్దతు కూడా ఉంది.
కాన్పూర్ టెస్టులో అర్థ శతకం చేసిన రాహుల్
బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మధ్య బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కాన్పూర్ టెస్టులో 68 పరుగులు చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావించిన గంభీర్ రేపటి టెస్టులో రాహుల్ ఉంటాడో లేదో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
పిచ్‌ను రాహుల్ ఎందుకు ముద్దాడినట్టు?
బెంగళూరులో మొదటి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత గ్రౌండ్‌ను వీడుతున్న టైంలో రాహుల్ చేసిన ఓ చర్య అనుమానాలకు తావిస్తోంది. తోటి ప్లేయర్లతో పెవిలియన్‌కు వస్తున్నప్పుడు పిచ్‌ను ముద్దాడాడు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన మదిలో రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి.
టెస్టుల్లో 8 సెంచరీలు చేసిన రాహుల్
టీమిండియా తరఫున ఆడిన అన్ని ఫార్మాట్‌లో రాహుల్ తన సత్తా చాటుకున్నాడు. ఇప్పటి వరకు 53 టెస్టుల్లో రాహుల్ ఆడాడు. 8 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు చేశాడు. మొత్తంగా 2981 రన్స్ చేశాడు. 199 పరుగులే టెస్టుల్లో రాహుల్ అత్యధిక స్కోరు
Also Read: టీం ఇండియా డైనమిక్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ లవ్ స్టోరీ తెలుసా మీకు