Yuvraj Singh First Coaching Stint In IPL:  ఇండియా క్రికెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ అయిన యువరాజ్ సింగ్ ఐపీఎల్ లో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఐపీఎల్ 2027 లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కోచింగ్ స్టాఫ్‌లో యువీ జాయిన్ కానున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ ఢిల్లీ సపోర్ట్ స్టాఫ్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది, దాంతో పాటు తన డగౌట్ లో యువరాజ్ సింగ్ కూడా ఉండాలని దాదా గట్టిగా కోరుకున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌లో జరగబోయే భారీ మార్పుల్లో భాగంగా యువరాజ్ సింగ్‌ను టీమ్‌లోకి తీసుకురానున్నారు. ఐపీఎల్ 2027 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్స్ కంట్రోల్‌ను జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ తీసుకోనుండటంతో ఈ క్రేజీ చేంజెస్ జరుగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ అఫీషియల్ కూడా యువీ టీమ్ లో చేరబోతున్నాడనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.

Continues below advertisement

Read Also: Harshit Rana Returns: చివరి పోరుకు సర్వం సిద్ధం.. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్పీడ్‌స్టర్, అఫ్గాన్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు గిల్ ఆర్మీ పక్కా ప్లాన్!

Continues below advertisement

జీఎంఆర్ నుంచి జేఎస్‌డబ్ల్యూ చేతికి మేనేజ్‌మెంట్..ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని కో-ఓనర్స్ అయిన జీఎంఆర్ (GMR) గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ రెండేళ్ల సైకిల్ చొప్పున ఆల్టర్నేట్‌గా రన్ చేస్తాయి. ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో జీఎంఆర్ గ్రూప్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను చూసుకోగా, నెక్స్ట్ టూ ఇయర్స్ కోసం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ బాధ్యతలు తీసుకోనుంది. గతంలో జేఎస్‌డబ్ల్యూ మేనేజ్‌మెంట్ ఉన్నప్పుడు సౌరవ్ గంగూలీ ఆ టీమ్ సపోర్ట్ స్టాఫ్ లో కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు 2027 సీజన్ కోసం గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా మళ్లీ బాధ్యతలు తీసుకోనున్నాడు. గంగూలీకి  యువరాజ్ సింగ్ పై మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండటంతో, యువీని బ్యాటింగ్ కోచ్‌గా నియమించాలని డిసైడ్ అయ్యాడు.

Read Also: India Smashes Record Total: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భార‌త్ అరుదైన రికార్డు.. ఆ ఫీట్ సాధించిన రెండో టీమ్ గా ఘ‌న‌త‌!

వరుస ఫెయిల్యూర్స్ తో కోచింగ్ స్టాఫ్ ఓవర్ హాల్ఐపీఎల్ 2025, ఐపీఎల్ 2026 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదు. అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ టీమ్ లో కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ రెండు సార్లు ప్లేఆఫ్స్ చేరడంలో ఫెయిల్ అయింది. 2025 లో మంచి స్టార్ట్ దక్కినా సెకండ్ హాఫ్ లో తడబడి ఫిఫ్త్ ప్లేస్ తో ముగించింది. ఇక 2026 సీజన్ లో మరింత పేలవంగా ఆడి పాయింట్స్ టేబుల్ లో సిక్స్త్ ప్లేస్ కే పరిమితమైంది. ఈ వరుస ఫెయిల్యూర్స్ వల్ల ప్రెజెంట్ హెడ్ కోచ్ హేమంగ్ బదాని పొజిషన్ రిస్క్ లో పడింది. దీంతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కోచింగ్ స్టాఫ్‌ను కంప్లీట్‌గా ఓవర్ హాల్ (మార్పులు) చేయాలని ఫిక్స్ అయింది.

ఫ‌స్ట్ అసైన్మెంట్..

మెంటార్ గా సక్సెస్ అయి కోచ్ గా యువీ ఎంట్రీయువరాజ్ సింగ్‌కు ఐపీఎల్ లో కోచ్‌గా ఇదే ఫస్ట్ అసైన్‌మెంట్ కానుంది. గతంలో యువీ నేరుగా ఏ ఫ్రాంచైజీకి కోచ్‌గా చేయకపోయినా, యంగ్ ప్లేయర్స్ అయిన శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలకు పర్సనల్ మెంటార్‌గా ఉండి వారి సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాడు. రిషభ్ పంత్ కూడా ఫామ్ కోల్పోయినప్పుడు యువీ అడ్వైజ్ తీసుకున్నాడు. యువీకి ఉన్న హ్యాండ్స్-ఆన్ అప్రోచ్, ఎక్స్‌పీరియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మెన్స్ టీమ్‌కు ఒక బిగ్ అసెట్ అవుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కాగా, సౌరవ్ గంగూలీ ఈ ఏడాది జరిగిన ఎస్ఏ20 (SA20) టోర్నమెంట్‌లో జేఎస్‌డబ్ల్యూ ఫ్రాంచైజీ ప్రిటోరియా క్యాపిటల్స్‌ను హెడ్ కోచ్‌గా ఉండి ఫైనల్ వరకు లీడ్ చేశాడు. ఇప్పుడు గంగూలీ, యువరాజ్ సింగ్ కాంబినేషన్ ఢిల్లీ క్యాపిటల్స్ తలరాతను మారుస్తుందేమో చూడాలి.