Harshit Rana Linked Up With ODI Squad In Chennai: ఇండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అఫ్గానిస్తాన్‌తో శనివారం చెన్నైలో జరగబోయే లాస్ట్ వన్డే మ్యాచ్ కోసం అతన్ని ఇండియన్ క్రికెట్ టీమ్ స్క్వాడ్‌లోకి సెలెక్ట్ చేశారు. త్రీ-మ్యాచ్ వన్డే సిరీస్‌లో ఫస్ట్ రెండు మ్యాచ్‌లు గెలిచిన ఇండియా ఆల్రెడీ 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు క్లీన్‌స్వీప్ టార్గెట్‌గా పెట్టుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆర్మీకి హర్షిత్ రాణా రాక మరింత బలాన్ని ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026 కు ముందు ముంబైలో సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ టైమ్‌లో హర్షిత్ మోకాలి గాయానికి గురయ్యాడు. దీంతో ఆ మెగా టోర్నమెంట్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ కు కూడా కంప్లీట్‌గా దూరమయ్యాడు.

Continues below advertisement

Read Also: India Smashes Record Total: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భార‌త్ అరుదైన రికార్డు.. ఆ ఫీట్ సాధించిన రెండో టీమ్ గా ఘ‌న‌త‌!

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ పూర్తి..గాయం తర్వాత హర్షిత్ రాణా చాలా రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో చేరిన హర్షిత్, అక్కడ తన రిహాబిలిటేషన్‌ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కోసం టీమ్‌తో జాయిన్ అయ్యాడు. "బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న హర్షిత్ రాణా చెన్నైలో వన్డే స్క్వాడ్‌తో కలిశాడు" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక మీడియా రిలీజ్ లో స్పష్టం చేశారు.

Continues below advertisement

Read Also: Akshara Gupta Triple Century:  మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. కేవలం 126 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం.. బిహార్ నుంచి లేడీ విధ్వంస‌క క్రికెట‌ర్,  సోషల్ మీడియా షేక్!

ఇండియా తరఫున రాణా రికార్డులు24 ఏళ్ల హర్షిత్ రాణా ఇండియా తరఫున ఇప్పటివరకు 14 వన్డేలు ఆడి 27.38 యావరేజ్, 6.21 ఎకానమీ రేట్‌తో 16 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ టీ20ఐ సిరీస్‌లో అతను లాస్ట్ టైమ్ ఇండియా జెర్సీలో కనిపించాడు. అయితే గాయం నుంచి కోలుకున్న వెంటనే అతనికి సెలెక్టర్లు వరుస ఛాన్సులు ఇస్తున్నారు. అఫ్గాన్ మ్యాచ్‌తో పాటు రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో ఆడే ఇండియా స్క్వాడ్‌లో కూడా హర్షిత్‌కు ప్లేస్ దక్కింది. ఈ రెండు టూర్లలో ఇండియా మొత్తం ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న హర్షిత్ రాణా చేపాక్ పిచ్‌పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

అఫ్గాన్ తో థర్డ్ వన్డే కోసం అప్‌డేటెడ్ స్క్వాడ్..సిరీస్ ఆల్రెడీ ఇండియా సొంతం అవ్వడంతో లాస్ట్ వన్డేలో బెంచ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉంది. చెన్నై మ్యాచ్ కోసం బీసీసీఐ అనౌన్స్ చేసిన అప్‌డేటెడ్ స్క్వాడ్ చూస్తే.. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా ఉన్నారు. స్పిన్‌కు సపోర్ట్ చేసే చెన్నై పిచ్‌పై అఫ్గాన్‌ను క్లీన్‌స్వీప్ చేసి సిరీస్‌ను పర్ఫెక్ట్‌గా ముగించాలని టీమిండియా ప్లాన్ చేస్తోంది.