Indian Cricketers Leave For Zimbabwe Tour: జింబాబ్వేతో ఐదు టీ20ల్లో తలపడేందుకు వెళుతున్న యువ భారత్ జట్టులో సాయి సుదర్శన్, జీతీష్ శర్మ , హర్షిత్ రాణా చేరారు. ఈ విషయాన్ని బిసిసిఐ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
టీ 20 ప్రపంచకప్ అలా ముగిసిందో లేదో భారత క్రికెట్(Indian cricketers) జట్టు జింబాబ్వే(Zimbabwe) పర్యటనకు బయల్దేరింది. జూలై 6 నుంచి జింబాబ్వేతో ఐదు టీ20ల్లో తలపడేందుకు శుభ్‌మన్ గిల్(shubman gill) నేతృత్వంలోని భారత జట్టు ఆఫ్రికన్ దేశానికి బయల్దేరింది. ఈ సిరీస్‌కు సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చిన బీసీసీఐ... గిల్ సారథ్యంలో యువకులకు జట్టులో చోటు కల్పించింది. వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) ఈ సిరీల్‌కు భారత్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. భారత క్రికెటర్లు, కోచ్ VVS లక్ష్మణ్ జింబాబ్వేకు బయలుదేరిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో నలుగురు ఓపెనర్లు ఉన్నారు. టీ 20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కిన యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఈ జట్టులో ఉన్నారు. శనివారం హరారేలో జరిగే తొలి టీ20లో గిల్, జైస్వాల్ బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. రోహిత్ శోర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత జింబాబ్వేలో జరిగే సిరీస్.. భారత్ భవిష్యత్తుకు కీలకంగా మారనుంది. ఏ ఆటగాళ్లు రాణిస్తే వారికి టీ 20ల్లో స్థానం ఖాయం కానుంది. రోహిత్ రిటైర్‌మెంట్ తర్వాత ఓపెనింగ్ స్థానం ఖాళీగా ఉంది. టీ20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్‌బైలుగా ఉన్న గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రింకు సింగ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ జింబాబ్వేలో పర్యటించే భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ సిరీస్ పూర్తిగా హరారేలోనే జరగనుంది.
జింబాబ్వే జట్టు ప్రకటన
భారత్‌తో జరిగే అయిదు మ్యాచుల టీ 20 సిరీస్ కోసం ఇరు బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఈ సిరీస్‌లో భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాలని జింబాబ్వే జట్టు పట్టుదలతో ఉంది. సికిందర్ రజా కెప్టెన్సీలో జింబాబ్వే ఇటీవల సంచలన విజయాలు నమోదు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. టీ 20 ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోయినా జింబాబ్వేను తక్కువ అంచనా వేయలేం. తమదైన రోజున ఎంత పెద్ద జట్టును అయినా జింబాబ్వే మట్టికరిపించగలదు.
భారత జట్టు: : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే
జింబాబ్వే: సికందర్ రజా (కెప్టెన్), అక్రమ్ ఫరాజ్, బెన్నెట్ బ్రియాన్, క్యాంప్‌బెల్ జోనాథన్, చతార టెండై, జోంగ్వే ల్యూక్, కైయా ఇన్నోసెంట్, మదాండే క్లైవ్, మాధేవెరె వెస్లీ, మారుమణి తడివానాషే, మసకద్జా వెల్లింగ్టన్, మవుతా బ్రాండన్, ముజరబానియోన్, ముజరబానియన్, ముజరబానియోన్, ముజరబానియోన్, నగరవ రిచర్డ్, శుంబా మిల్టన్.