Zaheer Khan joins LSG as team mentor: టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్(Zaheer Khan) నూతన బాధ్యతలు స్వీకరించాడు. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మెంటార్‌గా జహీర్ ఖాన్ నియమితుడయ్యాడు. గౌతమ్ గంభీర్ స్థానంలో జహీర్ నూతన పాత్ర పోషించనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కు ముందు మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్... లక్నో సూపర్ జెయింట్స్‌తో జత కట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
విలేకరుల సమావేశంలో పాల్గొన్న లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా జహీన్ ఖాన్ తమ మెంటార్‌గా కొనసాగుతారాని ప్రకటించారు. ఎందరో క్రీడాకారులకు జహీర్ మార్గ నిర్దేశనం చేశారని.. ఇప్పుడు తమ జట్టుకు మెంటార్‌గా ఉంటారని ప్రకటించారు. 2024లో మెంటార్‌గా గౌతమ్ గంభీర్ వైదొలిగినప్పటి నుంచి లక్నో జట్టులో మెంటార్ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు దానిని జహీర్‌ఖాన్‌తో భర్తీ చేశారు.
జహీర్ ముందు సవాళ్లు
ఐపీఎల్ సీజన్ 2024కు ముందే గౌతం గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వదిలి కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. కోచ్ ఆండీ ఫ్లవర్‌తో కలిసి ఫ్రాంచైజీని గంభీర్ వరుసగా ప్లే ఆఫ్‌లకు చేర్చాడు. 2024లో వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు జస్టిన్ లాంగర్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే లాంగర్ కోచింగ్‌లో సత్ఫలితాలు రాలేదు. లాంగర్ మార్గనిర్దేశనంలో లక్నో కనీసం టాప్ 4లో కూడా నిలవలేకపోయింది. ఇప్పటికే బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కూడా వైదొలగడంతో లక్నో కష్టాల్లో పడింది.
గౌతమ్ గంభీర్, అభిషేక్ నాయర్‌లతో కలిసి మోర్కెల్ భారత జట్టులో సహాయ కోచ్‌గా చేరాడు. దీంతో టీమిండియా దిగ్గజ బౌలర్ అయిన జహీర్‌ఖాన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా నియమించుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ జహీర్ లక్నో మెంటార్‌గా నియమితుడయ్యాడు.
జహీర్ ఓ దిగ్గజ బౌలర్
టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా జహీర్‌ఖాన్‌కు గుర్తింపు ఉంది. రెండు దశాబ్దాల పాటు సాగిన జహీర్ కెరీర్‌తో ఆటగాడిగా, కోచ్‌గా జహీర్ తనదైన ముద్ర వేశాడు. అక్టోబరు 8, 1978న జన్మించిన జహీర్ ఖాన్ 2000లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత భారత ఫాస్ట్ బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా మారాడు. 2003 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో జహీర్ కీలక సభ్యుడు. 2011 వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన జట్టులో జహీర్‌ఖాన్ సభ్యుడు. జహీర్ 2011 ఐపీఎల్ ఎడిషన్‌లో కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. 92 టెస్ట్ మ్యాచ్‌లలో 32.94 సగటుతో 311 వికెట్లు తీసిన జహీర్... కపిల్ దేవ్ తర్వాత అత్యంత విజయవంతమైన భారతీయ ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
జహీర్ ఖాన్ ఐపీఎల్ కెరీర్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో సహా పలు జట్లకు ఆడాడు. IPLలో 100 వికెట్లు తీసిన 10వ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 100 ఐపీఎల్ మ్యాచులు పూర్తి చేశాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత జహీర్ ఖాన్ కోచ్‌గా మారాడు. గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో కలిసి పనిచేశాడు.