Yuzvendra Chahal Wife: టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. ప్రముఖ యూట్యూబర్, డాన్స్ మాస్టర్ ధనశ్రీ వర్మను 2020 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయని.. విడిపోతున్నారని కూడా చాలాకాలంగా గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ధనశ్రీ వర్మ పెట్టే పోస్టులు కూడా అగ్నికి ఆయువు పోసినట్టుగా ఉండేవి. తాజాగా ధనశ్రీ వర్మ.. చాహల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమ పరిచయానికి ముందే చాహల్ టీమిండియాలో స్టార్‌గా ఎదిగినా తనకు మాత్రం అతడు ఎవరో తెలియదని వ్యాఖ్యానించింది.
చాహల్ స్టార్ అన్న సంగతి తెలియదు..
ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియాతో నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో తన భర్త చాహల్‌తో కలిసి పాల్గొన్న ధనశ్రీ మాట్లాడుతూ... ‘తాము ఎంచుకున్న రంగంలో ప్యాషన్‌తో పనిచేసే వ్యక్తులంటే నాకు చాలా అభిమానం. నేను గతంలో క్రికెట్ రెగ్యులర్‌గా చూసేదానిని. కానీ నేను క్రికెట్ చూడటం మానేశాక చాహల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒకసారి చాహల్.. తనకు డాన్స్ నేర్పించడానికని నాకు మెసేజ్ చేశాడు. అప్పటికీ నాకు చాహల్ ఎవరో తెలియదు..
చాహల్ డాన్స్ క్లాసెస్‌కు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవాడు. చాలా సిన్సియర్‌గా ఉండేవాడు. నాకు అది చాలా నచ్చింది. నేను అప్పుడప్పుడు అతడికి హోమ్ వర్క్ ఇచ్చేదానిని. అతడు వాటిని పూర్తి చేసి ఆ వీడియోలను నాకు పంపేవాడు. వీడియోలను పంపడమే గాక అందులో తాను ఏమైనా తప్పులు చేశానా..? అని అడిగేవాడు. దీంతో అతడి డాన్స్ క్లాసెస్ అనుకున్నదానికంటే రెండు నెలలు ఎక్కువయ్యాయి. అతడిలో నిజాయితీ నాకు చాలా నచ్చింది. నా దగ్గర స్టూడెంట్‌గా ఎలా ఉన్నాడో స్నేహితుడిగా కూడా అంతే నిజాయితీతో ఉన్నాడు. పెళ్లి గురించి కూడా అతడు అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. నేరుగా నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా..? అని అడిగాడు’ అంటూ ధనశ్రీ తెలిపింది.
ఇటీవలి కాలంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘పెళ్లిపై నాకు ఎటువంటి ఒత్తిడి లేదు. నా లైఫ్‌లో నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంతా బాగుంది...’అని చెప్పుకొచ్చింది. చాహల్, ధనశ్రీలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial